జాతీయ రహదారి 744
National Highway 744 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 44 యొక్క సహాయక మార్గం | ||||
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ | ||||
పొడవు | 206 కి.మీ. (128 మై.) | |||
History | 2000 లో దీన్ని 'ఎన్‌హెచ్-208' గా ప్రకటించారు | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | ఎన్‌హెచ్ 66 కొల్లాం లో | |||
తూర్పు చివర | ఎన్‌హెచ్ 44 తిరుమంగళం (తమిళనాడు)లో | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | కేరళ, తమిళనాడు | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 744 లేదా ఎన్‌హెచ్ 744 (పూర్వపు ఎన్‌హెచ్ 208) [1] దక్షిణ భారతదేశం లోని జాతీయ రహదారి. ఇది కేరళలోని కొల్లాం (క్విలాన్) ను తమిళనాడు లోని మదురైతో కలుపుతుంది. [2] కొల్లాంలోని చిన్నక్కాడ వద్ద ఎన్‌హెచ్ 66 నుండి మొదలై, ఇది మదురైలోని తిరుమంగళం వద్ద జాతీయ రహదారి 44 ని కలుస్తుంది. [2]
మార్గం వివరణ
[మార్చు]చారిత్రికంగా ఈ మార్గం జీడిపప్పు, తదితర సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే కొల్లాం జిల్లాను పూర్వపు మద్రాసు రాష్ట్రంతో కలిపేది. ప్రస్తుతం ఈ రహదారి గుండా తమిళనాడు నుంచి వివిధ రకాల సరుకులతో లారీలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ రహదారి ఆర్యంకావు వద్ద తక్కువ ఎత్తులో ఉన్న గ్యాప్ గుండా ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాల గుండా వెళుతుంది. ముఖ్యంగా తెన్మల నుండి సెంగోట్టై వరకు ఆహ్లాదకరంగా సాగుతుంది. చారిత్రికమైన కొల్లాం-సెంగోట్టై రైలు మార్గం ఈ రోడ్డు పక్కనే వెళుతుంది. [3]
చిన్నకాడ → కల్లుమ్తాఝం → కేరళపురం → కుందర → ఎజుకొనే → కొట్టారక్కర → మేలిల → కున్నికోడ్ → విళక్కుడి → పునలూర్ → ఎడమన్ → తేన్మల → కజుతురుట్టి → అరుట్టి తెన్కాసి → కడయనల్లూరు → పులియంగుడి → వాసుదేవనల్లూర్ → శివగిరి → సెయ్యూరు → రాజపాళయం → శ్రీవిల్లి పుత్తూరు → అలగాపురి → టి. కల్లుపట్టి → తిరుమంగళం [4]
భవిష్యత్తు
[మార్చు]వార్తా నివేదికలు,[5] ఎన్‌హెచ్ఏఐ వారి[6] టెండరు, ప్రాజెక్టు డేటాల ప్రకారం, ఎన్‌హెచ్ 744 లోని తిరుమంగళం (ఎన్‌హెచ్ 44 లో) రాజపాళయం ల మధ్య ఉన్న మొత్తం 68 కి.మీ. దూరాన్ని నాలుగు వరుసల హైవేగా మారుస్తారని నిర్ధారణ అయింది.
ప్రధాన కూడళ్లు
[మార్చు]రాష్ట్రం | జిల్లా | స్థానం | కి.మీ. | మై | గమ్యస్థానాలు | గమనికలు |
---|---|---|---|---|---|---|
తమిళనాడు | మదురై | తిరుమంగళం | 0 | 0 | ఎన్‌హెచ్ 44 - మదురై, కన్యాకుమారి | రహదారికి తూర్పు కొన. |
విరుదునగర్ | అళగపురి | 32 | 20 | ఎస్‌హెచ్ 182 - విరుదునగర్ | ||
శ్రీవిల్లి పుత్తూరు | 86 | 53 | ఎస్‌హెచ్ 42 - శివకాశి | |||
తిరునెల్వేలి | పులియంకుడి | 136 | 85 | ఎస్‌హెచ్ 76 - శంకరన్‌కోయిల్ | ||
తెన్‌కాశి | 167 | 104 | ఎస్‌హెచ్ 39 / ఎస్‌హెచ్ 40 - పావూర్‌చత్రం, కూర్తాళం | |||
సెన్‌గొట్టై | 173 | 107 | ఎస్‌హెచ్ 40 - కూర్తాళం | |||
కేరళ | కొల్లాం | తెన్‌మల | 202 | 126 | ఎస్‌హెచ్ 2 - తిరువనంతపురం | |
పునలూర్ | 223 | 139 | ఎస్‌హెచ్ 48 / ఎస్‌హెచ్ 8 - అంచాల్, ఆయూర్, పత్థనపురం | |||
కొట్తరక్కర | 241 | 150 | ఎస్‌హెచ్ 1 - తిరువనంతపురం, కొట్టాయం, అంగమాలి | |||
కొల్లాం | 264 | 164 | ఎన్‌హెచ్ 66 - తిరువనంతపురం, అట్టంగళ్, ఎర్నాకులం | రహదారి పశ్చిమ కొన. కొల్లాం బైపాస్. | ||
1.000 mi = 1.609 km; 1.000 km = 0.621 mi |
గ్యాలరీ
[మార్చు]-
కడపకాడ,కొల్లాం నగరం వద్ద ఎన్‌హెచ్-744
-
ఎన్‌హెచ్ 744 పక్కన, 13 తేన్మలపక్కన రింగ్ బ్రిడ్జ్
-
ఎన్‌హెచ్ 744లో ఒక సైన్ బోర్డు
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా (హైవే నంబర్ ద్వారా)
- భారత జాతీయ రహదారుల జాబితా
- జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు
మూలాలు
[మార్చు]- ↑ "Kerala PWD - National Highways". www.keralapwd.gov.in. Archived from the original on 2014-09-03.
- ↑ 2.0 2.1 Details of National Highways in IndiaArchived 10 ఏప్రిల్ 2009 at the Library of Congress Web Archives
- ↑ "Government sanctions INR 3440 Cr for projects in Kerala". Devdiscourse. 9 August 2018. Retrieved 10 August 2018.
- ↑ Google maps
- ↑ "Maalaimalar News: திருமங்கலம்-ராஜபாளையம் வரை 68 கிலோ மீட்டர் தூரத்திற்கு 4 வழிசாலையாக மாற்றம்: பொன்.ராதாகிருஷ்ணன் || Tirumangalam Rajapalayam 68 km to the modification 4 path road ponradhakrishnan". www.maalaimalar.com. Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-03.
- ↑ "Project Reporter | Four Laning of Thirumangalam to Rajapalayam Section". Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-03.