జాఫర్ హుస్సేన్
జాఫర్ హుస్సేన్ మెరాజ్ | |||
| |||
తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2014 - ప్రస్తుతం | |||
ముందు | విరాసత్ రసూల్ ఖాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాంపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్
| |||
పదవీ కాలం 2009 - 2012 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1960 జనవరి 26||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||
తల్లిదండ్రులు | అహ్మద్ హుస్సేన్ - జాహేదా బేగం | ||
జీవిత భాగస్వామి | ఫర్జానా బానో | ||
సంతానం | ఇద్దరు కుమారులు (మిన్హాజ్ హుస్సేన్, మక్సూద్ హుస్సేన్), ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | హశీమాబాదు, హైదరాబాదు |
జాఫర్ హుస్సేన్ మెరాజ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున నాంపల్లి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] 2009 నుండి 2012 వరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు డిప్యూటీ మేయర్ గా విధులు నిర్వహించాడు.
జననం, విద్యాభ్యాసం
[మార్చు]జాఫర్ హుస్సేన్ మెరాజ్ 1960, జనవరి 26న అహ్మద్ హుస్సేన్ - జాహేదా బేగం దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. తండ్రి అహ్మద్ హుస్సేన్ 1967లో సీతారాంబాగ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. జాఫర్ హుస్సేన్ మెరాజ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]జాఫర్ హుస్సేన్ మెరాజ్ కు ఫర్జానా బానో తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (మిన్హాజ్ హుస్సేన్, మక్సూద్ హుస్సేన్), ఇద్దరు కుమార్తెలు.[2] 2018లో చిన్న కుమారుడు మక్సూద్ హుస్సేన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించాడు.[3]
రాజకీయ విశేషాలు
[మార్చు]జాఫర్ హుస్సేన్ 2009 మున్సిపల్ ఎన్నికల్లో టోలిచౌకి నుండి తొలిసారిగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఎన్నికయ్యాడు. ఆ సమయంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై 17,296 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై 9,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] జాఫర్ హుస్సేన్‌కు 57,940 ఓట్లు రాగా, ఫిరోజ్ ఖాన్‌కు అనుకూలంగా 48,265 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ 17,015 ఓట్లతో నిలిచాడు. [8]
పదవులు
[మార్చు]- 2009 - 2014: కార్పోరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్
- 2009 - 2012: డిప్యూటీ మేయర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్
ఇతర వివరాలు
[మార్చు]ఇరాన్, మలేషియా, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Ensuring water supply is priority: Nampally MLA-elect". thehindu.com. Retrieved 25 May 2014.
- ↑ "AIMIM MLA Jaffer Mehraj's son passes away". telanganatoday.com. Retrieved 28 Dec 2018.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=1805
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-29. Retrieved 2019-06-06.
- ↑ http://myneta.info/telangana2018/candidate.php?candidate_id=4987
- ↑ "TS Election results: AIMIM's Jaffar Hussain Meraj retains Nampally". telanganatoday.com. Retrieved 11 Dec 2018.