Jump to content

గోపాల రామానుజం

వికీపీడియా నుండి
(జి.రామానుజం నుండి దారిమార్పు చెందింది)
గోపాల రామానుజం

ఒడిశా గవర్నరు

ఒడిశా గవర్నరు

భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ అధ్యక్షుడు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
వృత్తి రాజకీయనాయకుడు
మతం హిందూమతం

గోపాల రామానుజం (1915–2001) భారతీయ రాజకీయనాయకుడు, భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రేసు సహస్థాపకుడు.[1] ఈయన 1915 మే 28న తమిళనాడు రాష్ట్రం, రామనాథపురం జిల్లాలోని ఎదిర్‌కొట్టాల్ గ్రామంలో జన్మించాడు.[2] ఈయన మూడవ అత్యున్నత భారత జాతీయ పురస్కారమైన పద్మభూషణ పురస్కార గ్రహీత.[3]

కార్మిక సంఘం

[మార్చు]
గోపాల రామానుజం

రామానుజం 1945 నుండి 1947 వరకు హిందుస్తాన్ మజ్దూర్ సేవక్ సంఘంలో, మహాత్మా గాంధీ స్థాపించిన అహ్మదాబాదులోని మజూర్ మహాజన్‌లో, కార్మిక సంఘపు పనిలో శిక్షణ పొందాడు. 1958 నుండి 1960 కాంగ్రేసుపార్టీ కార్మికవర్గ సంఘమైన భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రేసు అధ్యక్షుడిగాను, 1964 నుండి 1984 వరకు ప్రధానకార్యదర్శిగానూ ఉన్నాడు. 1985లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవిలో 1994, ఆగస్టు 3 వరకు పనిచేశాడు. వర్తకసంఘాలపై ఈయన కున్న నిబద్ధతను సత్కరిస్తూ, చెన్నైకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ హార్మనీ ప్రతి యేటా జి.రామానుజం స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈయన పేరు మీద తమిళనాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్లో ఒక శాశ్వత ఆచార్యపీఠం కూడా ఉంది.[4]

గవర్నరు

[మార్చు]

రామానుజం 1994, ఆగస్టు 4 నుండి 1995 జూన్ 15 వరకు గోవా గవర్నురుగా పనిచేశాడు.[5] 1995 జూన్ 18 నుండి 1997 జనవరి 30 వరకు ఒడిశా గవర్నరుగా పనిచేశాడు 1997 ఫిబ్రవరి 13 నుండి 1997 డిసెంబరు 13 వరకు మరోసారి ఒడిశా గవర్నరుగా ఉన్నాడు.[6] ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేస్తున్న కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, రామానుజం 1997, ఆగస్టు 22 నుండి నవంబరు 23 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా అదనపు బాధ్యతలు చేపట్టాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-11. Retrieved 2017-10-20.
  2. http://orissa.gov.in/e-magazine/orissaannualreference/ORA-2005/pdf/bio-data_of_governor.pdf
  3. "List of Odisha Governors" (PDF). Orissa Annual Reference. 2016. Archived from the original (PDF) on 2017-02-07. Retrieved May 6, 2016.
  4. http://www.tn.gov.in/pressrelease/archives/pr2004/pr060404/pr060404.htm
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-26. Retrieved 2011-07-09.
  6. "Archived copy". Archived from the original on 2012-02-25. Retrieved 2017-10-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-25. Retrieved 2017-10-20.