Jump to content

తొక్కిసలాట

వికీపీడియా నుండి
(తోపులాట నుండి దారిమార్పు చెందింది)

తొక్కిసలాట లేదా తోపులాట (stampede) మందలుగా తిరిగే జంతువులలో (మనుషులలో కూడా) ఒకవిధమైన స్పందన మూలంగా అన్ని జంతువులూ ఒకేసారిగా నిర్ధిష్టమైన లక్ష్యం లేకుండా పరుగులెత్తడం మొదలుపెడతాయి. ఇవి కొన్ని సందర్భాలలో తమను తాము నాశనం చేసుకుంటాయి; మరికొన్ని సార్లు అడ్డం వచ్చిన మనుషుల్ని లేదా వారి ఆస్తుల్ని నాశనం చేస్తాయి. ఇవి మెదడు, వినాళ గ్రంథుల వలన ప్రేరేపించబడి ఈ విధంగా ప్రవర్తిస్తాయని భావిస్తారు.

భారీగా జరిగే తొక్కిసలాటలో పశువుల కాపరి వాటిని తనవైపుకు మరల్చడానికి ప్రయత్నిస్తాడు. దీని మూలంగా అవి వాటి చుట్టూ తిరుగుతూ ఉండి, కొండల పైనుండి లేదా నదులలో దూకడానికి అవకాశం ఉండదు. .

పశువులు, ఏనుగులు, గుర్రాలు వంటి కొన్ని జంతువులలో తొక్కిసలాట ఎక్కువగా కనిపిస్తుంది.

మనుషుల తొక్కిసలాట

[మార్చు]

మనుషులలో తొక్కిసలాటలు ఎక్కువగా అతిగా రద్దీగా ఉండే ప్రదేశాలలో జరుగుతుంది. ఇవి ఎక్కువగా మతపరమైన సమూహాలలో, క్రీడా ప్రాంగణాలలో, సంగీత లేదా సాహిత్య సమావేశాలలో జరుగుతాయి. కొన్ని సందర్భాలలో అగ్ని ప్రమాదం గానీ లేదా బాంబు విష్పోటం దీనికి కారణం కావచ్చును. దీనిమూలంగా కొంతమంది తోటివారితో తొక్కబడి కొందరికి గాయాలైతే మరికొందరు ఊపిరి అందక చనిపోతారు.

ప్రతి సంవత్సరం ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కాలో మిలియన్ల కొద్దీ యాత్రికులు సందర్శించే ప్రాంతంలో ఈ తొక్కిసలాటలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మనుషుల తొక్కిసలాట జాబితా

[మార్చు]
  • జూన్ 16, 1883: 180 మందికి పైగా పిల్లలు ఇంగ్లండులో బహుమతులు అందుకోడానికి మెట్లపై నుండి దిగుతుండగా జరిగింది.
  • మే 18, 1896: రష్యాలో నికొలాస్ II పట్టాభిషేకం సమయంలో జరిగిన తొక్కిసలాటలో 1,389 మంది మరణించగా, 1300 మంది గాయపడ్డారు.
  • డిసెంబర్ 24, 1913, మిచిగన్ లో 73 మంది తొక్కిసలాటలో మరణించారు. న్యాయపరంగా దీనిని రాజ్యాంగ సవరణకు అవకాశం ఇచ్చినట్లుగా పేర్కొంటారు. అప్పటి నుండి జనసమర్ధమున్న ప్రాంతాలలో బిగ్గరగా అగ్గి అని అరవడాన్ని అక్కడ నిషేధించారు.
  • అక్టోబర్ 30, 1993: 73 మంది ఫుట్ బాల్ క్రీడాభిమానులు యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించారు.
  • మే 1994: మక్కా లోని జమారత్ వంతెన వద్ద జరిగే దయ్యాన్ని రాళ్ళతో కొట్టే ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 270 మంది మరణించారు.
  • మార్చి, 1998: నేపాల్ లోని సాకర్ స్టేడియంలో వడగళ్ళ వాన కారణంగా జరిగిన తొక్కిసలాటలో 70 మంది చనిపోయారు.
  • ఫిబ్రవరి 20, 2003: నైట్ క్లబ్బులో జరిగిన అగ్ని ప్రమాదం వలన జరిగిన తొక్కిసలాటలో ఇంచుమించు 100 మంది మరణించారు.
  • ఫిబ్రవరి 2004: మక్కాలోని తొక్కిసలాటలో 251 మంది మరణించారు.
  • జనవరి 2005: మహారాష్ట్రలో జరిగిన హిందూ యాత్రికుల తొక్కిసలాటలో 265 మంది చనిపోయారు.
  • ఆగష్టు 31, 2005: 1000 బాగ్దాద్ వంతెన తొక్కిసలాటలో 1000 మందికి పైగా మరణించారు.
  • డిసెంబరు 2005: దక్షిణ భారతదేశం వరదలలో నిరాశ్రయులైన వారికి ఆహార సరఫరా సమయంలో జరిగిన తొక్కిసలాటలో 42 మంది చనిపోయారు.
  • జనవరి 12, 2006: మక్కాలోని తొక్కిసలాటలో 345 మంది మరణించారు.
  • అక్టోబర్ 3, 2007: ఉత్తర భారతదేశంలో రైల్వే స్టేషనులో జరిగిన తొక్కిసలాటలో 14 మంది స్త్రీలు మరణించారు.[1]
  • ఆగష్టు 3, 2008: ఇంచుమించు 145 మంది భక్తులు హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మరణించారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]