టీ యాప్ ఫోలియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీ యాప్ ఫోలియో
T App Folio Logo.jpg
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుతెలంగాణ ప్రభుత్వం
ప్రారంభ విడుదల2017 ఫిబ్రవరి; 4 సంవత్సరాల క్రితం (2017-02)
ఆపరేటింగ్ సిస్టంఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, యుఎస్ఎస్‌డి
అందుబాటులో ఉంది2 భారతీయ భాషలు
రకంఅంతర్జాల సేవ, డిజిలాకర్, బిల్లు చెల్లింపు వ్యవస్థ
లైసెన్సుఫ్రీవేర్, యాజమాన్యం

టీ యాప్ ఫోలియో అనేది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకోసం రూపొందించిన ఇంటిగ్రేటెడ్ యాప్.[1] మీ సేవ 2.0లో భాగంగా ఫీజు-బిల్లు చెల్లింపు సేవలను అందించేందుకు ఈ యాప్ రూపొందించబడింది.[2] ఇది తెలుగు, ఆంగ్లంలో అందుబాటులో ఉంది.[3] మీ సేవ కేంద్రాలకు వెళ్ళి ధ్రువీకరణ పత్రాల కోసం ధరఖాస్తు చేసుకొనే పనిలేకుండా ఇంట్లో నుంచే మీ ఫోన్ ద్వారా ఈ యాప్ సదుపాయంతో వాటిని పొందవచ్చు. 2019-20 సంవత్సరంనాటికి 7 లక్షలమందికికు పైగా యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోగా, ప్రతిరోజూ 10,000 లావాదేవీలు జరిగాయి.

ప్రారంభం[మార్చు]

2018, ఫిబ్రవరి 28న తెలంగాణ ఐటి మంత్రి కె.టి. రామారావు ఈ యాప్ ను ప్రారంభించాడు.[4][5]

గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని, ఎక్కడినుండైనా ఎప్పుడైనా ఎవరైనా దీనినుండి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఈ యాప్ లో లింకు చేసుకున్న వారు మాత్రమే సంబంధిత పత్రాల కోసం యాప్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి వీలుటుంది. ఇమెయిల్, పాన్ కార్డు నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. యాప్ లో కనిపించే సేవలలో అవసరమున్నదాన్ని ఎంచుకొని వివరాలు నమోదు చేయాలి.

ప్రత్యేకత[మార్చు]

 1. అందరికీ అందుబాటులో ఉంటుంది
 2. బహుభాషల్లో (ఇంగ్లీష్, తెలుగు) ఉంది
 3. అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే గేట్‌వే
 4. ఆదాయం, జననం, మరణ ధృవీకరణ పత్రం వంటి ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లు
 5. వివిధ ప్రభుత్వ యాప్‌ల కోసం ఒకే లాగిన్‌

సేవలు[మార్చు]

టీ వాలెట్, యూపిఐ, క్రెడిట్/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ మొదలైన సర్వీసుల నుండి నగదు రహిత చెల్లింపులు చేయవచ్చు.[6]

మీసేవా (ఆదాయ ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రాలు), ఆర్‌టిఎ సేవలు (డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్),[7] ఫీజు (ఆస్తి పన్ను, అన్ని ఆర్‌టిఎ ఫీజులు, అడంగల్/పహాణి, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ చెల్లింపులు), బిల్లు చెల్లింపులు (ఇంటర్నెట్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్) వంటి పౌరులు అత్యధికంగా ఉపయోగించే 32 శాఖలకు చెందిన 225పైగా సేవలు, మీసేవా కేంద్రాలు, రేషన్ షాపులు, హై-ఫై హాట్‌స్పాట్‌లు వంటి ఇతర సేవలు ఇందులో ఉన్నాయి.

ఈ యాప్ ద్వారా తెలంగాణలోని ప్రధాన దేవాలయాలలో రూములు, దర్శన టిక్కెట్లు, ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వరంగల్ భద్రకాళి దేవాలయం, జూబ్లీ హిల్స్ పెదమ్మ దేవాలయం, యాదగిరి గుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, మహంకాళి, బల్కంపేట్, కర్మన్‌ఘాట్‌తో సహా పదకొండు దేవాలయాలలో బుకింగ్‌లు చేయవచ్చు.[8]

వేదిక[మార్చు]

ఇందులో పలు సేవలను ఉపయోగించడం కోసం సింగిల్ సైన్ ఆన్ ఫీచర్‌ ఉంది. ఎం- గవర్నెన్స్ కింద మొబైల్ ఫార్మట్ కి కూడా విస్తరించబడింది. భారత ప్రభుత్వ యుఎంఏఎన్‌జి యాప్ మాదిరిగానే టీ యాప్ ఫోలియోలో కూడా వివిధ విభాగాల నుండి 180 సర్వీసులు చేర్చబడ్డాయి.[9]

మూలాలు[మార్చు]

 1. "T App Folio". www.telangana.gov.in. Retrieved 2021-08-11.
 2. India, The Hans (2018-03-01). "IT Minister KT Rama Rao launches T App Folio". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.
 3. aslam (2018-02-28). "Technology should help common man: KTR". The Siasat Daily – Archive (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.
 4. "Telangana launches integrated app for all government services". The Economic Times. 28 February 2018. Retrieved 2021-08-11.
 5. "Telangana launches m-Governance app". https://www.outlookindia.com/. Retrieved 2021-08-11. External link in |website= (help)
 6. "T App Folio". www.tweb.telangana.gov.in. Retrieved 2021-08-11.
 7. "Get licence renewed via mobile app". The Hindu (in ఇంగ్లీష్). Special Correspondent. 2020-07-27. ISSN 0971-751X. Retrieved 2021-08-11.CS1 maint: others (link)
 8. India, The Hans (2019-09-05). "T App Folio makes pilgrimage easy". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.
 9. "Telangana moves to mobile governance". The Hindu (in ఇంగ్లీష్). Special Correspondent. 2018-03-01. ISSN 0971-751X. Retrieved 2021-08-11.CS1 maint: others (link)