జీన్ డీచ్
జీన్ డీచ్ | |
---|---|
జననం | యూజీన్ మెరిల్ డీచ్ 1924 ఆగస్టు 8 |
మరణం | 2020 ఏప్రిల్ 16 ప్రేగ్, చెక్ రిపబ్లిక్ | (వయసు 95)
జాతీయత | అమెరికన్ |
వృత్తి | వ్యంగ్య చిత్రకారుడు, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1945–2008 |
జీవిత భాగస్వామి | మేరీ డీచ్ (1943–1960) జెడ్కా డీచోవా (1964–2020) |
పిల్లలు | 3 (కిమ్ డీచ్‌తో సహా) |
వెబ్‌సైటు | Archived at archive.org |
జీన్ డీచ్ (ఆగస్టు 8, 1924 - ఏప్రిల్ 16, 2020) అమెరికాకు చెందిన వ్యంగ్య చిత్రకారుడు,[1] దర్శకుడు. 1959 నుండి ప్రేగ్‌లో ఉన్న డీచ్, మన్రో, టామ్ టెర్రిఫిక్, నుడ్నిక్ వంటి యానిమేటెడ్ కార్టూన్‌లను సృష్టించి పేరొందాడు. పోపెయ్, టామ్ అండ్ జెర్రీ వంటి సిరీస్‌లకు దర్శకత్వం వహించాడు.[2][3]
జీవిత విషయాలు
[మార్చు]డీచ్ 1924, ఆగస్టు 8న సేల్స్ మాన్ జోసెఫ్ డీచ్, రూత్ డెల్సన్ డీచ్ దంపతులకు అమెరికా, ఇల్లినాయ్ రాష్ట్రంలోని చికాగో నగరంలో జన్మించాడు.[4][5] 1929లో డీచ్ కుటుంబం కాలిఫోర్నియాకు వెళ్ళింది, డీచ్ హాలీవుడ్‌లోని పాఠశాలలో చదువుకున్నాడు. 1942లో లాస్ ఏంజిల్స్ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కూడా కార్టూనిస్టులు.
వృత్తి జీవితం
[మార్చు]గ్రాడ్యుయేషన్ తరువాత ఉత్తర అమెరికా వైమానిక దశం కోసం విమానం బ్లూప్రింట్లను గీసే పనిలో చేరాడు. పైలట్ శిక్షణ పొందిన డీచ్, న్యుమోనియా రావడంతో 1943లో బయటకు వచ్చాడు.[5] 1945 నుండి 1951 వరకు జాచ్ మ్యాగజైన్ ది రికార్డ్ ఛేంజర్‌కు కవర్లు, ఇంటీరియర్ ఆర్ట్‌ను అందించాడు.[5] 1950వ దశకంలో మొట్టమొదటి అమెరికన్ గాయకులు-పాటల రచయితలలో ఒకరైన కొన్నీ కన్వర్స్‌కు డీచ్ సహకారం అందించడంతోపాటు ఆడియో ఇంజనీర్‌గా కూడా ఉన్నాడు.[6]
యానిమేషన్ రంగం
[మార్చు]1955లో యునైటెడ్ ప్రొడక్షన్స్ ఆఫ్ అమెరికా (యుపిఎ) అనే యానిమేషన్ స్టూడియోలో అప్రెంటిస్ షిప్ తీసుకున్న డీచ్, ఆ తరువాత టెర్రిటూన్స్[5] కు సృజనాత్మక దర్శకుడయ్యాడు. సిడ్నీ ది ఎలిఫెంట్,[7] గాస్టన్ లే క్రేయాన్,,[8] క్లింట్ క్లోబెర్[9] వంటి పాత్రలను సృష్టించాడు. 1958 ప్రారంభంలో డీచ్ థియేట్రికల్ కార్టూన్ సిడ్నీస్ ఫ్యామిలీ ట్రీ అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. 1958, ఆగస్టులో టెర్రిటూన్స్ నుండి తొలగించబడ్డ డీచ్, న్యూయార్క్ లో జీన్ డీచ్ అసోసియేట్స్, ఇంక్., పేరుతో తన సొంత స్టూడియోను స్థాపించాడు. ఇందులో ప్రధానంగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనలను రూపొందించేవారు.[5]
1959, అక్టోబరులో డీచ్ కంపెనీ చెకోస్లోవేకియాలోని ప్రాగ్‌లోని స్థావరానికి మార్చబడింది.[5] ప్రాగ్‌లో కేవలం పది రోజులు మాత్రమే గడపాలని అనుకున్న డీచ్, తనకు కాబోయే భార్య జెడ్నాను కలిసిన తరువాత నగరంలో శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.[10] మున్రో 1960, సెప్టెంబరులో చెకోస్లోవేకియాలో, 1961 అక్టోబరు 5న యునైటెడ్ స్టేట్స్ లో బ్రేక్ ఫాస్ట్ ఎట్ టిఫనీస్కు ముందు ఒక చిన్న ప్రదర్శనగా ప్రదర్శించబడింది. ఈ చిత్రం 1961లో ఉత్తమ యానిమేటెడ్ లఘుచిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది,[11] యునైటెడ్ స్టేట్స్ బయటి దేశంలో రూపొందించబడిన మొట్టమొదటి లఘుచిత్రంగా గౌరవాన్ని అందుకుంది.[12]
1960 నుండి 1963 వరకు, కింగ్ ఫీచర్స్ టెలివిజన్ కోసం రెంబ్రాండ్‌తో పోపెయ్ కార్టూన్‌లను దర్శకత్వం వహించాడు. 1961 నుండి 1962 వరకు మెట్రో గోల్డ్విన్ మేయర్ కోసం 13 కొత్త టామ్ అండ్ జెర్రీ లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు.[13][14]
మరణం
[మార్చు]ప్రేగు సమస్యలతో[15] బాధపడుతున్న డీచ్ 95 సంవత్సరాల వయసులో 2020, ఏప్రిల్ 16న ప్రేగ్‌లో మరణించాడు.[16]
మూలాలు
[మార్చు]- ↑ "Gene Deitch". Lambiek Comiclopedia. Archived from the original on 12 May 2019. Retrieved 20 April 2020.
