రంగనాథ్ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగనాథ్ మిశ్రా
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ[1]
In office
1998–2004
నియోజకవర్గంఒడిశా
21వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1990 సెప్టెంబరు 25 – 1991 నవంబరు 24
Appointed byరామస్వామి వెంకట్రామన్
అంతకు ముందు వారుసబ్యసాచి ముఖర్జీ
తరువాత వారుకమల్ నారాయణ్ సింగ్
మొదటి ఛైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా
In office
1993 అక్టోబరు 12 – 1996 నవంబరు 24
ఒడిశా గవర్నర్
In office
1982 జూన్ 25 – 1982 ఆగస్టు 31
అంతకు ముందు వారుచెప్పుదిర ముతాన పూనాచ
తరువాత వారుచెప్పుదిర ముతాన పూనాచ
వ్యక్తిగత వివరాలు
జననం(1926-11-25)1926 నవంబరు 25
బానాపూర్, బీహార్ - ఒరిస్సా ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం2012 సెప్టెంబరు 13(2012-09-13) (వయసు 85)
భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్[2]
కళాశాలరావెన్‌షా కళాశాల, కటక్
అలహాబాద్ విశ్వవిద్యాలయం, ప్రయాగ్‌రాజ్

రంగనాథ్ మిశ్రా (1926 నవంబరు 25 - 2012 సెప్టెంబరు 13) భారతదేశ 21వ ప్రధాన న్యాయమూర్తి, 1990 సెప్టెంబరు 25 నుండి 1991 నవంబరు 24 వరకు ఆయన విధులు నిర్వర్తించాడు. ఆయన భారత జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. ఆయన 1998, 2004 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ నుండి రాజ్యసభ సభ్యునిగా కూడా కొనసాగాడు. ఇలా చేయడంలో ఆయన రెండవవాడు. దీనికి ముందు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి భారత జాతీయ కాంగ్రెస్ నుండి రాజ్యసభకు బహరుల్ ఇస్లాం ఎన్నికయ్యాడు[3]

కుటుంబ నేపథ్యం[మార్చు]

రంగనాథ్ మిశ్రా 1926 నవంబరు 25న ఒడిషాలోని బాణాపూర్‌లో ఒడియా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

ఆయన తండ్రి గోదాబరీష్ మిశ్రా ఒడియా సాహిత్యవేత్త, కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, గోదాబరీష్ మిశ్రా 1941లో ఒరిస్సా రాష్ట్రానికి విద్యా మంత్రిగా చేసాడు, అయితే అప్పటికి భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఆ సమయంలో ఆయన భుబనేశ్వర్లో ఉత్కల్ యూనివర్సిటీ స్థాపనలో కీలకపాత్ర పోషించాడు. అతని ముగ్గురు కొడుకులలో రంగనాథ్ మిశ్రా చిన్నవాడు.

రంగనాథ్ మిశ్రా పెద్ద సోదరుడు లోకనాథ్ మిశ్రా, రాజాజీ నేతృత్వంలోని స్వతంత్ర పార్టీ, ఆ తరువాత జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన రాజ్యసభ సభ్యునిగా, అస్సాం, నాగాలాండ్ గవర్నర్‌గా కూడా అనేక పర్యాయాలు పనిచేశాడు. లోక్‌నాథ్ మిశ్రా కుమారుడు పినాకి మిశ్రా బిజూ జనతాదళ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ.

రంగనాథ్ మిశ్రా రెండవ సోదరుడు రఘునాథ్ మిశ్రా, బాన్పూర్ నియోజకవర్గం నుండి ఒరిస్సా శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. రఘునాథ్ కుమారుడు, దీపక్ మిశ్రా భారతదేశ 45వ ప్రధాన న్యాయమూర్తిగా 2017 ఆగస్టు 28 నుండి 2018 అక్టోబరు 2 వరకు పదవిలో ఉన్నాడు.

రంగనాథ్ మిశ్రా బాన్పూర్ ఉన్నత పాఠశాల, పి.ఎం. అకాడమీ, తరువాత రావెన్‌షా కళాశాల, అలహాబాద్ విశ్వవిద్యాలయంలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆయనకు చిన్న వయస్సులోనే సుమిత్రా మిశ్రాను వివాహం చేసుకున్నాడు. 1950లో, వారికి దేవానంద మిశ్రా అనే కుమారుడు జన్మించాడు, దేవానంద మిశ్రా సుప్రీంకోర్టుతో పాటు, ఒరిస్సా హైకోర్టులోనూ సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసాడు. 2009లో, 59 సంవత్సరాల వయస్సులో దేవానంద మిశ్రా మరణించాడు. కొడుకు అకాల మృతి రంగనాథ్ మిశ్రా దంపతులను తీవ్రమైన మనోవేదనను మిగిల్చింది.

కెరీర్[మార్చు]

1950 సెప్టెంబరు 18న, రంగనాథ్ మిశ్రా ఒరిస్సా హైకోర్టు, కటక్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని, ఆయన 1969 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసాడు. ఆయన 1980 నవంబరు 6 నుండి 1981 జనవరి 16 వరకు ఒరిస్సా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తరువాత, ఆయన ఒరిస్సా హైకోర్టుకు శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. 1983లో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయిన ఆయన 1990 సెప్టెంబరు 25న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిరోహించాడు. 1991 నవంబరు 24న పదవీ ఆయన విరమణ చేశాడు.

పదవీ విరమణ అనంతర సేవలు[మార్చు]

ఆయన 1992 నుండి ఆల్ ఇండియా బాయ్ స్కౌట్స్ అసోసియేషన్‌కు చీఫ్ స్కౌట్‌గా పనిచేశాడు.[4] 1993లో, ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ ఇండియాకు మొదటి ఛైర్మన్ అయ్యాడు. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుండి 1998 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యుడుగా వ్యవహరించాడు.[5]

మరణం[మార్చు]

అనారోగ్య సమస్యలతో రంగనాథ్ మిశ్రా 2012 సెప్టెంబరు 13న భువనేశ్వర్‌లో తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య సుమిత్రా మిశ్రా, మనవడు ఆనంద్ మిశ్రా ఉన్నారు.[6]

మూలాలు[మార్చు]

  1. "Former CJI Ranganath Mishra Dead". Outlook. 13 September 2012. Retrieved 19 March 2020.
  2. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). రాజ్యసభ. Retrieved 19 March 2020.
  3. "Former CJI Ranjan Gogoi nominated to Rajya Sabha, less than 6 months after retirement". Debayon Roy. ThePrint. 16 March 2020. Retrieved 16 March 2020.
  4. "Law Book Shop".
  5. "Alphabetical List Of All Members Of Rajya Sabha Since 1952". Retrieved 30 December 2012. Misra Shri Ranganath Odisha INC 02/07/1998 01/07/2004
  6. "Ranganath Misra passes away". The Hindu (in Indian English). 14 September 2012.