Jump to content

జోష్ హాజెల్‌వుడ్

వికీపీడియా నుండి
జోష్ హాజెల్‌వుడ్
2018 లో హాజెల్‌వుడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జోష్ రెజినాల్డ్ హాజెల్‌వుడ్
పుట్టిన తేదీ (1991-01-08) 1991 జనవరి 8 (వయసు 33)
టమ్‌వర్త్, న్యూసౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
మారుపేరుHoff,[1] Bendemeer Bullet[2]
ఎత్తు1.96[3] మీ. (6 అ. 5 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 440)2014 డిసెంబరు 17 - ఇండియా తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 183)2010 జూన్ 22 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.38
తొలి T20I (క్యాప్ 62)2013 ఫిబ్రవరి 13 - వెస్టిండీస్ తో
చివరి T20I2022 నవంబరు 4 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.38
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–presentన్యూ సౌత్ వేల్స్
2011/12–2013/14, 2019/20Sydney Sixers
2020–2021చెన్నై సూపర్ కింగ్స్
2022-presentరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 63 69 41 104
చేసిన పరుగులు 465 81 22 813
బ్యాటింగు సగటు 11.62 20.25 11.00 11.13
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 39 23* 13* 43*
వేసిన బంతులు 13,327 3,626 922 20,551
వికెట్లు 238 108 58 383
బౌలింగు సగటు 26.22 25.61 20.36 24.95
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 3 0 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/67 6/52 4/12 6/35
క్యాచ్‌లు/స్టంపింగులు 23/– 22/– 8/– 39/–
మూలం: ESPNcricinfo, 21 June 2023

జోష్ రెజినాల్డ్ హాజెల్‌వుడ్ (జననం 1991 జనవరి 8) ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను ఖచ్చితత్వానికి ప్రసిద్ధి చెందిన పొడవాటి పేస్ బౌలరు. అతన్ని ఆస్ట్రేలియా మాజీ పేస్‌మెన్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో పోలుస్తారు. [4] హేజిల్‌వుడ్ ప్రస్తుతం ICC పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో వన్‌డేలో నం.2, T20I లో నం.3, టెస్టులో నం.12 ర్యాంక్‌లో ఉన్నాడు. అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ రెండింటినీ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో భాగం.

తొలి ఎదుగుదల

[మార్చు]
హేజిల్‌వుడ్, 2011లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతూ

న్యూ సౌత్ వేల్స్‌లో, టామ్‌వర్త్‌కు ఉత్తరాన 40 కి.మీ. దూరంలో ఉన్న బెండెమీర్ అనే చిన్న పట్తణంలో హాజెల్‌వుడ్ పెరిగాడు. అతను ట్రెవర్, అన్నే హాజెల్‌వుడ్‌ల చిన్న కుమారుడు. అతనికి ఒక అన్న, అక్క ఉన్నారు. అన్నయ్యతోటి భీకరమైన బ్యాక్‌యార్డ్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాడు. 12 సంవత్సరాల వయస్సులోనే పెద్దవారితో టామ్‌వర్త్ కోసం ఆడాడు. [5] [6] హేజిల్‌వుడ్ 17 సంవత్సరాల వయస్సులో న్యూ సౌత్ వేల్స్‌కు ఎంపికయ్యాడు, తద్వారా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతని ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం 2008 నవంబరులో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. హాజెల్‌వుడ్ 2010 జూన్ 22న ఆస్ట్రేలియా తరపున వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేసి, అది సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.[7]

కుడిచేతి ఫాస్టు బౌలరైన హాజెల్‌వుడ్, ఆస్ట్రేలియా అండర్-19కి కూడా ఆడాడు. 2008 అండర్-19 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో అతి పిన్న వయస్కుడైన సభ్యుడు.

