జి. ఎస్. బసవరాజ్
జిఎస్ బసవరాజ్ | |
---|---|
Assumed office 2019 మే 23 | |
అంతకు ముందు వారు | ఎస్పి ముద్దయ్యగౌడ |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | ఎస్ మల్లికార్జునయ్య |
తరువాత వారు | ఎస్ ముద్దప్ప గౌడ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గంగసంద్ర తుమకూరు తుమకూరు జిల్లా కర్ణాటక భారతదేశం | 1941 మే 4
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | ఎస్ శకుంతల |
సంతానం | ఇద్దరు కొడుకులు |
నివాసం | తుమకూరు |
గంగాసంద్ర సిద్దప్ప బాసవరాజ్ (జననం 1941) కర్ణాటకకు చెందిన భారతీయ రాజకీయవేత్త. బసవరాజ్ తూముకురు పార్లమెంటు నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎంపీగా గెలిచాడు. ప్రస్తుతం బసవరాజ్ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు.
బసవరాజ్ తూముకూరులో. సిద్దప్ప, నంజమ్మ దంపతులకు జన్మించాడు. బసవరాజ్ ఎస్. శకుంతలను వివాహం చేసుకున్నాడు, బసవరాజ్ శకుంతల దంపతులకు ఇద్దరు కొడుకులు సంతానం. ఒక కుమారుడు జిబి జ్యోతి గణేష్ తుముకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. జ్యోతి గణేష్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. .[2]
రాజకీయ జీవితం
[మార్చు]బసవరాజ్ తన రాజకీయ జీవితాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించాడు. తరువాత బసవరాజ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరాడు.[1] 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో కర్ణాటకలోని తుముకూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని హెచ్.డి. దేవే గౌడను దాదాపు 15,000 ఓట్ల తేడాతో ఓడించారు.[2][3] 1984 1989 1999 భారత సాధారణ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున బసవరాజ్ మూడుసార్లు ఎంపీగా గెలిచాడు. 2004 భారత సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు. ఓడిపోయిన తర్వాత బసవరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరాడు. 2009 2014 ఎన్నికలలో బసవరాజ్ భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. 2019 భారత సాధారణ ఎన్నికలలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ పై విజయం సాధించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]- 8వ లోక్సభ సభ్యుడు
- 9వ లోక్సభ సభ్యుడు (1989-1991)
- 13వ లోక్సభ సభ్యుడు (1999-2004)
- 15వ లోక్సభ సభ్యుడు (2009-2014)
- 17వ లోక్సభ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "G. S. Basavaraj on Lok Sabha website". loksabha.nic.in. Lok Sabha/National Informatics Centre, New Delhi. Retrieved 28 August 2013.
- ↑ 2.0 2.1 "GS Basavaraj". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-08-29.
- ↑ "G. S. BASAVARAJ : Bio, Political life, Family & Top stories". The Times of India. Retrieved 2024-08-29.