Jump to content

టీ. చల్లపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°29′40.668″N 82°3′20.772″E / 16.49463000°N 82.05577000°E / 16.49463000; 82.05577000
వికీపీడియా నుండి
(ఠానా చల్లపల్లి నుండి దారిమార్పు చెందింది)
టీ. చల్లపల్లి
పటం
టీ. చల్లపల్లి is located in ఆంధ్రప్రదేశ్
టీ. చల్లపల్లి
టీ. చల్లపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°29′40.668″N 82°3′20.772″E / 16.49463000°N 82.05577000°E / 16.49463000; 82.05577000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంఉప్పలగుప్తం
విస్తీర్ణం21.77 కి.మీ2 (8.41 చ. మై)
జనాభా
 (2011)
9,291
 • జనసాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,620
 • స్త్రీలు4,671
 • లింగ నిష్పత్తి1,011
 • నివాసాలు2,501
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533213
2011 జనగణన కోడ్587903

టీ. చల్లపల్లి లేదా ఠానా చల్లపల్లి కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలానికి చెందిన గ్రామం.[2]. ఇది మండల కేంద్రమైన ఉప్పలగుప్తం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,406.[3] ఇందులో పురుషుల సంఖ్య 4,719, మహిళల సంఖ్య 4,687, గ్రామంలో నివాస గృహాలు 2,207 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2501 ఇళ్లతో, 9291 జనాభాతో 2177 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4620, ఆడవారి సంఖ్య 4671. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3934 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587903.[4].ఎస్.టి.డి.కోడ్ = 08856.

గ్రామ స్వరూపం

[మార్చు]

యీ గ్రామం అమలాపురం తాలూకాలో అమలాపురంకు 12 కిలోమీటర్లు దూరంలో సముద్ర తీరంన ఉంది. ఉప్పలగుప్తం మండలానికి చెందిన గ్రామం.

ఈ గ్రామం 10వ శతాబ్దంలో చోళరాజుల కాలం నుండి ఉన్నట్టు గ్రామంలో నిర్మించబడిన చోడేశ్వర స్వామి దేవాలయ చరిత్రను బట్టి తెలుస్తుంది.

పూర్వము చాళుక్య వంశీయులగు మానవ్యస శ్రీ  శెట్టిపాల గోత్రీకులైన బలిజ వర్ణం వారైన శ్రీ పోలిశెట్టి వారి కుటుంబీకులు కర్ణాటక విజయనగర హంపి పెనుకొండ ప్రాంతానికి చెందిన వీరు దరిమిలాను 14వ శతాబ్దంలో విజయనగర 2వ దేవరాయల తరపున గజపతులపై దండయాత్రలలో శ్రీ పోలిశెట్టి సదాశివరాయసెట్టివర్మగారు ఈ రాజమహేంద్రవరం రాజ్యంవచ్చి ద్రాక్షారామంలో రాజకీయ వర్తకవాణిజ్యాల యందు విఖ్యాతులై ఉండేవారు

