Jump to content

తిమ్మాపురం (యడ్లపాడు)

అక్షాంశ రేఖాంశాలు: 16°8′41.532″N 80°12′32.544″E / 16.14487000°N 80.20904000°E / 16.14487000; 80.20904000
వికీపీడియా నుండి
(తిమ్మా పురం నుండి దారిమార్పు చెందింది)
తిమ్మాపురం (యడ్లపాడు)
పటం
తిమ్మాపురం (యడ్లపాడు) is located in ఆంధ్రప్రదేశ్
తిమ్మాపురం (యడ్లపాడు)
తిమ్మాపురం (యడ్లపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 16°8′41.532″N 80°12′32.544″E / 16.14487000°N 80.20904000°E / 16.14487000; 80.20904000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలంయడ్లపాడు
విస్తీర్ణం
12.22 కి.మీ2 (4.72 చ. మై)
జనాభా
 (2011)
6,918
 • జనసాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,468
 • స్త్రీలు3,450
 • లింగ నిష్పత్తి995
 • నివాసాలు1,810
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522233
2011 జనగణన కోడ్590207

తిమ్మాపురం ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన యడ్లపాడు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1810 ఇళ్లతో, 6918 జనాభాతో 1222 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3468, ఆడవారి సంఖ్య 3450. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2472 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 90. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590207

ఇది గుంటూరు నుండి 33 కి. మీ దూరంలో జాతీయ రహదారి సంఖ్య 5 పై గలదు. చిలకలూరిపేట నుండి 5 కి. మీ.తిమ్మాపురం ఒక పల్లెటూరు.ఈ ఊరు మద్రాసు -కలకత్తా ట్రంకురోడ్డుపై ఉంది. మద్రాసు నుంచి 365 కి.మీ.దూరంలో, విజయవాడ నుండి 70 కి.మీ. దూరంలో ఉంటుంది.కమ్మ కులానికి చెందిన పావులూరి కుటుంబాలు 17వ శతాబ్దంలో ఈ ఊరిని స్థాపించాయి.

సిఆర్‌డిఎ పరిధిలో చేరిక

[మార్చు]

ఈ గ్రామం గ్రామ పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్ణంను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు30 వ తేది నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] 

సమీప గ్రామాలు

[మార్చు]

జగ్గాపురం 3 కి.మీ, యడ్లపాడు 4 కి.మీ, జాలాది 4 కి.మీ, నాదెండ్ల 4 కి.మీ, గణపవరం 4 కి.మీ

గ్రామ ప్రాశస్త్యం

[మార్చు]

ఈ పల్లె పూర్తిగా వ్యవసాయ, దాని అనుబంధ వృత్తులపై ఆధారపడింది. వ్యవసాయంలో మిరప, ప్రత్తి, పొగాకు ప్రధాన పంటలు. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయకూలీలు లేదా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన ప్రత్తి జిన్నింగు మిల్లులు, పొగాకు పరిశ్రమలు, ప్రత్తి విత్తనాలనుండి నూనె తీయు పరిశ్రమలు రోజువారీ కూలీలకు జీవనాధారంగా ఉన్నాయి. ప్రత్తి, నూలు పరిశ్రమలకు జిల్లాలో ప్రధానకేంద్రంగా ఉన్న చిలకలూరిపేట ప్రాంతానికి ప్రత్తిపంటను పరిచయం చేసిన ఘనత తిమ్మాపురం గ్రామానిదే. ఈ ప్రాంతంలో మొదట ప్రత్తి జిన్నింగ్ చేసే పరిశ్రమ, దూదితో నూలు తయారుచేసే పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 1.7లక్షల హెక్టారలో సాగుచేస్తున్న ప్రత్తిని తొలిసారిగా 1966లో తిమ్మాపురంలో సాగుచేశారు. కృష్ణా ప్రత్తి రకంగా పిలిచే ఆ పంటను కాండ్ర సాంబశివరావు, పావులూరి హనుమయ్య, పావులూరి రత్తయ్య అను రైతులు ఎకరం వంతున సాగు చేశారు.6 నుండి 9 క్వింటాళ్ళవరకూ దిగుబడి సాధించారు. ఒక క్వింటాలు 150 రూపాయల వంతున, కర్నూలు జిల్లా ఆదోని, కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతాల వ్యాపారులకు విక్రయించారు. గ్రామంలో మొదట ప్రత్తి సాగుచేసిన ఆ ముగ్గురు రైతులూ, కీర్తిశేషులైనారు. అప్పుడు ప్రత్తి చేలో రోజంతా ప్రత్తి తీస్తే, రూపాయన్నర కూలీ లభించేది. పంటసాగు పెరగటంతో ఈ వూరి రైతులు పావులూరి వెంకటేశ్వర్లు, పావులూరి గోవిందరావు మొట్టమొదట చేరి ఒక జిన్నింగు మిల్లూ ఏర్పాటు చేశారు.[3]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి యడ్లపాడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల యడ్లపాడులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చిలకలూరిపేటలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల బోయపాలెంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చిలకలూరిపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

తిమ్మాపురంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

తిమ్మాపురంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

తిమ్మాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 48 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 11 హెక్టార్లు
  • బంజరు భూమి: 380 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 782 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1162 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

తిమ్మాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

ప్రత్తి, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

జౌళి

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 5495, పురుషుల సంఖ్య 2774, మహిళలు 2721, నివాస గృహాలు 1361, విస్తీర్ణం 1222 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-17. Retrieved 2017-10-09.