జెన్నీ ఇరానీ
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | జంషెడ్ ఖుదాదాద్ ఇరానీ | |||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1923 ఆగస్టు 18 కరాచీ, బాంబే ప్రెసిడెన్సీ | |||||||||||||||||||||
| మరణించిన తేదీ | 1982 February 25 (వయసు: 58) కరాచీ, పాకిస్తాన్ | |||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
| పాత్ర | వికెట్ కీపరు | |||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 37) | 1947 నవంబరు 28 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
| చివరి టెస్టు | 1947 డిసెంబరు 12 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3 | ||||||||||||||||||||||
జంషెడ్ ఖుదాదాద్ (జెన్నీ) ఇరానీ (1923 ఆగష్టు 18 – 1982 ఫిబ్రవరి 25) టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ .
జీవితం
[మార్చు]ఇరానీ కరాచీలో జన్మించాడు. 1937లో 14 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ప్రవేశించాడు. పాఠశాలలో ఉండగానే సింధ్ తరపున ఆడాడు. 1947/48లో ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. సిడ్నీలో ఆస్ట్రేలియా XIతో జరిగిన మ్యాచ్‌లో, అతను నెం.11 వద్ద బ్యాటింగు చేస్తూ 43 పరుగులు చేశాడు, గోగూమల్ కిషన్‌చంద్‌తో కలిసి 97 పరుగులు జోడించాడు. తొలిమ్యాచ్‌లో డకౌట్ అయిన మొదటి భారతీయ వికెట్ కీపరు అతను (2002లో అజయ్ రాత్రా డకటయ్యేవరకు ఒకే ఒక్కడు). రెండు మ్యాచ్‌ల తర్వాత అతని స్థానంలో ప్రొబీర్ సేన్ ను జట్టు లోకి తీసుకున్నారు. ఇరానీ మళ్లీ భారతదేశం తరపున ఆడలేదు. సేన్ 5 సంవత్సరాల పాటు భారత వికెట్ కీపర్‌గా కొనసాగాడు.
అతను కరాచీలోని బాయి విభాజీ సోప్రతివాలా ఉన్నత పాఠశాలలో, DJ సింద్ కళాశాలలో చదువుకున్నాడు. బాంబే విశ్వవిద్యాలయం తరఫున ఆడాడు. అతను హబీబ్ బ్యాంక్‌లో పనిచేశాడు. పాకిస్తాన్‌లో తన స్వస్థలమైన కరాచీలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- భారత క్రికెట్ 1983 లో సంస్మరణ