టీ20 ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

2020 ఫిబ్రవరిలో, 2020 IPL వేలంలో, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అతనిని కొనుగోలు చేసింది. [8]

2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో, జోష్ హేజిల్‌వుడ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹7.75 కోట్లకు కొనుగోలు చేసింది. [9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]
2018లో హాజెల్‌వుడ్

అతను తన తొట్టతొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌల్ చేసి 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 2013 ఫిబ్రవరి 13న వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా T20I ల్లో అడుగుపెట్టి, 4 ఓవర్లలో 1–36 స్కోరు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన T20లో అతను కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు 4–30 సాధించాడు.

2014 డిసెంబరు 17న బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా తరపున తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. [10] అతను 2015 ICC క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియన్ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు. క్వార్టర్-ఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో భాగమయ్యాడు.

2015 నవంబరులో, డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించిన మొదటి ఆటగాడిగా హేజిల్‌వుడ్ నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, అతను డే-నైట్ టెస్ట్‌లో ఎల్‌బిడబ్ల్యు మార్టిన్ గప్టిల్ ను ఔట్‌ చేసి తన తొలి వికెట్ తీసుకున్నాడు. [11] అతను డే-నైట్ టెస్టు క్రికెట్ చరిత్రలో 70 పరుగులకు 6 వికెట్లతో మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు.[12] షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ జాన్సన్ కంటే వేగంగా తన 12వ టెస్టు లోనే 50 వికెట్ల స్థాయిని చేరుకున్నాడు.

2017 జనవరిలో, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్‌డే లో హాజెల్‌వుడ్ అసాధారణ ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు. అతను ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా మార్కస్ స్టోయినిస్‌తో కలిసి 26 నిమిషాల సుదీర్ఘమైన, 54 పరుగుల పదో వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. [13] నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు, ఆస్ట్రేలియా విజయానికి కేవలం ఏడు పరుగుల దూరంలో ఆగిపోయింది. యాభై పరుగుల భాగస్వామ్యంలో డైమండ్ డక్‌కి ఔట్ అయిన మొదటి ఆటగాడిగా అతను నిలిచాడు. [14] హేజిల్‌వుడ్‌ వన్‌డేల్లో అవుటవడం ఇదే మొదటిసారి. ఔట్ అవ్వకుండానే అత్యధిక వన్‌డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా (33) రికార్డు నెలకొల్పాడు. 2016 డిసెంబరులో తన 28వ వన్‌డేలో గత రికార్డును అధిగమించాడు. [15] ICC వన్‌డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగానే హాజెల్‌వుడ్ ఆ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లు తీశాడు. [16]


2018 ఏప్రిల్లో, అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా 2018–19 సీజన్ కోసం జాతీయ కాంట్రాక్టును అందజేసింది. [17] [18]

2019 జూలైలో, అతను ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. [19] [20] హేజిల్‌వుడ్ ఆ సిరీస్‌లోని 5 మ్యాచ్‌లలో 4 ఆడి, 21.85 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. [21]

2020 జూలై 16న, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 26 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టులో హాజెల్‌వుడ్ పేరు చేర్చారు. [22] [23] 2020 ఆగస్టు 14న, క్రికెట్ ఆస్ట్రేలియా టూరింగ్ పార్టీలో హాజెల్‌వుడ్‌ని చేర్చుకోవడంతో మ్యాచ్‌లు జరుగుతాయని ధృవీకరించింది. [24] [25]

2020–21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని మొదటి టెస్టులో హాజెల్‌వుడ్ తన 200వ టెస్టు వికెట్‌ను భారత్‌పై తీశాడు. 2020 డిసెంబరు 19 నాటికి ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన 17వ ఆటగాడు.[26] 2021 ఆగష్టులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో హాజెల్‌వుడ్‌ని ఎంపిక చేశారు. 2021లో T20 ప్రపంచ కప్ తర్వాత, ICC ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్‌డే, T20) టాప్ 10 ర్యాంక్‌లో నిలిచిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. [27]

హాజెల్‌వుడ్ 2021-22 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు మ్యాచ్ ఆడి, మూడు వికెట్లు, రెండు క్యాచ్‌లు తీసుకున్నాడు. [28] 2022 నవంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ వన్‌డే సమయంలో విశ్రాంతి తీసుకున్న పాట్ కమ్మిన్స్‌ స్థానంలో అతను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[29]