16 శతాబ్దములో గోలుకొండ సుల్తానుల తరపున శ్రీ పోలిశెట్టి గున్నరాయలుశెట్టి చౌదరిగారు బోడసకుర్రు పరగణా చౌదరులుగా యిజారాదార్లుగా వచ్చి, యీ చల్లపల్లిగ్రామంలో ఠాణా నిర్వహించి చల్లపల్లి, సామంతకుర్రు, గూడాల మొదలైన గ్రామాలతో ఏర్పడిన చల్లపల్లి ముఠాదారులుగా యిజారాదారులుగా తమ మంది మార్బలంతో యీ గ్రామంలో స్థిరపడినారు. అందుచేత యీ గ్రామాన్ని "ఠానా చల్లపల్లి", "టీ.చల్లపల్లి" అని పిలిచేవారు. తరువాత వీరికి రాజమహేంద్రవరం గోలకొండ మహమ్మదీయ పాలక ప్రతినిధులతో తలెత్తిన వివాదాల కారణంగా ముఠాదారీ వారు స్వాదీనం చేసుకోవడంతో, తరువాత యీ గ్రామం శ్రీ పిఠాపురం మహారాజు శ్రీ రావు మాధవరావు గారి సంస్థానంలో కలిపినారు. పిఠాపురం సంస్థానంతో వీరికున్న మిత్రత్వం కారణంగా శ్రీ పోలిశెట్టి నరసప్పరాయలుశెట్టిగారు, శ్రీ పోలిశెట్టి కుమార అమ్మన్నశెట్టి దొర గారు, శ్రీ పోలిశెట్టి నరసప్పారాయలు దొర గారు,  శ్రీ పోలిశెట్టి మంగయ్యశెట్టిదొర గారు, శ్రీ పోలిశెట్టి నరసప్పనాయుడు గారు, శ్రీ పోలిశెట్టి మంగయ్యశెట్టినాయకుడు గారు, రావు బహద్దూర్ శ్రీ పోలిశెట్టి ధర్మారాయుడు గారు వంశ అనువంశ పరంపరగా ఈ చల్లపల్లి గ్రామానికి యిజారాదార్లుగా, పెత్తందారులుగా, మునసబులుగా శ్రీ పిఠాపురం మహారాజా సంస్థానానికి అత్యంత ఆప్తులుగా వ్యవహరించేవారు. పోలిశెట్టి ధర్మారాయుడు గారి కుటుంబీకులు 800 ఎకరాల భూములపై పన్నులు కట్టేవారని గ్రామ కరణాల రికార్డు లెక్కలు చూపుతున్నాయి. పోలిశెట్టి ధర్మారాయుడు గారికి పిఠాపురం మహారాజు మరో 600 ఎకరాల భూములపై పన్నులులేకుండా జీవితాంతం అనుభవించేలా ఈనాం ఇచ్చినట్టు గ్రామ కరణాల రికార్డు లెక్కలు చూపుతున్నాయి.

19వ శతాబ్దంలో ఈ గ్రామం పలివెల టాణాలో కలిపినారు. 1947 భారత స్వతంత్రం తరువాత సంస్థానాలు ఎస్టేట్లు రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పిఠాపురం సంస్థానం కూడా భారత యూనియన్ లో కలిసిపోయింది. దానిలో భాగంగా చల్లపల్లి గ్రామం కూడా జమిందారీ ఎస్టేట్ లోనుండి రైత్వారీ గ్రామంగా మారిపోయింది.  

గ్రామానికి పరంపరగా శ్రీ తిరువూరివారి వంశస్తులు, శ్రీ మాచిరాజు వారి వంశస్తులు కరణాలుగా ఉండేవారు.

మొత్తం గ్రామ జనాభా 9000 మందిపైనే. ఓటర్లు 5000 మంది పైబడి ఉన్నారు. గ్రామంలో కాపులు, బ్రాహ్మణులు, అగ్నికుల క్షత్రియులు, మాలలు, మాదిగలు ప్రధాన కులాలు. బ్రాహ్మణులలో తిరువూరి, మాఛిరాజు, అంబరుఖానా మొదలగు ఇంటిపేర్లు వారు, ఈ గ్రామంలో వ్యవసాయదారులుగా చెప్పబడే కాపులలోని తెలగాలు, బలిజలు అనే వర్గాల కాపులలో పోలిశెట్టి, దంగేటి, యెరుబండి, గొలకోటి, సుంకర, కుంపట్ల, భోగిశెట్టి, సలాది, ఆకుల మొదలగు కుటుంబాలవారు గ్రామంలో ప్రధానంగా గలరు.

గ్రామంలో చల్లపల్లి మెయిన్, బొండాడిపేట, చింతల చెరువు, ఎరుబండిచెరువు, వాసాలతిప్ప, వైరుపేట, జగ్గరాజుపేట, పర్రపేట, మట్లచెరువు, జల్లిపేట, బండారుపేట, అంబెడ్కర్ నగర్ వంటి పేటలు ఉన్నాయి

గ్రామ పంచాయతీ

[మార్చు]

టీ. చల్లపల్లి గ్రామానికి 1920 దశకం నాటికి పోలిశెట్టి మంగపతిరాయుడు (మంగయ్య) పంచాయతి పెద్ద, వీరి పెద్దరికంలో తిరువూరి మాధవస్వామి, దంగేటి పద్మనాభుడు, పోలిశెట్టి గంగరాజు, పోలిశెట్టి తాతయ్య వీరు ఐదుగురు అప్పటి గ్రామ వ్యవహారాలు చక్కదిద్దేవారు.

