జేకబ్ ఓరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jacob Oram
Flag of New Zealand.svg New Zealand
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Jacob David Philip Oram
మారుపేరు Big Jake
జననం (1978-07-28) 1978 జూలై 28 (వయస్సు: 41  సంవత్సరాలు)
Palmerston North, Manawatu, New Zealand
ఎత్తు 1.98 m (6 ft 6 in)
పాత్ర All-rounder
బ్యాటింగ్ శైలి Left-hand bat
బౌలింగ్ శైలి Right-arm fast-medium
International information
తొలి టెస్టు (cap 222) 12 December 2002: v India
చివరి టెస్టు 26 August 2009: v Sri Lanka
తొలి వన్డే (cap 120) 4 January 2001: v Zimbabwe
చివరి వన్డే 9 November 2009:  v Pakistan
ODI shirt no. 24
Domestic team information
Years Team
1997–present Central Districts
2008- Chennai Super Kings
కెరీర్ గణాంకాలు
TestODIFCList A
మ్యాచ్‌లు 33 135 85 208
పరుగులు 1,780 2,094 3,992 3,814
బ్యాటింగ్ సగటు 36.32 24.34 33.83 26.30
100s/50s 5/6 1/11 8/18 3/20
అత్యుత్తమ స్కోరు 133 101* 155 127
వేసిన బంతులు 4,964 5,735 10,682 7,651
వికెట్లు 60 136 155 175
బౌలింగ్ సగటు 33.05 30.76 26.91 31.31
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 2 3 2
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 4/41 5/26 6/45 5/26
క్యాచ్ లు/స్టంపింగులు 15/– 41/– 36/– 62/–

As of 14 November, 2009
Source: CricketArchive

జేకబ్ డేవిడ్ ఫిలిప్ ఓరం (1978 జూలై 28 లో జన్మించిన) పామర్స్టన్ నార్త్, మనవాటు, న్యూ జీలాండ్) ఒక న్యూ జీలాండ్ క్రికెటరు. అతను ఎడమ చేతి వాటపు బాట్స్మాన్ మరియు కుడి చేయి ఫాస్ట్-మీడియం బౌలరు. అతని యొక్క బాటింగ్ మరియు బౌలింగ్ శక్తులు అతడిని ప్రస్తుతపు న్యూ జీలాండ్ అంతర్జాతీయ బృందంలో స్థిర స్థానం కలిగిన ఆటగాడుగా చేశాయి. సాధారణంగా మధ్య లేక చివరి బాటింగ్ వరుసలో ఆడే ఓరం బౌలింగ్ చిన్న ఫార్మాట్ లో చాలా సఫలీకృతమయి, ICC ODI ఆటగాళ్ళ ర్యాంకింగులలో 5 వ స్థానానికి ఎగబాకాడు. 1.98 మీ ఎత్తుతో (6 అడుగుల 6 అంగుళాలు), అతడు సాకర్ గోల్ కీపర్ గా బడిపిల్లలకు ప్రాతినిధ్యం వహించాడు. అతడు మనవాటు క్రికెట్ టీంకు హాక్ కప్లో ఆడాడు. అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు.

క్రీడాజీవితపు ముఖ్యాంశాలు[మార్చు]

అతను న్యూ జీలాండ్ టెస్ట్ క్రికెటర్లలో 1,000 పరుగులు చేసిన 36 మంది క్రికెటర్లలో ఒకడు. అంతే కాక 1,000 ODI పరుగులు మరియు 100 వికెట్ లు సంపాదించిన ఆర్గురు న్యూ జీలాండ్ క్రికెటర్లలో ఒకడు.

2003–04 సంవత్సరాలలో, అతను పాకిస్తాన్ తో ఆడుతున్నపుడు తన తొలి టెస్ట్ శతకానికి చేరువలో 97 వద్ద ఆగిపోయాడు. తరువాత దక్షిణ ఆఫ్రికాతో జరిగిన తదుపరి మ్యాచ్ లో అతను తన తొలి శతకం, అవుట్ కాకుండా 119 పరుగులు చేయటం ద్వారా సాధించాడు. మరియు తరువాయి టెస్ట్ లో 90 పరుగులు చేశాడు. అతని రెండవ శతకం అయిన 126 అవుట్ కాకుండా, ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో సాధించటం జరిగింది. రెండూ కూడా షేన్ వార్న్ మరియు గ్లెన్ మెక్గ్రాత్లకు వ్యతిరేకంగా చేశాడు. 133 పరుగులతో వృత్తిలోనే అత్త్యుత్తమమైనదైన అతని మూడవ టెస్ట్ శతకం దక్షిణ ఆఫ్రికాతో మరల ఆడినప్పుడు సాధించాడు.

