తబ్రైజ్ షమ్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తబ్రైజ్ షమ్సీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తబ్రైజ్ షమ్సీ
పుట్టిన తేదీ (1990-02-18) 1990 ఫిబ్రవరి 18 (వయసు 34)
జోహన్నెస్‌బర్గ్, ట్రాంస్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLeft-arm unorthodox spin
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 328)2016 నవంబరు 24 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2018 జూలై 12 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 116)2016 జూన్ 7 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 72)2017 జూన్ 21 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–2010Gauteng
2010Highveld Lions
2010క్వాజులు-నాటల్
2010–2014డాల్ఫిన్స్
2011–2014క్వాజులు-నాటల్ Inland
2014–presentEasterns
2014–presentTitans
2015–2017St Kitts and Nevis Patriots
2016–2018రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2017నార్తాంప్టన్‌షైర్
2019హాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 90)
2021రాజస్థాన్ రాయల్స్
2022గయానా Amazon వారియర్స్
2023Paarl Royals
2023Karachi Kings
2023Galle Titans
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 2 43 61 84
చేసిన పరుగులు 20 18 9 568
బ్యాటింగు సగటు 20.0 6.00 2.25 7.88
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 18* 9* 4* 36
వేసిన బంతులు 483 2,109 1,312 15,574
వికెట్లు 6 56 74 334
బౌలింగు సగటు 46.33 34.32 21.54 26.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 1 22
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 5
అత్యుత్తమ బౌలింగు 3/91 5/49 5/24 8/32
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/– 12/– 21/–
మూలం: ESPNCricinfo, 31 March 2023

తబ్రైజ్ షమ్సీ (జననం 1990 ఫిబ్రవరి 18) [1] దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను డాల్ఫిన్స్, గౌటెంగ్, గౌటెంగ్ అండర్-19, క్వాజులు నాటల్, క్వాజులు-నాటల్ ఇన్‌ల్యాండ్, లయన్స్, టైటాన్స్ జట్ల తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాటింగ్ శైలికి, ఎడమ చేతి అనార్థడాక్స్ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. [1]

జీవితం తొలి దశలో

[మార్చు]

షమ్సీ హైస్కూల్‌లో ఉన్నప్పుడు స్కూల్ క్రికెట్ పోటీల్లో ఫ్రంట్‌లైన్ సీమ్ బౌలర్‌గా ఆడాడు. అయితే, అండర్-19 జట్టు కోసం ట్రయల్స్‌కు వెళ్ళినప్పుడు సీమ్ బౌలరుకు ఉండాల్సినంత వేగం అతనిలో లేదని కోచ్‌లు అతనికి చెప్పారు. అతను చాలా కట్టర్‌లను బౌలింగ్ చేశాడు కాబట్టి, స్పిన్ బౌలర్‌గా మారమని సూచించారు. [2]

దేశీయ, T20 కెరీర్

[మార్చు]

2018 జూన్‌లో షమ్సీ, 2018-19 సీజన్‌లో టైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [3] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సి సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం పార్ల్ రాక్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [4] [5] అతను టోర్నమెంట్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో పది అవుట్‌లతో జట్టుకు సంయుక్తంగా అత్యధిక వికెట్-టేకర్‌గా నిలిచాడు.[6]

2016 ఏప్రిల్లో షమ్సీ, 2016 IPL సమయంలో గాయపడిన శామ్యూల్ బద్రీ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగప్రవేశం చేసి, రాయల్‌ ఛాలెంజర్స్ తరఫున 4 ఓవర్లలో 1/36 తీసుకున్నాడు. దీంతో ఆ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. [7]


2017 ఆగస్టులో, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం స్టెల్లెన్‌బోష్ మోనార్క్స్ జట్టులో షమ్సీ ఎంపికయ్యాడు. [8] అయితే 2017 అక్టోబరులో క్రికెట్ దక్షిణాఫ్రికా, మొదట్లో ఆ టోర్నమెంట్‌ను నవంబరు 2018కి వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [9]

షమ్సీ 2017–18 రామ్ స్లామ్ T20 ఛాలెంజ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టోర్నమెంటులో మొత్తం 11 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసుకున్నాడు.[10] అతను 2017–18 మొమెంటమ్ వన్ డే కప్‌లో 9 మ్యాచ్‌లలో 26 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.[11]

2019 సెప్టెంబరులో 2019 ఎంజాన్సి సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పార్ల్ రాక్స్ జట్టు కోసం జట్టులో ఎంపికయ్యాడు. [12] 2020 జూలైలో, అతను 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం జమైకా తల్లావాస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [13] [14] అయితే, సరైన సమయంలో ప్రయాణ ఏర్పాట్లు చేసుకోనందున ఆ టోర్నమెంటుకు దూరమైన ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో షమ్సీ ఒకడు. [15]


2019 జూలైలో షమ్సీ, యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో ఎడిన్‌బర్గ్ రాక్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [16] [17] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నీని రద్దు చేసారు. [18] 2019 వైటాలిటీ బ్లాస్టు సమయంలో మాసన్ క్రేన్, బ్రాడ్ టేలర్‌లకు గాయాలవడంతో చివరి నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌ల కోసం హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు సంతకం చేశాడు. [19]

2020 నవంబరులో, 2020–21 CSA 4-రోజుల ఫ్రాంచైజీ సిరీస్ రెండో రౌండ్‌లో షమ్సీ, వారియర్స్‌పై రెండవ ఇన్నింగ్స్‌లో 32 పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టి, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. [20]

