Jump to content

దీపం

వికీపీడియా నుండి
(దివ్వె నుండి దారిమార్పు చెందింది)
A close-up image of a candle showing the wick and the various parts of the flame
డేవీ దీపం

దీపము లేదా దివ్వె (ఆంగ్లం Lamp) ఒక విధమైన కాంతినిచ్చే సాధనము. చిన్న దీపమైనా చీకటిని తరిమేస్తుంది. దీపావళి దీపాల సమాహారంతో ఉత్సాహంగా జరుపుకునే హిందూ పండుగ.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో దీపము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] దీపము n. A lamp a light. దీపము పెట్టు v. n. To light a lamp. Metaphorically, to sustain a man's household. Also, to offer prayers for blessing on a benefactor: thus, తమ పాదాలకు దీపము పెట్టుకొంటాను. (Lit.) I will light a candle (in the chapel) to thy feet, i.e., I will offer thee worship of thankfulness. దీపకము n. A light దీపము విశేషణముగా That which burns. వెలిగించునది అని అర్ధం. దీపవల్లి n. అనగా The wick of a lamp. దీపపు వత్తి. దీపవృక్షము n. అనగా A candelabrum, al lamp-stand. దీపస్తంభము. దీపారాధన n. The rite of offering a light to a god. The lighting up lamps at a shrine. దీపావళి (దీప+ఆవలి.) n. Lit: A row of lights, i.e., A feast held on the 14th day of the dark fortnight in Aswayuja wherein is commemorated the నరకాసుర వధ. దీపించు v. n. అనగా To shine, to be evident. to be distinguished or glorious. దీపిక n. అనగా కూడా A lamp, a light. దీపము. ఉదా: ఆంధ్ర దీపిక the Lamp of Telugu, the name of a Telugu Dictionary. నీతిదీపిక lit. "The lamp of Morals." దీప్తి n. Lustre. brilliancy. కాంతి, వెలుగు. దీప్యము n. అనగా Cummin seed. ఓమము, జీలకర్ర.

దీపాలలో రకాలు

[మార్చు]
  • లాంతరు (Lantern): ఇది గూడుకట్టబడిన కాంతినిచ్చే దీపము. ఇవి సామాన్యంగా విశాలమైన, ఎత్తైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో, సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు
  • కొవ్వొత్తులు (Candles): మైనం వంటి కొవ్వు పదార్ధాల మధ్యలో వత్తిని ఉంచి కొవ్వొత్తి చేస్తారు. పూర్వకాలంలో పందుల కొవ్వునుండి చేసేవారు. ప్రస్తుతం మైనం, ముఖ్యంగా పారఫిన్ మైనం ఎక్కువగా వాడుతున్నారు. కొన్నింటిని మేజాపై ఉంచడానికి అనువుగా స్టాండుల్ని ఉపయోగిస్తే, విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు.
  • నూనె దీపాలు (Oil lamps): నూనెతో కుందులలో వెలిగించే దీపాలను నునె దీపాలు అంటారు. ఇవి అతి పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇవి మట్టి, గాజు, పింగాణీ, లేదా లోహాలతో తయారుచేయబడి ఉంటాయి. కొన్ని దీపాలలో చిన్న చక్రం అమర్చి ఉంటుంది. అది తిప్పినప్పుడు వత్తి నెమ్మదిగా పైకి వస్తుంది. సాంప్రదాయకంగా దీపాల్ని దేవుని కోసం ప్రత్యేకంగా వాడతారు. చాలా రకాల నూనెలు దీపాల కోసం వాడకంలో ఉన్నాయి. ఉదా. నెయ్యి, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, కిరోసిన్ మొదలైనవి.
  • విద్యుద్దీపాలు (Electric lamps): విద్యుత్తుతో కాంతిని వెదజల్లే దీపాల్ని విద్యుద్దీపాలు అంటారు. ఆధునిక యుగంలో ఈ దీపాలు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి.
  • డేవీ దీపం (Davy lamp) : గనులలో ఉపయోగించే సురక్షితమైన దీపం.
  • ఆకాశదీపం : కార్తీక మాసంలో, ముఖ్యంగా శివాలయాలలో ఎత్తైన చోట, అవసరమైతే ఒక గడకు కట్టి, సాయం సంధ్యవేళ, మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన ఒక చిల్లుల పాత్రలో నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఒత్తులను వెలిగించడం ఒక సంప్రదాయంగా ఉంది. కార్తీక మాసం అంతా ప్రమిదలు వెలిగించే ఈ దీపాన్ని ఆకాశదీపం అంటారు; సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు వెలిగించే దీపం; కార్తీక దీపం అని కూడా వ్యవహరిస్తారు.

తెలుగు సాహిత్యంలో దీపం

[మార్చు]
  • ఇల్లాలికి గల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ - ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దీపం అనేది జ్ఞానానికి సంకేతం.దీపాన్ని సేవిస్తే అష్ఠ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=దీపం&oldid=3218101" నుండి వెలికితీశారు