తమిరిస

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తమిరిస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందివాడ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ తోట వెంకటేశ్వరరావు,
జనాభా (2011)
 - మొత్తం 3,776
 - పురుషుల సంఖ్య 1,927
 - స్త్రీల సంఖ్య 1,849
 - గృహాల సంఖ్య 1,168
పిన్ కోడ్ 521 327.
ఎస్.టి.డి కోడ్ 08674

'తమిరిశ (ఆంగ్లం: Tamirisa), కృష్ణా జిల్లా, నందివాడ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 327., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, పెదపారుపూడి, ముదినేపల్లి, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 47 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పశువైద్యశాల.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

మంచినీటి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ తోట వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017, మార్చి-11వతేదీ శనివారం రాత్రి, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. 12వతేదీ ఆదివారం ఉదయం బలిహరణ, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, పెసలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని పరిశ్రమలు[మార్చు]

ఉమా స్పిన్ టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్., దారాల కర్మాగారం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

మాగంటి అంకినీడు ప్రముఖ పార్లమెంటు సభ్యులు మాగంటి అంకినీడు, ఈ గ్రామంలో జన్మించారు.[2]

పద్మశ్రీ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే:- తమిరిశ గ్రామంలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వరకు 14 గుండె మార్పిడి ఆపరేషన్లు, 3 ఊపిరితిత్తుల మార్పిడి అపరేషన్లూ నిర్వహించారు. సుమారు 10,000 గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. వీరు గుంటూరు ప్రభుత్వ అసుపత్రిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో, ఎన్.టి.అర్.వైద్యసేవా పథకం క్రింద, పేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి సారిగా, ఫిబ్రవరి/2016లో ఉచిత గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయుటకు సమాయత్తమగుచున్నారు. [1]

శ్రీ ఆళ్ళ రామశేషయ్య ఈ గ్రామములోని ఒక సాధారణ రైతుకుటుంబంలో జన్మించిన వీరు, ఎన్నో సంవత్సరాలుగా, పేదలకు తాము కోల్పోయామనుకున్న చూపును తిరిగి ప్రసాదించుచూ, ఒకరిపైన ఆధారపడకుండా కొత్త జీవితాన్ని ఇచ్చుచున్నారు. ఒకటీ, రెండూ కాదు, ఏకంగా దాదాపు యాభై ఐదు వేలమందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మొదట పేదల దగ్గర ఒకరూపాయి మాత్రమే ఫీజు తీసుని, వైద్య వృత్తిని ప్రారంభించిన వీరు, రూపాయి వైద్యుడు గా పేరుగాంచారు. తన కుమారుని అకాల మరణంతో కలతచెందిన వీరు, కుమారుని పేరుతో, అజయ్ జ్యొతి గ్రామీణ ఉచిత నేత్రవైద్యశాల ను స్థాపించి, ఉచితంగా నేత్రవైద్యం అందించుచున్నారు. వీరు కృష్ణాజిల్లాలోనే తొలిసారిగా తన కుమారుని నేత్రాలను ఐబ్యాంకుకు అందజేసినారు. పద్మశ్రీ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే, వీరి స్వంత సోదరుడే కావడం విశేషం. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

మచిలీపట్నంలోని బచ్చుపేటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి, ఈ గ్రామములో 20.56 ఎకరాల మాన్యం భూములున్నవి. [5]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4194.[3] ఇందులో పురుషుల సంఖ్య 2145, స్త్రీల సంఖ్య 2049, గ్రామంలో నివాస గృహాలు 1069 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 3,776 - పురుషుల సంఖ్య 1,927 - స్త్రీల సంఖ్య 1,849 - గృహాల సంఖ్య 1,168

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-26; 1&19 పేజీలు. [2] ఈనాడు ఆదివారం అనుబంధం; 2016,మార్చి-13; 20వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చి-3; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చి-12; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జూన్-27; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=తమిరిస&oldid=2223291" నుండి వెలికితీశారు