జి. విఠల్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. విఠల్‌ రెడ్డి
జి. విఠల్‌రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2018
నియోజకవర్గం ముథోల్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 06 ఆగస్టు 1954
దేగాం, భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గడ్డిగారి గడ్డెన్న , రాజమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం సులోచన, వెంకట్‌రాంరెడ్డి
నివాసం దేగాం, హైదరాబాద్

గడ్డిగారి విఠల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నిర్మల్ జిల్లా లోని ముథోల్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

జి. విఠల్‌రెడ్డి 1954, ఆగస్టు 6న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని, దేగాం గ్రామంలో గడ్డిగారి గడ్డెన్న , రాజమ్మ దంపతులకు జన్మించాడు.[2] ఆయనకు అక్కలు భోజవ్వ, కిష్టవ్వ, చెల్లెలు లక్ష్మి, తమ్ముండ్లు గోపాల్‌రెడ్డి, సూర్యకాంత్‌రెడ్డి ఉన్నారు. ఆయన 10వ తరగతి వరకు బైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో, హైదరాబాద్ సత్యమ్మ నర్సింహా రెడ్డి కళాశాలో ఇంటర్మీడియట్, కాచిగూడలోని బద్రుక కళాశాలలో బిఎ పూర్తి చేసి, 1980లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పట్టా అందుకున్నాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

విఠల్ రెడ్డికి లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (సులోచన), ఒక కుమారుడు (వెంకట్‌రాంరెడ్డి) ఉన్నారు.

ఉద్యోగం[మార్చు]

న్యాయవిద్య తర్వాత జస్టిస్‌ సుభాషన్‌రెడ్డి వద్ద ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆ తరువాత భైంసా, నిర్మల్, హైదరాబాదు ప్రాంతాల కోర్టులలో న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

జి. విఠల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982 నుండి 1987 వరకు దేగాం గ్రామ సర్పంచ్ గా పనిచేశాడు. ఆయన రెండుసార్లు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు. జి. విఠల్‌ రెడ్డి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సముద్రాల వేణుగోపాలాచారి చేతిలో 163 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి పడకంటి రమాదేవి పై 14,837 ఓట్ల మెజారిటీతో ముథోల్‌ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.

జి. విఠల్‌ రెడ్డి 2014, ఆగస్టు 6న కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4] ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి పడకంటి రమాదేవి పై 43364 ఓట్ల మెజారిటీతో ముథోల్‌ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యాడు.[5][6]జి. విఠల్‌రెడ్డి 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  3. Sakshi (19 May 2019). "నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది." Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  4. Sakshi (6 August 2014). "నేడు కారెక్కనున్న మరో హస్తం ఎమ్మెల్యే". Sakshi. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  5. India Today, India Today Web Desk New (11 December 2018). "Telangana election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  6. NDTV (2018). "MUDHOLE Election Result 2018, Winner, MUDHOLE MLA, Telangana" (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.