జస్టిస్‌ దీపక్‌ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్టిస్‌ దీపక్‌ మిశ్రా
636395742247793364.jpg
జననం దీపక్‌ మిశ్రా
అక్టోబరు 3 1953
ఒడిశా , భారతదేశం
వృత్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.

భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తి.

జననం[మార్చు]

జస్టిస్‌ మిశ్రా 1953 అక్టోబరు 3న ఒడిసాలో జన్మించారు.

జీవిత విశేషాలు[మార్చు]

1977 ఫిబ్రవరి 14న అడ్వకేట్‌గా ఎన్‌రోల్‌ అయ్యారు. రాజ్యంగం, సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, సేవా, అమ్మకం పన్ను సంబంధిత కేసుల్లో ఒడిసా హైకోర్టు, సర్వీస్‌ ట్రైబ్యునల్‌లో ప్రాక్టీస్‌ చేశారు. 1996లో ఒడిసా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది మధ్యప్రదేశ్‌ హైకోర్టుకి బదిలీ అయ్యారు. మరుసటి సంవత్సరమే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010 మే నెల వరకు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే ఏడాది అక్టోబరు 2 వరకు కొనసాగనున్నారు. జస్టిస్‌ మిశ్రా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా మేనల్లుడు. ప్రస్తుతం కావేరి, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా కేసు తదితర అంశాలను విచారిస్తున్న బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షను ఖరారు చేసిన బెంచ్‌కు నేతృత్వం వహించారు. దేశమంతటా సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందుకు జాతీయ గీతం వినిపించాలన్న బెంచ్‌లో కూడా ఆయన సభ్యుడు. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ పిటీషన్‌పై అర్ధరాత్రి విచారణ చేపట్టి.. అతనికి విధించిన ఉరి శిక్షను రద్దు చేయడానికి తిరస్కరించిందీ జస్టిస్‌ మిశ్రాయే. హైకోర్టు జడ్జి కర్ణన్‌కు జైలు శిక్ష విధించిన బెంచ్‌లోనూ ఉన్నారు. పరువు నష్టం కేసును క్రిమినల్‌ కేసుగా పరిగణించకూడదన్న ప్రతిపాదనను తోసిపుచ్చి.. వాక్‌ స్వాతంత్య్రం హక్కు అంటే ఇతరుల పరువు తీయడం కాదని స్పష్టం చేసిందీ జస్టిస్‌ మిశ్రాయే.[1]

మూలాలు[మార్చు]

  1. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా. ఆంధ్రజ్యోతి http://www.andhrajyothy.com/Artical.aspx?SID=457446. Retrieved 29 August 2017.  Missing or empty |title= (help)