ఇప్పటివరకు సర్పంచిగా పనిచేసినవారు

[మార్చు]
  • పోలిశెట్టి గంగరాజు
  • ఎరుబండి రామమూర్తి
  • తిరువూరి వీరేశ్వరరావు
  • దంగేటి నాగేశ్వరరావు
  • దంగేటి నాగభూషణం
  • దంగేటి సత్యనారాయణ మూర్తి అనే కొండయ్య
  • పెయ్యల అర్జునరావు
  • బుడితి వెంకటరత్నం
  • యరగర్త వెంకటేశ్వర రావు
  • దంగేటి శేషవాణి
  • కొల్లు అమ్ములు
  • యిసుకపట్ల జయమణి

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం

[మార్చు]

ది చల్లపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్

1918లో స్థాపించబడింది. అప్పటికి 2 లక్షల అప్పులు ఇచ్చింది.

ఈ సంఘంలో ప్రారంభంలో చల్లపల్లి, సరిపల్లి, గోపవరం, సూరసానియానం, గూడాల, తాడికొన గ్రామాలు సభ్యులుగా ఉండేవి. దీనికి ప్రారంభంలో గూడాలకు చెందిన పోలిశెట్టి  స్వామినాయుడు, పోలిశెట్టి రామయ్యనాయుడు, అధ్యక్షులుగా పనిచేసారు, తరువాత తిరువూరు వీరేశ్వరరావు, తరువాత దంగేటి నాగభూషణం అధ్యక్షులుగా ఉన్నప్పుడు సొసైటీ చల్లపల్లికి ప్రత్యేకంగా ఏర్పడింది.

తరువాత పోలిశెట్టి తాతారావు, పోలిశెట్టి వెంకటరత్నం నాయుడు, దంగేటి సత్యనారాయణ మూర్తి (కొండయ్య) అధ్యక్షులుగా పనిచేసారు.  తర్వాత  సొసైటీ ని ఉప్పలగుప్తం సొసైటీ లో విలీనం చేసారు. దీనికి నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, దంగేటి విశ్వేశ్వర వెంకటరెడ్డి నాయుడు  అధ్యక్షులుగా పనిచేసారు

వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు]

గ్రామ మొత్తం ఆయకట్టు 4600 యకరాలు. ప్రధాన పంటలు వరిసాగు, చేపలు రొయ్యలు సాగు. వరిలో ఖరీఫ్, రబీ అని రెండు పంటలూ వేస్తారు. వేసవికాలంలో కొంతమంది మినుములు, పెసలు వంటి అపరాలు, జనుము, జీలుగ వంటి పశుగ్రాసం కూడా వేస్తారు.పూర్వం గ్రామంలో 101 చెరువులు ఉండేవి. 1875 నుండి కాలువల ద్వారా నీటి సౌకర్యాలు పెరగడంతో క్రమక్రమంగా చెరువులు పంటభూములుగా మారినవి.

పాతపర్రలో పోలిశెట్టి మంగయ్య చెరువు ఒక పుట్టి భూమి లో ఉండేది అనగా 8 ఎకరాలు. సావరం చెరువు, చింతల చెరువు, మట్ల చెరువు, ఎరుబండి చెరువు, జగ్గన్నచెరువు, వంటి చెరువులు గ్రామం చుట్టూ కొన్ని మిగిలి ఉన్నాయి.

సదుపాయాలు

[మార్చు]

గ్రామంలో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలు గలవు. గ్రామంలో ప్రతీ monday సంత జరుగుతుంది. బ్యాంకింగు సదుపాయాలకోసం "ఇండియన్ బ్యాంకు", బి.యస్.యన్.ఎల్. టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఒక సినీమా హాల్ ఉన్నాయి. వైద్య సదుపాయల కోసం RMP డాక్టరు గలడు.

