Jump to content

చౌదరి లాల్ సింగ్

వికీపీడియా నుండి
చౌదరి లాల్ సింగ్
చౌదరి లాల్ సింగ్


అటవీ, పర్యావరణ, జీవావరణ శాస్త్ర మంత్రి[1]
పదవీ కాలం
1 మార్చి 2015 – 14 ఏప్రిల్ 2018
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత గవర్నర్ పాలన
నియోజకవర్గం బసోహ్లి

పదవీ కాలం
2014 – 2018
ముందు జగదీష్ రాజ్ సపోలియా
నియోజకవర్గం బసోహ్లి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2024 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ (DSSP) (2024కి ముందు) [3]
జీవిత భాగస్వామి కాంత అండోత్ర
నివాసం 2, పోలీస్ లైన్స్ రోడ్, డౌన్ టౌన్, కథువా, జమ్మూ కాశ్మీర్

చౌదరి లాల్ సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ, జీవావరణ శాస్త్ర మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

చౌదరి లాల్ సింగ్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి 1996 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి నియోజకవర్గం నుండి అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2002 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై కాంగ్రెస్ - పిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో ఆరోగ్య & వైద్య విద్య మంత్రిగా పని చేశాడు. చౌదరి లాల్ సింగ్ 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో ఉదంపూర్ నియోజకవర్గం నుండి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

చౌదరి లాల్ సింగ్ 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉదంపూర్ నియోజకవర్గం నుండి ఆగస్టు 2014లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి[4] 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ, జీవావరణ శాస్త్ర మంత్రిగా పని చేశాడు.

చౌదరి లాల్ సింగ్ కతువా రేప్ కేసు తర్వాత 2018లో బీజేపీని వీడి[5] 2019 లోక్‌సభ ఎన్నికలలో ఉదంపూర్ నియోజకవర్గం నుండి డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరి[6] 2024 లోక్‌సభ ఎన్నికలలో ఉదంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. చౌదరి లాల్ సింగ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "Council of Ministers : J&K Govt."
  2. "Basohli- J&K Assembly Election 2014"
  3. "Dogra Swabhimaan Sangathan Party"
  4. "Former Congress MP Lal Singh joins BJP" Archived 2 ఏప్రిల్ 2015 at the Wayback Machine
  5. "Lal Singh, who quit as J&K minister over Kathua rape row, resigns from BJP". 7 February 2019. Retrieved 16 October 2024.
  6. "Back in Congress, Lal Singh looks to defend bastion of Basohli against BJP". 14 September 2024. Retrieved 16 October 2024.
  7. The Hindu (8 October 2024). "J&K Assembly polls: Congress leader Lal Singh suffers another defeat in Basholi constituency" (in Indian English). Retrieved 16 October 2024.
  8. "J&K polls: Lal Singh suffers another defeat in Basholi after LS elections". 8 October 2024. Retrieved 16 October 2024.