తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్, వరంగల్
Appearance
తెలంగాణా ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం లేని తెలుగు పౌరాణిక పద్యనాటకాలకు గుర్తింపు తీసుకొనిరావాలనే ఉద్దేశ్యంతో 'తెలుగు పద్యాన్ని బ్రతికించండి - పద్యనాటక మనుగడకు సహకరించండి " అనే నినాదంతో 1998వ సం.లో,వరంగల్ నగరంలో ఈ సంస్థ పందిళ్ళ శేఖర్ బాబు చే స్థాపించబడింది. రిజిష్టర్ నెం.2312/2000.
ఈ సంస్థ చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు
[మార్చు]- పద్యనాటక వైభవాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో 2000 సం. ఫిబ్రవరి 5 నుండి 11వ తేదీ వరకు వరంగల్ లో "పౌరాణిక పద్యనాటక సప్తాహం " నిర్వహించి అందులో శ్రీ కృష్ణరాయబారం, సత్య హరిశ్చంద్ర, చింతామణి, శ్రీ కృష్ణతులాభారం, లవకుశ, గయోపాఖ్యానం, శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకాలను ప్రదర్శించింది.
- 2009వ సం. ఏప్రిల్, మే నెలల్లో హనుమకొండ పట్టణం లోని నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియంలో ఇవే ఏడు నాటకాల ప్రదర్శనతో పౌరాణిక పద్యనాటక సప్తకము నిర్వహించింది. ఈ ఉత్సవాలకు అవసరమైన నిర్వహణ వ్యయం దాదాపు 2.75 లక్షలు స్వంతంగా ఖర్చు చేసి, దర్శకత్వ బాధ్యతలను వహించిన నిర్వాహకుడు పందిళ్ళ శేఖర్ బాబు ఏడు నాటకాలలో ( శ్రీ కృష్ణ రాయబారం లో శ్రీ కృష్ణుడు, లవకుశ లో శ్రీ రాముడు, సత్య హరిశ్చంద్ర లోహరిశ్చంద్రుడు, గయోపాఖ్యానం లో శ్రీ కృష్ణుడు, చింతామణీ లో బిల్వ మంగళుడు ,శ్రీ కృష్ణ తులభారం లో శ్రీ కృష్ణుడు, శ్రీ రామాంజనేయ యుద్ధం లో శ్రీ రాముడు ) ప్రధానపాత్రలను ధరించారు.
- ఇప్పటివరకు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, తిరుపతి లోని మహతి ఆడిటోరియం వంటి ప్రతిష్టాత్మకమైన వేదికలతో పాటుగా విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలలో 437 పౌరాణీక పద్యనాటక ప్రదర్శనలు ఇచ్చింది.
- 2008లో తిరుపతిలో జరిగిన గరుడ పోటీలలో ప్రదర్శించిన శ్రీ కృష్ణరాయబారం నాటకంలో ఉత్తమ సంగీతానికి ఆర్.భద్రాచలం భాగవతార్, ఉత్తమ పద్యపఠనం విభాగంలో పందిళ్ళ శేఖర్ బాబు వ్యక్తిగత గరుడ అవార్డులను సాధించారు.
- 2011 గరుడ పోటీలలో, పందిళ్ళ శేఖర్ బాబు శ్రీ కృష్ణుడుగా నటించడంతో పాటుగా దర్శకత్వం వహించిన గయోపాఖ్యానం నాటకం ద్వితీయ ప్రదర్శనగా ఎంపికై, వెండి గరుడ అవార్డులతోపాటుగా ఉత్తమనటుడు విభాగంలో దేవర్రాజు రవీందర్ రావుకు ,ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా తోట సత్యనారాయణకు, వ్యక్తిగత అవార్డులను సాధించి పెట్టింది. ఇప్పటికీ ఈ సంస్థ ఎంతో ఉత్సాహంతో క్రమంతప్పకుండా నాటకప్రదర్శనలను ఇస్తున్నది.
- ఒంగోలు పట్టణంలో ఎన్.టి.ఆర్. కళాపరిషత్తు వారు 2012 జనవరి నెలలో నిర్వహించిన భారతీయం కళార్చన లో 'యయాతి' పద్యనాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటక రచన శారదా ప్రసన్న, దర్శకత్వం పందిళ్ళ శేఖర్ బాబు. సంయోజకత్వం డా.నిభానుపూడి సుబ్బరాజు. ఇందులో యయాతిగా పందిళ్ళ శేఖర్ బాబు, దేవయానిగా సురభి ప్రభావతి, శర్మిష్ఠగా తిరుమల, శుక్రాచార్యుడుగా డా. సూరేపల్లి గురునాధం, వృషపర్వుడుగా దేవర్రాజు రవీందర్ రావు, మంత్రిగా రాగి వీరబ్రహ్మచారి, సింగన్నగా యెలిగేటి సాంబయ్య, గంగన్నగా నాయికోటి బాబూరావు, చెలికత్తెగా వి. శేషుకుమారి, యదువుగా ఎ.అక్కిరెడ్డి, తుర్వసుడుగా కె.నాగేశ్వర్ రావు, పూరుడుగా శాంతయ్య నటించగా సంగీతం కె.ఎస్.ఎన్.(కొండ కావూరి సత్య నారాయణ ) శర్మ, హార్మోనియం సహకారం ఆర్.భద్రాచలం భాగవతార్ అందించారు.
- శ్రీ కృష్ణ తులాభారం, లవకుశ పద్యనాటకాల వీడియో సీడీలను రూపొందించారు.
- గత మూడేళ్ళుగా తమ నాటకాలలోని ఛాయాచిత్రాలతో ప్రతియేటా క్యాలెండర్ ను విడుదల చేస్తున్నారు.
- పద్యనాటకం వెబ్ Archived 2014-01-11 at the Wayback Machine - పద్యనాటకం బ్లాగ్ , తెలుగు నాటకం బ్లాగ్ లలో ఈ సంస్థ సమాచారాన్ని చూడవచ్చు.