గుళ్ళు గోపురాలు, ఉత్సవాలు

[మార్చు]

మరిడి మహాలక్ష్మి అమ్మవారు (మరిడమ్మ), మహిషాసుర మర్ధినీ అమ్మవారు (మస్సమ్మ), కనకమహాలక్ష్మి అమ్మవార్లు చల్లపల్లి గ్రామదేవతలుగా పూజలందుకొనుచున్నారు. సంక్రాంతికి అమ్మవార్ల జాతరలు 33 రోజులు జరపడం పూర్వం నుండి ఉన్నది. మరిడమ్మ జాతర పోలిశెట్టివారి కుటుంబీకుల ఆధ్వర్యంలో, మైసమ్మ జాతర గొలకోటి వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో, కనకమహాలక్ష్మి జాతర దంగేటి వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో జరుగును.

గ్రామంలో శ్రీ చోడేశ్వర స్వామి , శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి , శ్రీ లక్ష్మీగణపతి ఆలయం, శ్రీ కనకదుర్గ, బేతాళుడు, పోతురాజు, శ్రీ సీతారామ స్వామి వార్ల దేవాలయాలు ఉన్నాయి.

చోడేశ్వర స్వామి దేవాలయం 11 - 12 శతాబ్దాల్లో కోన హైహయ, చోళ రాజుల కాలంలో నిర్మించబడెను. దేవాలయానికి ఈశాన్యంగా ఉన్న చెరువు చోడప్ప చెరువు. చోడేశ్వర స్వామి పేరుమీద ఏర్పడింది. 12వ శతాబ్దంలో త్రవ్వించ బడినది.

చొల్లంగి అమావాస్యకు, చల్లపల్లి గ్రామ శివారు, గ్రామానికి 3 కిలోమీటర్లు దూరం లోపు వున్న సముద్రమునకు వెళ్ళి సముద్ర స్నానాలు చేస్తారు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో చల్లపల్లి మెయిన్, జగ్గరాజుపేట, బండారు పేట,  బొండాడి పేట,  చింతలచెరువు,  ఎరుబండిచెరువు, జల్లిపేట, మట్లచెరువు,  పర్రపేట, వైరుపేట, వాసాలతిప్పలలో మండల పరిషత్ పాఠశాలలు గలవు.

1962 లో గ్రామంలో బాలబాలికలకు విద్య సౌకర్యాల కొరకు శ్రీ దంగేటి నాగభూషణంగారు స్థలదానం చేయడంతో వారి పేరున  శ్రీ దంగేటి నాగభూషణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని ఒక హైస్కూలు  నిర్మాణం జరిగింది. అప్పటినుండి గ్రామస్తులే కాకుండా, సూరసాని యానాం, గోపవరం, కూనవరం, సరిపల్లి వంటి పరిసర గ్రామాల బాలబాలికలు కూడా ఇక్కడ విద్యనభ్యసించేవారు.

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల ఉప్పలగుప్తంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు అమలాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ అమలాపురంలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అమలాపురంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

టి. చల్లపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

పూర్వం చల్లపల్లి గ్రామకంఠంలో 12వ శతాబ్దినాటి చోడప్ప చెరువు,  పోలిశెట్టివారి వీధిలో వెనుకవైపు ఉన్న 16వ శతాబ్దినాటి పోలిశెట్టి నరసప్పగారి చెరువు నుండి మంచినీరు లభించేది. ప్రస్తుతం ఆక్రమణలకు గురై మురుగు గుంతలుగా మారినాయి. తరువాత గ్రామకంఠంలో అంబారుఖానా భాష్యగారు ఒక చెరువు త్రవ్వించెను, దంగేటి నాగభూషణంగారు ఒక చెరువు త్రవ్వించెను, పోలిశెట్టి రామన్నగారు ఒక చెరువు త్రవ్వించెను. మంచినీరు చెరువులుగా ఉపయోగిస్తున్నారు. ఇంకా జగ్గరాజుపేటలో ఎరుబండి చెరువు, జగ్గన్న చెరువు, పాతపర్రలోని పోలిశెట్టి మంగయ్యగారి చెరువు వంటివి ఉండేవి.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

టి. చల్లపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

టి. చల్లపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 571 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 194 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 234 హెక్టార్లు
  • బంజరు భూమి: 37 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1138 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 59 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1351 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

టి. చల్లపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1351 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

టి. చల్లపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

కొబ్బరి

చేపలు

రొయ్యలు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-10.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-10.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".