2007 జనవరి 28 నాడు పెర్త్ లో ఆస్ట్రేలియా పై జరిగిన ఒక ODIలో ఓరం 72 బంతీలలో (అవుట్ కాకుండా) 101 పరుగులు కొట్టాడు. అప్పట్లో అదే ఒక న్యూ జీలండ్ ఆటగాడు కొట్టిన అతి వేగవంతమైన ODI శతకం. అంతే కాక, ఆస్ట్రీలియా పై చేసిన అతి వేగవంతమైన శతకం కూడా ఇదే. బ్రెండన్ మక్కల్లంతో కలిసి అతను చేసిన 137 పరుగుల బాగస్వామ్యం అప్పట్లో న్యూ జీలండ్ 6వ వికట్ కు అత్యధిక బాగస్వామ్యం. అయితే ఈ రికార్డ్ మరుసటి నెలలో అధికమించబడింది.[1]

ప్రపంచ కప్ కు ముందు జరిగిన ఒక ODIలో, అతను తన ఎడమ ఉంగరపు వేలుకు గాయం ఏర్పడుతుంది. ప్రపంచ కప్ కు కొన్ని వారాలు ఉండగా, క్రికట్ ఆడటానికోసం తన వేలును కత్తిరించి తీసేయడానికైనా సిద్దమే అని ఫిబ్రవరి 28న ఓరం తెలిపాడు.[2] అయితే తాను హాస్యంగా చెప్పానని, పోటీలో పాల్గొనడానికి తనకు ఉన్న బలమైన ఆసక్తిని తెలియచేయదానికే ఆ వ్యాక్య చేసానని ఓరం తరువాత వివరణ ఇచ్చాడు.[3]

2008లో ఇంగ్లాండ్ పై ఓరం కొట్టిన టెస్ట్ శతకానికి గాను, ఓరం లార్డ్స్ ఆనర్స్ బోర్డ్ లో ఓరం ఉన్నాడు. పలు మార్లు ఓరం ప్రపంచ #1-ODI ఆల్రౌండర్ గా ఉన్నాడు.

2009 సెప్టెంబరు 2న, శ్రీ లంక పై కొలంబోలో[4] జరిగిన ట్వెంటీ20 ఇంటర్నేషనల్ లో అన్జేలో మాథ్యూస్, మలింగా బండార, నువాన్ కులసేకర వికట్లు వరుస బంతులలో తీసి హ్యాట్ ట్రిక్ సాధించాడు.

2009 అక్టోబరు 13న టెస్ట్ క్రికట్ నుంచి తన రిటయర్మెంట్ ను ఓరం ప్రకటించాడు.

2009 ICC చాంపియన్స్ ట్రోఫి దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు, కీలు గాయంతో ఒక మ్యాచ్ లో కూడా ఆడలేక పోయాడు.

2009 నవంబరు 9న అబు దాబిలో పాకిస్తాన్ పై జరిగిన ఆసక్తికరమైన కూల్&కూల్ కప్ ఫైనల్ లో ఓరం 3/20 వికట్లు తీసాడు.

2010 ఫిబ్రవరి 5న 14 నెలలు తరువాత బంగ్లాదేశ్ పై నేపియర్ లో జరిగిన మ్యాచ్ లో ఓరం తన 12వ ODI అర్ధ శతకం సాధించాడు. కేవలం 40 బంతీలలో 83 పరుగులు చేసాడు. ఆ క్రముములో 8 ఫోర్లు మరియు 5 సిక్స్ లు కొట్టాడు.

2010 మార్చి 3న, ఆస్ట్రేలియా పై జరిగిన మ్యాచ్ లో ఓరం పమేల్ల టెండాన్ కు గాయం ఏర్పడి మరొక సిరీస్ కు మరియు 2010 IPL కు దూరమయ్యాడు.

2010 ICC ప్రపంచ ట్వెంటీ20 ద్వారా ఓరం అంతర్జాతీయ ప్రదర్శనకు తిరిగి వచ్చాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మార్చి 2008 లో జేకబ్ తన 8 సంవత్సరాల సహచరిణి అయిన, పామేస్టర్ నార్త్ కు చెందిన మారా టైట్-జామీసన్ ను వివాహమాడాడు.[5] ఆక్లాండ్ కొంతకాలం నివసించినాక, ఆ జంట ప్రస్తుతము పామేస్టర్ నార్త్ లో తమ ప్రియతమ పుత్రుడైన పాట్రిక్ మరియు వారికి ఇష్టమైన లాబ్రేడార్, లియోతో కలసి నివసిస్తున్నారు.

సూచనలు[మార్చు]

  1. "Highest partnership for the sixth wicket". Cricinfo.com. Retrieved October 11, 2008. Cite web requires |website= (help)
  2. "Oram talks about amputating injured finger". Cricinfo.com. February 28, 2007. Cite web requires |website= (help)
  3. "Oram confident broken finger is fine". Cricinfo.com. March 9, 2007. Cite web requires |website= (help)
  4. Alter, Jamie. "Fighting NZ overcome Dilshan blitz". Cricinfo. Retrieved 2009-09-03. Cite web requires |website= (help)
  5. ఓరం మనావటు స్టాండార్డ్ నుండి వచ్చిన తన మనావటు సుందరిని మార్చ్ 31 2008న వివాహమాడాడు

బాహ్య లింకులు[మార్చు]

మూస:New Zealand Squad 2007 Cricket World Cup మూస:Central Districts Stags Squad మూస:Chennai Super Kings Squad

"https://te.wikipedia.org/w/index.php?title=జేకబ్_ఓరం&oldid=2102223" నుండి వెలికితీశారు