Jump to content

జీషన్ అలీ

వికీపీడియా నుండి
జీషన్ అలీ
దేశం India
నివాసంబెంగళూరు
జననం (1970-01-01) 1970 జనవరి 1 (వయసు 54)
కోల్‌కతా
ఎత్తు1.80 మీ. (5 అ. 11 అం.)
ప్రారంభం1988
విశ్రాంతి1995
ఆడే విధానంకుడిచేతి వాటం
బహుమతి సొమ్ముUS$45,664
సింగిల్స్
సాధించిన రికార్డులు4–14
సాధించిన విజయాలు0
0 ATP ఛాలెంజర్, 0 ITF ఫ్యూచర్స్
అత్యుత్తమ స్థానముNo. 126 (1988 డిసెంబరు 12)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
వింబుల్డన్మొదటి రౌండు (1988)
డబుల్స్
Career record4–8
Career titles0
3 ATP ఛాలెంజర్, 0 ITF ఫ్యూచర్స్
Highest rankingNo. 149 (1988 నవంబరు 14)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
వింబుల్డన్రెండో రౌండు (1988, 1989)
Last updated on: 2021 డిసెంబరు 2.

జీషన్ అలీ (జననం 1970 జనవరి 1) మాజీ భారతీయ డేవిస్ కప్ ఆటగాడు. అతను కుడిచేతి వాటం ఆటగాడు. సియోల్‌లో జరిగిన 1988 సమ్మర్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నాడు.[1] 1988 డిసెంబరు 12 న తన అత్యధిక సింగిల్స్ ATP ర్యాంకింగ్‌ను చేరుకున్నాడు. తన 19వ పుట్టినరోజుకు ఇంకా 3 వారాల దూరంలో ఉన్నప్పుడే అతను ప్రపంచంలోని 126వ ర్యాంకు సాధించాడు.

కెరీర్

[మార్చు]

జీషన్ 1991 ఆగస్టు వరకు టాప్ 130లో (రెండు వారాలు మినహా) కొనసాగాడు. 1988లో అతని సింగిల్స్ ఆట హైలైట్లలో ఇండియన్ శాటిలైట్ సర్క్యూట్‌లో గెలుపొందడం, షెనెక్టాడీ ATP టూర్ ఈవెంట్‌లో రెండో రౌండుకు చేరడం (రెండో రౌండులో జోహన్ క్రీక్ చేతిలో ఓడిపోవడం), సియోల్ ఒలింపిక్స్‌లో (అతను రెండో రౌండులో జాకబ్ హ్లాసెక్ చేతిలో ఓడిపోవడం) ఫైనల్స్‌కు చేరుకోవడం వంటివి ఉన్నాయి. కనెక్టికట్‌ లోని న్యూ హేవెన్ లోను ( విజయ్ అమృతరాజ్ చేతిలో ఓడిపోయాడు), ఇండోనేషియా లోనూ ఛాలెంజర్ సెమీఫైనల్‌కు చేరాడు. ఆ ప్రదర్శనలతో 1988 నవంబరులో సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో జీషాన్‌ను 178కి చేరాడు. జపాన్‌లో శాటిలైట్ సర్క్యూట్‌లో ఆధిపత్యం సాధించి సింగిల్స్‌లో ఆ సంవత్సరానికి అత్యున్నతంగా 126 వ స్థానానికి చేరాడు. 1988 చివరి నాటికి, జీషన్ డబుల్స్ ర్యాంకింగ్ 154 వద్ద ఉంది.

1989 ప్రారంభంలో జీషన్, నైజీరియాలో ఛాలెంజర్‌లో క్వార్టర్-ఫైనల్‌లోకి ప్రవేశించాడు, ఆపై టోక్యోలోనికీ బిస్కేన్‌లో (అక్కడ అతను మొదటి రౌండులో లీఫ్ షిరాస్‌ను ఓడించాడు. రెండో రౌండులో స్టెఫాన్ ఎడ్‌బర్గ్‌తో ఓడిపోయాడు) సింగపూర్, లండన్ (క్వీన్స్ క్లబ్) టూర్ ఈవెంట్‌లకు అర్హత సాధించాడు. 1989లో అతను సింగిల్స్‌లో తన ఏకైక గ్రాండ్ స్లామ్ మ్యాచ్ - వింబుల్డన్‌లో వాలీ మసూర్‌తో - ఆడి వరుస సెట్లలో ఓడిపోయాడు. అలాగే 1989లో, వింబుల్డన్‌లో జోనాథన్ కాంటర్‌తో కలిసి డబుల్స్‌లో మూడో రౌండ్‌కు చేరాడు (సీడెడ్ జంట కర్రెన్, పేట్‌తో నాలుగు సెట్లలో ఓడిపోయారు). రెండు ఛాలెంజర్ డబుల్స్ టైటిళ్లను (కౌలాలంపూర్, బీజింగ్‌ లలో) గెలుచుకున్నాడు. 1988లో, అతను వింబుల్డన్ డబుల్స్ (మార్క్ ఫెరీరాతో కలిసి), రెండు ఛాలెంజర్ డబుల్స్ ఫైనల్స్ (మార్క్‌తో ఒకటి), నాలుగు ఛాలెంజర్ సెమీ-ఫైనల్స్ (వాటిలో ఒకటి 37 ఏళ్ల ఆనంద్ అమృతరాజ్‌తో) రెండో రౌండ్‌లో కూడా ఆడాడు. 1990లో కూడా, అతను చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను (విన్నెట్కా, ఇల్లినాయిస్‌లో) గెలుచుకున్నాడు. మరొక ఛాలెంజర్ డబుల్స్ ఫైనల్‌కు (కెన్యాలో) చేరాడు. కానీ 1991 తర్వాత, జీషన్ ప్రధానంగా భారతదేశంలోను, ఆసియాలో ఛాలెంజర్స్ లోను, శాటిలైట్ల లోనూ ఆడాడు. 1994లో ఆసియా క్రీడల్లో స్వర్ణం, 1990లో కాంస్యం సాధించాడు.

