ఉన్నవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉన్నవ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం యడ్లపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,901
 - పురుషుల సంఖ్య 2,429
 - స్త్రీల సంఖ్య 2,472
 - గృహాల సంఖ్య 1,859
పిన్ కోడ్ 522233
ఎస్.టి.డి కోడ్

ఉన్నవ, గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 233., ఎస్.ట్.డి.కోడ్ = 08647.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఇది మండల కేంద్రమైన యడ్లపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1359 ఇళ్లతో, 4901 జనాభాతో 959 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2429, ఆడవారి సంఖ్య 2472. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 907 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 194. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590203.

సిఆర్‌డిఎ పరిధిలో చేరిక[మార్చు]

ఈ గ్రామం గ్రామ పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్నము (959 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు 30 వ తేది నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] 

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వం ఈ గ్రామం ఏర్పడక ముందు దక్షణపు దిక్కున పుచ్చకాయలపాడు అనే గ్రామం ఉండేది. శాతవాహనులు పరిపాలన కాలంలో జన్యావుల పెద్దక్క గోపశ్రీ అనే ఆమె తన పశువుల మందల మేపుకొనుటకు నల్లకొండ శీను అనే  కాపరిని వెంటపెట్టుకొని ఈ ప్రదేశంనకు వచ్చింది. గ్రామం ప్రక్కన ఉన్న మెరక ప్రదేశంలో దొడ్డికాకర పంటను పండిస్తూ,అక్కడే పశువుల మందతో ఉంటుంది. కొన్నాళ్లకు  ఆవుల మందలో పాలు శ్రేష్టంగా ఇచ్చే మూడు ఆవుల పాలు ఉదయంనకు ఎవరో దొంగిలించినట్లుగా పాలు ఇచ్చేవి కావు.  కాపరి పాలు తీయుటకు వెళ్లగా ఆ మూడు ఆవుల పాలు ఇవ్వక పోగా “వుంన్నా, వుంన్నా”  అనే ధ్వని వినిపించేది. ఈ సంగతిని కాపరి కొన్ని రోజులు చూచి తన యజమాని పెద్దక్కతో చెప్పగా, ఆమె పరిక్షించి ఇదేమో వింతగా ఉన్నదని ఆలోచన చేస్తూ, ఆ రాత్రి తన ఇష్టదైవంను మనసు నందు తలుచుకొని నిదురించగా శ్రీరాజగోపాలస్వామి  పెద్దక్కకు కలలో కనపడి మేము స్యయం వ్యక్తంగా ముగ్గురు రాజగోపాల మూర్తులం.రుక్మిణి, సత్యభామ సమేతంగా ఆ ప్రదేశంలోఅవతరించాం. మమ్ములను వెలుపలికి తీయించి మూడు బండ్లపై ఉంచి, అరక కట్టే మువ్వ కోడెదూడలను ఆ బండ్లకు కట్టి విడిచిపెడితే, ఆబండ్లు ఎక్కడికి వెళ్లి ఆగితే అక్కడ ఆలయం కట్టించి ప్రతిష్ఠ చేయవలెనని చెప్పుట జరిగింది. ఆ మరుసటి రోజు ఆవుల మంద నివాసం ఉన్న స్థలం వద్దనున్న భావిలో వెతకగా మూడు రాతి తొట్ల నందు మూడు రాజగోపాలస్వామి విగ్రహాలు రుక్మిణి, సత్యభామ సమేతంగా బయల్పడినవి. వాటిని వెలుపలికి తీసి కలలో పెద్దక్కకు తన ఇష్ట దైవం చెప్పిన ప్రకారం చేయగా, మూడు బండ్లలో ఈ ప్రదేశంనకు నాలుగు ఆమడల దూరంలో బెల్లంకొండ శీమలో ఉన్న క్రోసూరు వద్ద ఒక బండి, మూడు ఆమడల దూరంలో ఉన్న పణిదెం వద్ద ఒక బండి ఆగినవి. ఒక బండి ఎక్కడకు వెళ్లకుండా అక్కడే ప్రదక్షిణ చేసి ఆప్రదేశంనందే ఆగినది.ఈ మూడు ప్రదేశంలనందు పెద్దక్క ఆలయంలు కట్టించి స్వామి వారలను ప్రతిష్ఠ చేసినది. శ్రీరాజగోపాలస్వామి ఈ ప్రదేశంలో అవతరించి “వుంన్నా, వుంన్నా” [2] అని పలికినందున అక్కడ గ్రామం నిర్మించి “వుంన్నవ” అనే పేరుతో గ్రామం నిర్మించబడినది. తరువాత అది “వున్నవ” గా ప్రస్తుత కాలంలో "ఉన్నవ" గా పిలువబడుతుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి ప్రత్తిపాటి బసవమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

కారుచోల 4 కి.మీ, వంకాయలపాడు 4 కి.మీ, యడ్లపాడు 5 కి.మీ, ప్రత్తిపాడు 5 కి.మీ, జగ్గాపురం 6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

తూర్పున ప్రత్తిపాడు మండలం, పశ్చిమాన నాదెండ్ల మండలం, ఉత్తరాన ఫిరంగిపురం మండలం, దక్షణాన పెదనందిపాడు మండలం

స్వంత మండలంలోని గ్రామాలు[మార్చు]

యడ్లపాడు మండలంలోని ఉన్నవ, కారుచోల, కొండవీడు, జాలాది, తిమ్మాపురం, మర్రిపాలెం, మైదవోలు, యడ్లపాడు, వంకాయలపాడు, విశ్వనాథుని కండ్రిగ మరియు సొలస గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి యడ్లపాడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల యడ్లపాడులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చిలకలూరిపేటలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల బోయపాలెంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చిలకలూరిపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఉన్నవలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఉన్నవలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఉన్నవలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 82 హెక్టార్లు
  • బంజరు భూమి: 13 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 863 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 876 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఉన్నవలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, మిరప

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు,

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన దంటు రత్నకుమారి, ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుచున్నది. ఇటీవల ప్రభుత్వం ఎస్.ఐ. ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పోటీలలో ఆమె, రాష్ట్రంలోనే నాల్గవస్థానం సాధించింది. [4]

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 4248
  • పురుషుల సంఖ్య 2118
  • మహిళలు 2130
  • నివాసగృహాలు 1091
  • విస్తీర్ణం 959 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు
జనాభా (2011) - మొత్తం 4,901 - పురుషుల సంఖ్య 2,429 - స్త్రీల సంఖ్య 2,472 - గృహాల సంఖ్య 1,859

మూలాలు[మార్చు]

మూస:Ref list

బయటి లింకులు[మార్చు]

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
  • భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
  • ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగస్టు-2; 16వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మార్చి-27; 6వపేజీ.
  • గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు మొదటి భాగం పేజి.నెం.86-88.
  1. https://andhranation.wordpress.com/2015/09/23/here-is-the-full-list-of-mandals-and-villages-coming-under-ap-capital-city-and-ap-capital-region/
  2. https://drive.google.com/file/d/0B3dreJny4z-0Z1JrZzdhNWV4bmM/view
"https://te.wikipedia.org/w/index.php?title=ఉన్నవ&oldid=2551339" నుండి వెలికితీశారు