గుర్తింపులు

[మార్చు]
  • 2021 సంవత్సరానికి ICC పురుషుల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో స్థానం పొందాడు.[30]

మూలాలు

[మార్చు]
  1. "Sydney Sixers Player Profiles – Josh Hazlewood". Archived from the original on 19 December 2014. Retrieved 8 September 2018.
  2. "Hazlewood soars, Smith back to No.1". cricket.com.au. Retrieved 25 March 2016.
  3. "Josh Hazlewood". cricket.com.au. Cricket Australia. Retrieved 1 April 2018.
  4. "Hazlewood will be the next McGrath: Younis". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). 2017-01-06. Retrieved 2017-02-24.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; backyardgames అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Sygall, David (4 December 2015). "Josh Hazlewood and Nathan Lyon credit country upbringing for success". The Sydney Morning Herald.
  7. Coverdale, Brydon (22 June 2010). "Teenager Hazlewood debuts, Australia bat". CricInfo. Retrieved 22 June 2010.
  8. "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPN Cricinfo. Retrieved 20 December 2019.
  9. Sportstar, Team. "IPL Auction: Josh Hazlewood goes to RCB for Rs 7.75 crore". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 12 February 2022.
  10. "India tour of Australia and New Zealand, 2nd Test: Australia v India at Brisbane, Dec 17–21, 2014". ESPN Cricinfo. Retrieved 17 December 2014.
  11. "Bowlers dominate early in day-night Test". Cricinfo. Retrieved 25 March 2016.
  12. "Australia sneak home in tense finish". Cricinfo. Retrieved 25 March 2016.
  13. "Australia tour of New Zealand, 1st ODI: New Zealand v Australia at Auckland, Jan 30, 2017 Scorecard". ESPNcricinfo. 30 January 2017. Retrieved 30 January 2017.
  14. "Talking points from the first ODI between Australia and New Zealand". Herald Sun. 30 January 2017.
  15. "Australia v West Indies: Josh Hazlewood's remarkable batting stat". Fox Sports. News Corp Australia. 26 June 2016. Retrieved 30 January 2017.
  16. "Kohli reclaims top spot; Hazlewood tops ODI bowling rankings". ESPN Cricinfo. 13 June 2017. Retrieved 14 June 2017.
  17. "Carey, Richardson gain contracts as Australia look towards World Cup". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
  18. "Five new faces on CA contract list". Cricket Australia. Retrieved 11 April 2018.
  19. "Australia name 17-man Ashes squad". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 29 July 2019.
  20. "Bancroft, Wade and Mitchell Marsh earn Ashes call-ups". ESPNcricinfo (in ఇంగ్లీష్). 26 July 2019. Retrieved 29 July 2019.
  21. "The Ashes, 2019 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2019-10-24.
  22. "Usman Khawaja and Marcus Stoinis in expanded Australia training squad for possible England tour". ESPN Cricinfo. Retrieved 16 July 2020.
  23. "Aussies name huge 26-player group with eye on UK tour". Cricket Australia. Retrieved 16 July 2020.
  24. "Riley Meredith, Josh Philippe and Daniel Sams included as Australia tour to England confirmed". ESPN Cricinfo. Retrieved 14 August 2020.
  25. "Uncapped trio make Australia's UK touring party". Cricket Australia. Retrieved 14 August 2020.
  26. "Ind vs Aus, 1st Test: Josh Hazlewood completes 200 wickets". cricket.yahoo.net. Retrieved 2021-01-17.
  27. "Josh Inglis earns call-up and key names return in Australia's T20 World Cup squad". ESPN Cricinfo. Retrieved 19 August 2021.
  28. "Full Scorecard of England vs Australia 1st Test 2021/22 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 30 December 2021.
  29. McGlashan, Andrew (19 November 2022). "Hazlewood and Moeen come in as captains, Cummins and Buttler rested". ESPN Cricinfo. Retrieved 19 November 2022.
  30. "ICC Men's T20I Team of the Year revealed". International Cricket Council. Retrieved 21 January 2022.