జీషన్ 1986లో జూనియర్స్‌లో ప్రపంచ నంబర్ 2, ఆసియాలో #1 ర్యాంక్ కూడా సాధించాడు. జీషన్ ఆ సంవత్సరం మొత్తం 14 ITF జూనియర్ టోర్నమెంట్‌లను గెలుచుకున్నాడు. జూనియర్ వింబుల్డన్‌లో సింగిల్స్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత అదే సంవత్సరం US ఓపెన్‌లో జూనియర్స్ డబుల్స్ ఫైనల్స్‌కు కూడా చేరుకున్నాడు. వెన్ను గాయం కారణంగా అతను 1995లో ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడటం మానేశాడు.

జీషన్ భారతదేశంలో మొత్తం 7 పురుషుల సింగిల్స్, 4 డబుల్స్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. 16 సంవత్సరాల వయస్సులో మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని, అది సాధించిన అతి పిన్న వయస్కుడయ్యాడు.

జీషన్ 1987 నుండి 1994 వరకు భారతదేశం తరపున డేవిస్ కప్ ఆడాడు. 1987లో ఫైనల్స్‌కు, 1993లో సెమీ-ఫైనల్‌కూ చేరిన భారత డేవిస్ కప్ జట్టులో సభ్యుడు. జీషన్ ప్రస్తుత భారత జాతీయ జట్టుకు, డేవిస్ కప్ జట్టుకూ కోచ్‌గా 2015లో భారత ఫెడ్ కప్ జట్టుకు కెప్టెన్‌గానూ ఉన్నాడు. ఢిల్లీలోని నేషనల్ టెన్నిస్ సెంటర్‌లో టెన్నిస్ డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు.

జీషన్ భారతదేశంలో టెన్నిస్‌కు చేసిన కృషికి గాను 2014లో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ధ్యాన్‌చంద్‌ పురస్కారాన్ని అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2012లో భారతదేశానికి తిరిగి రాకముందు జీషన్, దుబాయ్‌లో టెన్నిస్ అకాడమీ నడిపాడు. UAE కి డేవిస్ కప్ కోచ్‌గా పనిచేసాడు. అతను ప్రస్తుతం బెంగళూరులో స్వంత టెన్నిస్ అకాడమీని నడుపుతున్నాడు.

ATP ఛాలెంజర్, ITF ఫ్యూచర్స్ ఫైనల్స్

[మార్చు]

డబుల్స్: 4 (3–1)

[మార్చు]
లెజెండ్
ATP ఛాలెంజర్ (3–1)
ITF ఫ్యూచర్స్ (0–0)
ఉపరితలం ద్వారా ఫైనల్స్
హార్డ్ (3–0)
క్లే (0–1)
పచ్చిక (0–0)
కార్పెట్ (0–0)
ఫలితం గె-ఓ తేదీ టోర్నమెంట్ పోటీ ఉపరితలం భాగస్వామి ప్రత్యర్థులు స్కోరు
గెలుపు 1–0 Aug 1989 కౌలాలంపూర్, మలేషియా ఛాలెంజర్ హార్డ్ ఆస్ట్రేలియా స్టీవ్ గై డెన్మార్క్ మోర్టెన్ క్రిస్టెన్సేన్
డెన్మార్క్ పీటర్ ఫ్లింట్సో
6–4, 6–4
గెలుపు 2–0 Nov 1989 బీజింగ్, చైనా ఛాలెంజర్ హార్డ్ ఆస్ట్రేలియా బ్రూస్ డెర్లిన్ యు.ఎస్.ఏ బ్రియాన్ డెవెనింగ్
యు.ఎస్.ఏ క్రెయిగ్ జాన్సన్
6–4, 6–4
ఓటమి 2–1 Feb 1990 నైరోబి, కెన్యా ఛాలెంజర్ మట్టి చెక్ రిపబ్లిక్ లిబోర్ పిమెక్ పోర్చుగల్ జోనో కున్హా-సిల్వా
బెల్జియం ఎడ్వర్డో మాస్సో
4–6, 5–7
గెలుపు 3-1 Aug 1990 విన్నెట్కా, యునైటెడ్ స్టేట్స్ ఛాలెంజర్ హార్డ్ నెదర్లాండ్స్ మెన్నో ఊస్టింగ్ యు.ఎస్.ఏ డౌగ్ ఫ్లాచ్
మెక్సికో లూయిస్-ఎన్రిక్ హెర్రెరా
4–6, 6–3, 6–2

జూనియర్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్

[మార్చు]

డబుల్స్: 1 (1 రన్నరప్)

[మార్చు]
ఫలితం సంవత్సరం టోర్నమెంటు ఉపరితలం భాగస్వామి ప్రత్యర్థులు స్కోరు
ఓటమి 1987 US ఓపెన్ హార్డ్ ఆస్ట్రేలియా బ్రెట్ స్టీవెన్ క్రొయేషియా గోరన్ ఇవనీసెవిచ్
ఇటలీ డియెగో నర్గిసో
6–3, 4–6, 3–6

మూలాలు

[మార్చు]
  1. "Zeeshan ALI – Olympic Tennis | India". International Olympic Committee. 2016-06-15. Retrieved 2020-10-23.
"https://te.wikipedia.org/w/index.php?title=జీషన్_అలీ&oldid=4079932" నుండి వెలికితీశారు