టీ వర్క్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీ వర్క్స్
TWorks Building.jpg
టీ వర్క్స్ భవనం
ఆశయంఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి
స్థాపన2016
రకంఎలక్ట్రానిక్ & హార్డ్‌వేర్‌ రంగం
చట్టబద్ధతవాడుకలో ఉంది
కేంద్రీకరణనూతన ఆవిష్కరణలు
కార్యస్థానం
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ఐటి శాఖామంత్రికల్వకుంట్ల తారక రామారావు
ప్రధానభాగంతెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ
జాలగూడుటీ వర్క్స్ వెబ్సైటు

టీ వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ & హార్డ్‌వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రం. ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి.. అనే నినాదంతో రూపొందిన టీ వర్క్స్, హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారింది.[1] పైసా ఖర్చు లేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చు.[2]

రూపకల్పన[మార్చు]

వినూత్న ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే పరికరాల నమూనాలను రూపొందించేందుకు తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో 2016లో హైదరాబాదు బేగంపేటలో టీ వర్క్స్ ప్రారంభించబడింది. యంత్ర తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌ వర్క్‌ స్టేషన్లు, ఫినిష్‌ షాప్‌లు, లేజర్‌ కటింగ్, పీసీబీ ఫ్యాబ్రికేషన్, మెటల్‌ షాప్, వెల్డ్‌ షాప్, వుడ్‌ వర్కింగ్‌ వంటి అనేక వసతులు, వాటికి అవసరమయ్యే పరికరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. వివిధ రంగాల్లో కొత్త ప్రయోగాలు చేసే తయారీదారులు, ఆవిష్కర్తలతోపాటు ఇంజనీర్లు, డిజైనర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు, వలంటీర్లు, సంబంధిత రంగాలకు చెందిన వారు ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం వహిస్తారు. ప్రోటోటైప్‌ (నమూనాల) నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన నైపుణ్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.[3] మూడు దశల్లో 100 కోట్ల రూపాయల విలువచేసే యంత్రాలను ఏర్పాటుచేశారు. వినూత్న ఆలోచనతో వచ్చి ఒక వస్తువుకు సంబంధించిన నమూనాను తయారు చేసుకునే వరకు ఉచితంగా అవకాశం కల్పించబడుతోంది.

నూతన భవనం[మార్చు]

అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒకేచోట ఉండేలా రాయదుర్గం పరిధిలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో 2020లో ‘టీ వర్క్స్‌’ భవనానికి శంకుస్థాపన జరిగింది. సుమారు 4.92ఎకరాల స్థలంలో 350 కోట్ల రూపాయలతో 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ వర్క్స్ భవనాన్ని నిర్మించారు.[4] 250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక మౌలిక వసతులను వివిధరకాల ఉపకరణాలను ఇందులో అందుబాటులోకి తెచ్చారు. ఈ భవనానికి సమీపంలోనే టీ హబ్ 2 భవనం ఉంది.[2]

ప్రారంభం[మార్చు]

2023 మార్చి 2న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్‌, ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ క‌లిసి ఈ టీ-వర్క్స్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, టీ వ‌ర్క్స్ సీఈవో సంజ‌య్, చేవెళ్ళ ఎంపీ జి. రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.[5][6]

లక్ష్యాలు[మార్చు]

 • ఎలక్ట్రానిక్ & హార్డ్వేర్ రంగంలో వినూత్న రూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం
 • పెట్టుబడిదారులు సలహాదారులు మార్గదర్శకులను ఆకర్షించడం
 • రంగం అభివృద్ధికి పరిశ్రమలు విద్యాసంస్థలు ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసే వీలు కల్పించడం
 • ఎలక్ట్రానిక్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం
 • హార్డ్వేర్ తయారీ అత్యాధునిక సదుపాయాలు కల్పించడం
 • ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో స్టార్టప్ లను ప్రోత్సహించడం
 • ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నిపుణులైన మానవ వనరులను అభివృద్ధి చేయడం

ఆవిష్కరణలు[మార్చు]

 • 2020 ఏప్రిల్ 20న తక్కువ ధరకు లభించే వెంటిలేటర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించాడు.
 • పర్యావరణహిత వేరుశెనగ పొట్టు కుండల (బయో పాట్‌) తయారీకి ఉపయోగించే ‘బయో ప్రెస్‌’ యంత్రం 2021 సెప్టెంబరులో ఆవిష్కరించబడింది.
 • డ్రోన్‌ మాదిరిగా నిలువుగా టేకాఫ్‌తోపాటు ల్యాండింగ్‌ అయ్యే సామర్థ్యం గల అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ (యూఏవీ) 2021 అక్టోబరు 14న బేగంపేట విమానాశ్రమంలో నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో విజయవంతంగా ప్రయోగించబడింది. పూర్తిగా టీ-వర్క్స్‌ సొంత పరిజ్ఞానంతో తయారుచేయబడి, 33 నిమిషాల్లో 45 కిలోమీటర్లు ప్రయాణించింది.

మూలాలు[మార్చు]

 1. "ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి". EENADU. 2023-04-11. Archived from the original on 2023-04-11. Retrieved 2023-04-11.
 2. 2.0 2.1 telugu, NT News (2022-07-09). "సృజనకు నెలవు". Namasthe Telangana. Archived from the original on 2022-07-11. Retrieved 2022-07-14.
 3. "UAV సాంకేతికతకు టీ వర్క్స్‌ పట్టం". Sakshi Education. 2022-07-14. Archived from the original on 2022-07-14. Retrieved 2022-07-14.
 4. "Hyderabad: T-Works set to open up a whole new world of possibilities". The New Indian Express. 2022-07-06. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-14.
 5. ABN (2023-03-02). "Minister KTR : ఆవిష్కరణల ప్రోత్సాహానికి టీ-వర్క్స్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
 6. telugu, NT News (2023-03-02). "T-Works | టీ వ‌ర్క్స్‌ను ప్రారంభించిన ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ, మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-03-03. Retrieved 2023-03-07.

బయటి లింకులు[మార్చు]