టీ. వీ. రాజేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీ. వీ. రాజేశ్వర్
టీ. వీ. రాజేశ్వర్


పదవీ కాలం
8 జులై 2004 - 27 జులై 2009

పదవీ కాలం
2 మార్చి 1989 – 6 ఫిబ్రవరి 1990
ముందు సైయద్ నూరుల్ హాసన్
తరువాత సైయద్ నూరుల్ హాసన్

సిక్కిం గవర్నర్‌
పదవీ కాలం
నవంబర్ 1985 - మార్చి 1989

పదవీ కాలం
10 ఆగష్టు 1983 – 21 నవంబర్ 1985

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్
పదవీ కాలం
ఫిబ్రవరి 1980 - ఆగష్టు 1983

వ్యక్తిగత వివరాలు

జననం (1926-08-28)1926 ఆగస్టు 28
తంగవేలు రాజేశ్వర్ ముదలియార్, గురుసామిపాళయం గ్రామం, సేలం జిల్లా, తమిళనాడు, భారతదేశం
మరణం 2018 జనవరి 14(2018-01-14) (వయసు 91)[1]
న్యూఢిల్లీ, భారతదేశం

టీ. వీ. రాజేశ్వర్ (28 ఆగస్టు 1926 - 14 జనవరి 2018) భారతదేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి.[2] ఆయన సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేశాడు. టీ. వీ. రాజేశ్వర్ ను భారత ప్రభుత్వం 2012లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది.[3][4]

వృత్తి జీవితం[మార్చు]

టీ. వీ. రాజేశ్వర్ తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాలోని రాసిపురం తాలూకాలోని గురుసామిపాళయంలో నేత మరిముత్తు ముదలియార్‌కు జన్మించాడు. ఆయన గురుసామిపాళయం సెంగుంథర్ మహాజన పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, మద్రాసు విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.

టీ. వీ. రాజేశ్వర్ 1949లో ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా అర్హత అందుకొని నిజామాబాద్, రాయచూరు, గుంటూరు జిల్లాలకు పోలీసు సూపరింటెండెంట్ గా పని చేసి ఆ తర్వాత హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశాడు.[5]

టీ. వీ. రాజేశ్వర్ ఆగస్టు 1983 నుండి నవంబర్ 1985 వరకు అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, నవంబర్ 1985 నుండి మార్చి 1989 వరకు సిక్కిం గవర్నర్‌గా, 20 మార్చి 1989 నుండి 7 ఫిబ్రవరి 1990 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, 8 జూలై 2004 నుండి [6] జూలై 2009 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా పని చేశాడు.

టీ. వీ. రాజేశ్వర్ కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అతని కుమార్తె సుజాత మాజీ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి, ఆమె జర్మనీలో భారత రాయబారి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేసింది.

మూలాలు[మార్చు]

  1. The Statesman (18 January 2018). "Sikkim fest pause as state mourns former gov loss". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  2. "T.V Rajeswar (1926-2018): Officer who reported Emergency excesses but won Indira Gandhi's trust". The Indian Express. 16 January 2018. Retrieved 19 May 2018.
  3. "Padma Awards". pib. 27 January 2013. Retrieved 27 January 2013.
  4. The Hindu (25 January 2012). "Padma Vibushan for TV Rajeswar, Hazarika" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  5. "Shri T.V. Rajeswar". Uttar Pradesh Vidhan Sabha website.
  6. "Shri T.V. Rajeswar". Uttar Pradesh Vidhan Sabha website. Archived from the original on 21 May 2009. Retrieved 19 March 2010.