2021 ఏప్రిల్లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు షమ్సీ నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [21] 2021 ఆగస్టు 25న, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2021 IPL రెండవ దశ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆండ్రూ టై స్థానంలో షమ్సీని చేర్చారు. [22] 2021 నవంబరులో, అతను 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ తర్వాత గాలే గ్లాడియేటర్స్ కోసం ఆడేందుకు ఎంపికయ్యాడు. [23]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2016 మేలో, మరుసటి నెలలో ప్రారంభమైన 2016 వెస్టిండీస్ ట్రై-సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టులో షమ్సీ ఎంపికయ్యాడు. [24] అతను 2016 జూన్ 7న ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నమెంట్‌లో తన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) రంగప్రవేశం చేసాడు. [25]

టెస్టు అరంగేట్రం (2016)లో మిచెల్ స్టార్క్‌కి బౌలింగ్ చేస్తున్న షమ్సీ

షమ్సీ 2016 నవంబరు 24న ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి టెస్టు ఆడాడు.[26] నాథన్ లియాన్ అతని తొలి టెస్టు వికెట్.

షమ్సీ 2017 జూన్ 21న ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) ప్రవేశం చేశాడు [27]

2019 ఏప్రిల్లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మంది దక్షిణాఫ్రికా జట్టులో షామ్జీ ఎంపికయ్యాడు. [28] [29] 2019లో వన్డే క్రికెట్ నుండి వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ రిటైర్మెంట్ తర్వాత, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు షమ్సీ మొదటి ఎంపిక స్పిన్నర్‌గా అవతరించాడు. [30] [31] [32]

2021 మార్చిలో, పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 6 వికెట్లు తీయడం ద్వారా షమ్సీ తన కెరీర్‌లో మొదటిసారిగా ICC T20I బౌలర్ల ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. [33] [34] 2021 సెప్టెంబరులో, శ్రీలంకతో జరిగిన రెండవ మ్యాచ్‌లో, షమ్సీ వన్‌డేలలో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [35] అదే నెలలో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో షమ్సీ ఎంపికయ్యాడు. [36]

2022 జూలై 31న, సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో, షమ్సీ తన నాలుగు ఓవర్లలో 5/24 వికెట్లను సాధించి, టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. అతని నాల్గవ వికెట్ టి20ల్లో అతనికి 65వది. దాంతో, టి20ల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్ స్టెయిన్‌ను అధిగమించాడు.

పురస్కారాలు

[మార్చు]
  • 2021 CSA అవార్డ్స్‌లో పురుషుల T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును షమ్సీ అందుకున్నాడు. [37] [38]
  • 2021 సంవత్సరానికి ICC పురుషుల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో అతని పేరు చేర్చారు [39]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tabraiz Shamsi". ESPNcricinfo. Retrieved 22 December 2014.
  2. "'I was on the sidelines for three years, so now that I have the chance I want to take it'". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  3. "Multiply Titans Announce Contracts 2018-19". Multiply Titans. Archived from the original on 16 June 2018. Retrieved 16 June 2018.
  4. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  5. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  6. "Mzansi Super League, 2018/19 - Paarl Rocks: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 14 December 2018.
  7. Badree out of IPL, Tabraiz Shamsi in for Royal Challengers
  8. "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
  9. "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
  10. "Ram Slam T20 Challenge, 2017/18: Most Wickets". ESPN Cricinfo. Retrieved 16 December 2017.
  11. "Records: Momentum One Day Cup, 2017/18: Most wickets". ESPN Cricinfo. Retrieved 3 February 2018.
  12. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 4 September 2019.
  13. "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
  14. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
  15. "Five South Africans to miss CPL after failing to confirm travel arrangements". ESPN Cricinfo. Retrieved 28 July 2020.
  16. "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
  17. "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
  18. "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
  19. "Hampshire sign Tabraiz Shamsi for final four Blast group games". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  20. "Shamsi shines as Titans extend their 4-Day Tournament dominance". ESPN Cricinfo. Retrieved 12 November 2020.
  21. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  22. "Rajasthan Royals sign Tabraiz Shamsi ahead of IPL 2021 phase 2". SportsTiger. Retrieved 25 August 2021.
  23. "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
  24. "South Africa include Shamsi in ODI squad". ESPNCricinfo. Retrieved 6 May 2016.
  25. "West Indies Tri-Nation Series, 3rd Match: Australia v South Africa at Providence, Jun 7, 2016". ESPN Cricinfo. Retrieved 7 June 2016.
  26. "South Africa tour of Australia, 3rd Test: Australia v South Africa at Adelaide, Nov 24-28, 2016". ESPN Cricinfo. Retrieved 24 November 2016.
  27. "South Africa tour of England, 1st T20I: England v South Africa at Southampton, Jun 21, 2017". ESPN Cricinfo. Retrieved 21 June 2017.
  28. "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  29. "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  30. Butler, Lynn. "Tabraiz Shamsi's bid to become SA's spin king: 'I just want to win a World Cup'". Sport. Retrieved 2021-06-30.
  31. "Is South Africa's outlook on spin changing?". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  32. "'This feels like the beginning' - Tabraiz Shamsi". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  33. "Tabraiz Shamsi jumps to career-best second in T20I bowling rankings". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  34. staff, Sport24. "Proteas spinner Tabraiz Shamsi tops ICC T20 bowler rankings". Sport (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  35. "Malan 121, Shamsi five-for level series for South Africa in rain-hit game". ESPN Cricinfo. Retrieved 4 September 2021.
  36. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  37. "Nortje and Ismail clean up at Cricket South Africa Awards". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  38. "Anrich Nortje, Shabnim Ismail win big at CSA awards". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-30.
  39. "ICC Men's T20I Team of the Year revealed". International Cricket Council. Retrieved 21 January 2022.