జస్టిన్ కెంప్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జస్టిన్ మైల్స్ కెంప్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్వీన్స్‌టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | 1977 అక్టోబరు 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కెంపీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 279) | 2001 20 January - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2005 16 December - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 63) | 2001 14 January - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2007 23 October - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 5) | 2005 21 October - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2007 20 September - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996/97–2002/03 | Eastern Province | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | Worcestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04–2004/05 | Northerns | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05–2006/07 | Nashua Titans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2009 | Kent Spitfires | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2015/16 | Cape Cobras | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–11 | Chennai Super Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | Western Province | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Antigua Hawksbills | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2017 15 October |
జస్టిన్ మైల్స్ కెంప్ (జననం 1977, అక్టోబరు 2) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు.
జననం
[మార్చు]జస్టిన్ మైల్స్ కెంప్ 1977, అక్టోబరు 2న దక్షిణాఫ్రికాలో జన్మించాడు. ఇతడు క్రికెట్ ఆడిన 3వ తరం క్రికెటర్, ఇతని తాత జాన్ మైల్స్ కెంప్ 1947-48లో బోర్డర్ కోసం ఒకే మ్యాచ్ ఆడాడు, ఇతని తండ్రి జాన్ వెస్లీ కెంప్ 1975-76, 1976-77లో అదే ప్రావిన్స్‌లో మూడుసార్లు ఆడాడు. ఇతని బంధువు మాజీ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ డేవిడ్ కల్లాగన్.[1]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]కెంప్ 2001, జనవరి 14న శ్రీలంకతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[2] ఒక వారం తర్వాత శ్రీలంకపై కూడా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[3] 2000/2001 సీజన్‌లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళాడు. కానీ ఇతను ఎక్కువ పరుగులు చేయలేదు. 6 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్ళతో కలిసి గంజాయి తాగినట్లు అంగీకరించినప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు.[4] ఇతను మరో ఎనిమిది వన్డే మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. కానీ మళ్ళీ నిరాశపరిచాడు, తొలగించబడ్డాడు. ఇతను ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆడేందుకు ఎంపికయ్యే వరకు దాదాపు మూడు సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో కెంప్ ఇన్నింగ్స్‌లో 50 బంతుల్లో 7 సిక్సర్లతో 80 పరుగులు చేసి తన పెద్ద హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో ఇతను జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 5 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌లో అతని రెండవ పర్యటనలో ట్రినిడాడ్‌లో 65 పరుగులు చేశాడు.
ఆఫ్రో-ఆసియన్ కప్‌లో ఆఫ్రికాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు. 2005/2006 దక్షిణాఫ్రికా సీజన్‌లో అతను బ్లూమ్‌ఫోంటెయిన్‌లో 64 బంతులలో 73 పరుగులు చేయడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. కెంప్ తన మొదటి భారత పర్యటనకు వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాడు, అక్కడ జాక్వెస్ రుడాల్ఫ్ పెర్త్‌లో దక్షిణాఫ్రికాకు డ్రాగా నిలిచిన భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన ఆటతీరు ప్రదర్శించాడు. రెండవ టెస్ట్‌కు తీసుకోబడలేదు. అప్పటినుండి ఒక టెస్ట్ మ్యాచ్‌లో తీసుకోబడలేదు. శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పాల్గొన్న విబి సిరీస్‌లో కేవలం 17.00 సగటుతో ఆడాడు. న్యూలాండ్స్ కేప్ టౌన్‌లో 41 బంతుల్లో 51 పరుగులు చేసి ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు అతను త్వరగా ఫామ్‌లోకి వచ్చాడు.
ఇండియన్ క్రికెట్ లీగ్
[మార్చు]2008లో ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చేరాడు. దీనిని ఏ క్రికెట్ బోర్డు లేదా ఐసీసీ గుర్తించలేదు, తద్వారా దక్షిణాఫ్రికాతో తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడు. ఐసీఎల్‌లో కెంప్ హైదరాబాద్ హీరోస్ జట్టు తరఫున ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
[మార్చు]జస్టిన్ మైల్స్ కెంప్ 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో $100,000కి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో చేరాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Justin Kemp: 9 facts about the big-hitting South African all-rounder". Cricket Country. Retrieved 30 April 2021.
- ↑ "5th ODI: South Africa v Sri Lanka at Bloemfontein, Jan 14, 2001 | Cricket Scorecard | ESPNcricinfo". ESPNcricinfo. Retrieved 3 May 2017.
- ↑ "3rd Test: South Africa v Sri Lanka at Centurion, Jan 20-22, 2001 | Cricket Scorecard | ESPNcricinfo". ESPNcricinfo. Retrieved 3 May 2017.
- ↑ "South African players fined for smoking marijuana". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 3 May 2017.