జక్కల వెంకన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జక్కల వెంకన్న
జననంఆగస్టు 30, 1976
వృత్తిటీవి రచయిత, దర్శకుడు
జీవిత భాగస్వామినాగమణి
పిల్లలురుద్రసాయి, మోక్షజ్ఞ
తల్లిదండ్రులుసాయిలు, నర్సమ్మ

జక్కల వెంకన్న తెలుగు టెలివిజన్ రచయిత, దర్శకుడు, సినిమా రచయిత. ఈటీవి-2లో ప్రసారం అయిన 'నేరాలు - ఘోరాలు' సీరియల్ కు రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్ గా కొనసాగుతున్నాడు. 2013లో నాలో.. నేను అనే వీక్లీ సీరియల్ కు దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ 'నంది' అవార్డు (2011) అందుకున్నాడు.[1]

జీవిత విషయాలు

[మార్చు]

ఆగస్టు 30, 1976లో ఎర్రబెల్లి (జూలకంటివారిగూడెం) గ్రామం, నిడమానూరు మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణలో జన్మించాడు.[2] తల్లిదండ్రులు సాయిలు - నర్సమ్మ. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీల రీత్యా ప్రాధమిక విద్య 1వతరగతి నుంచి 4వతరగతి 'నాగార్జునసాగర్' లో,  5వతరగతి సూర్యాపేటలో, 6వతరగతి నుంచి 10వతరగతి వరకు 'గరిడేపల్లి'లో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ 'నేరేడుచర్ల'లో చదివాడు. ఆ తరువాత హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ లో బిఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశాడు.

టెలివిజన్

[మార్చు]

ఎలాంటి సినీ, టీవీ నేపథ్యం లేకుండా చదువుతూనే తనకున్న రచనా, దర్శకత్వ ఆసక్తితో 1998వ సంవత్సరం జెమినీ టీవిలో ప్రసారం అయిన 'పోలీస్ ఫైల్' సీరియల్ కి 'అసిస్టెంట్ డైరెక్టర్' గా ప్రస్థానం మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే ఇటు థియేటర్ఆర్ట్స్ లో నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2001లో ఈటీవి-2లో 'నేరాలు - ఘోరాలు' క్రైమ్ సీరియల్ (యధార్ధగాధలు) తో దర్శకుడిగా మొదటిసారి అడుగుపెట్టి, ఈటీవిలో ప్రసారం అయిన 'నమ్మలేనినిజాలు' సీరియల్ కు దర్శకుడిగా చేశాడు. నేరాలు-ఘోరాలు, నమ్మలేని నిజాలు సీరియల్స్ సూపర్ హిట్ అవడంతో క్రైమ్ కథావస్తువుతోనే చాలా సీరియల్స్ కు రచన, దర్శకత్వ సహకారం అందిస్తూ వచ్చాడు. ఎన్ టివిలో ప్రసారం అయిన 'క్రిమినల్' ధారావాహికకు, 'వనిత' టీవిలో ప్రసారం అయిన'నాలో..నేను..!' అనే వీక్లీ సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు.[2]

సినిమాలు

[మార్చు]

2005లో 'వలయం' చిత్రానికి మాటలు రాశాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు రచనా సహకారం అందించాడు.

మీడియా

[మార్చు]

టివి5 న్యూస్ ఛానల్ లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా, వనిత టీవిలో ఫిల్మ్ డెస్క్ ఇన్చార్జీ గా, 'మల్లెమాల' ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా పనిచేశాడు.

రచయితగా

[మార్చు]

చిన్నప్పటినుండే రచన పట్ల ఆసక్తితో తన 8 వ క్లాస్ లోనే ఆంధ్రభూమి (వీక్లీ), ఆంధ్రప్రభ (వీక్లీ), స్వాతి (వీక్లీ) పత్రికల్లో కథలు, కవితలు రాయడం ప్రారంభించాడు. కొద్దికాలానికి ఆంధ్రభూమి దినపత్రిక 'వెన్నెల' పేజిలో 'సినిమా రివ్యూస్' కంటిన్యూస్ గా రాయడంతో మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే మహిళలు, పర్యావరణం, చిన్నపిల్లల సైకాలజీ మీద వివిధ వార, మాస, దిన పత్రికల్లో వ్యాసాలు అచ్చయ్యాయి.

  • ఈటీవీలో ప్రసారమవుతున్న 'పద్మావతి కళ్యాణం' డైలీ సీరియల్ కి 'స్క్రీన్ ప్లే' రైటర్'గా
  • ఓటిటి సంస్థలకి వెబ్ సిరీస్ లకు రైటర్ గా
  • హిందీ, తెలుగు వెబ్ సిరీస్ కి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా

వెబ్ సిరీస్

[మార్చు]

యూట్యూబ్ ఛానల్స్ కోసం సుమారు 70 వరకు షార్ట్ ఫిల్మ్స్, 4 వెబ్ సిరీస్ లు దర్శకత్వం వహించాడు.

అవార్డులు

[మార్చు]
  • 2013లో నాలో.. నేను అనే వీక్లీ సీరియల్ కు దర్శకుడిగా 2011 ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ 'నంది' అవార్డు[3]
  • 2010లో 'వనిత టీవి'లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించినందుకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు
  • దామోదర సంజీవయ్య మెమోరియల్ అవార్డు

మూలాలు

[మార్చు]
  1. vittal (2012-11-13). "2011 బుల్లితెర నందివర్ధనాలు| మమతలకోవెల,చిట్టెమ్మకథ,నాభూమి,జోగిని - TeluguMirchi.com". Retrieved 2023-04-16.
  2. 2.0 2.1 2013 జూన్ 10వ తేదీన ఈనాడు-నల్గొండ జిల్లా పేపర్లో వచ్చిన ''ప్రతిభకు పురస్కారం గరిడేపల్లి యువకున్ని వరించిన నంది'' అనే న్యూస్ నుండి
  3. సినీవినోదం (2012-11-16). "టీవీ నంది 2011 అవార్డుల ప్రకటన". సినీవినోదం. Retrieved 2023-04-16.

బాహ్య లింకులు

[మార్చు]