- ↑ నమస్తే తెలంగాణ, సినిమా (20 April 2020). "టామ్ అండ్ జెర్రీ దర్శకుడు కన్నుమూత". ntnews. Archived from the original on 20 ఏప్రిల్ 2020. Retrieved 20 April 2020.
- ↑ సాక్షి, ప్రపంచం (20 April 2020). "'టామ్ అండ్ జెర్రీ' దర్శకుడి కన్నుమూత". Sakshi. Archived from the original on 20 ఏప్రిల్ 2020. Retrieved 20 April 2020.
- ↑ Lenburg, Jeff (2006). Who's Who in Animated Cartoons (Illustrated ed.). New York City: Applause Theatre and Cinema Books. pp. 62–64. ISBN 978-1-55783-671-7.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "Gene Deitch (born Eugene Merril Deitch), 1924". National Czech and Slovak Museum. Archived from the original on 12 సెప్టెంబరు 2015. Retrieved 20 ఏప్రిల్ 2020.
- ↑ Jefferson, Cord (3 August 2010). "The Story of Connie Converse". The Awl. Archived from the original on 16 జూన్ 2013. Retrieved 20 April 2020.
- ↑ Sidney the Elephantat Don Markstein's Toonopedia. Archived 2013-06-24 at Archive.today from the original on January 20, 2015.
- ↑ Gaston Le Crayonat Don Markstein's Toonopedia. Archived 2013-06-24 at Archive.today from the original on April 16, 2012.
- ↑ Clint Clobberat Don Markstein's Toonopedia. Archived 2013-06-24 at Archive.today from the original on April 16, 2012.
- ↑ "Jsi buď komunista, nebo blázen, slýchával. Československo bylo jako středověk, líčí držitel Oscara / 'You are either a communist or a fool': Czechoslovakia was like the Middle Ages, says the Oscar winner" (in czech). Czech Republic: DVTV. n.d. Retrieved 20 April 2020.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "The 33rd Academy Awards". Academy of Motion Picture Arts and Sciences. Archived from the original on 15 October 2015. Retrieved 20 April 2020.
Short Subject (Cartoon): Winner - Munro, William L. Snyder, Producer
- ↑ "Anatomy of an Oscar" Archived 3 మార్చి 2005 at the Wayback Machine Occasional Deitch 2007, page 3, retrieved [20 April 2020].
- ↑ MacDougall, Kent (11 June 1962). "Popeye, Tom & Jerry Join Trend to Shift Production Overseas". The Wall Street Journal. Archived from the original on 7 ఆగస్టు 2018. Retrieved 20 April 2020.
- ↑ Christopher, P. Lehman (2007). "The Cartoons of 1961–1962". American Animated Cartoons of the Vietnam Era: A Study of Social Commentary in Films and Television Programs, 1961–1973. McFarland & Company. pp. 23–24. ISBN 978-0-7864-2818-2.
- ↑ Amidi, Amid (17 April 2020). "Gene Deitch, Cartoon Modernist Who Headed UPA New York And Terrytoons, Dies At 95" (in అమెరికన్ ఇంగ్లీష్). Cartoon Brew. Archived from the original on April 18, 2020. Retrieved 20 April 2020.
- ↑ "American animator, longtime Prague expat Gene Deitch passes away at age 95". Czech News Agency. 17 April 2020. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 20 April 2020 – via Expats.cz.
...Deitch, living in Prague with his Czech wife, animator and producer Zdenka Najmanova, died there last night at the age of 95 years, Garamond publishing house owner Petr Himel told CTK today.