చౌటుప్పల్
Jump to navigation
Jump to search
చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఒక భాగం.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]
2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంక వివరాలు[మార్చు]
చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033
చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.