దీపక్ హుడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపక్ హుడా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దీపక్ జగ్బీర్ హుడా
పుట్టిన తేదీ1995, ఏప్రిల్ 19
రోహ్‌తక్, హర్యానా[1]
మారుపేరుదీపక్
ఎత్తు6 ft 1 in (185 cm)[2]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 243)2022 ఫిబ్రవరి 6 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2022 నవంబరు 30 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.57
తొలి T20I (క్యాప్ 97)2022 ఫిబ్రవరి 24 - శ్రీలంక తో
చివరి T20I2023 ఫిబ్రవరి 1 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.57
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–2020బరోడా
2014–2015రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 5)
2016–2019సన్‌రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 5)
2020–2021పంజాబ్ కింగ్స్
2021-ప్రస్తుతంరాజస్థాన్
2022-ప్రస్తుతంలక్నో సూపర్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ ట్వంటీ20
మ్యాచ్‌లు 8 46 6
చేసిన పరుగులు 141 2,908 350
బ్యాటింగు సగటు 28.2 42.76 68.33
100s/50s 0/0 9/15 1/0
అత్యధిక స్కోరు 33 293* 104
వేసిన బంతులు 150 1,679 23
వికెట్లు 3 20 5
బౌలింగు సగటు 39.67 40.95 6
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/6 5/31 4/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 47/– 1/–
మూలం: Cricinfo, 1 ఫిబ్రవరి 2023

దీపక్ జగ్బీర్ హుడా, హర్యానాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. అంతర్జాతీయ క్రికెట్ లో భారత క్రికెట్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశీయ క్రికెట్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడతాడు. ఆల్ రౌండర్ గా రాణిస్తూ కుడిచేతి వాటం బ్యాటింగ్, ఆఫ్ బ్రేక్‌లో కుడిచేతి బౌలింగ్ చేస్తాడు.[3] 2022 ఫిబ్రవరిలో భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4]

2009 సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ అండర్-17 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు అతను 14 సంవత్సరాల వయస్సులో సీనియర్ స్థాయిలో ఆడాడు. అంతకుముందు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, ఆ తర్వాత అతను బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయ్యాడు.

జననం[మార్చు]

దీపక్ జగ్బీర్ హుడా 1995, ఏప్రిల్ 19న హర్యానాలోని రోహ్‌తక్ లో జన్మించాడు. ఇతని తండ్రి భారత వైమానిక దళ సిబ్బంది, కబడ్డీ కోసం సర్వీస్ ప్లేయర్ అయిన జజ్బీర్ హుడా. హుడా చిన్నతనం నుండి క్రీడలలో చురుకుగా ఉండేవాడు. స్కూల్‌లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

కోచ్ సంజీవ్ సావంత్ ప్రకారం, హుడా "చాలా ఖచ్చితమైన బౌలర్",[5] చురుకైన ఫీల్డర్ అని కూడా అంటారు.[6] 2015, ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ తరపున పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ XI పంజాబ్)పై ఐపిఎల్ అరంగేట్రం చేసాడు. 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు.[7] రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో తన రెండవ మ్యాచ్‌లో, 25 బంతుల్లో 54 పరుగులు చేసి తన తొలి అర్ధ సెంచరీని సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.[8]

2016-17 రంజీ ట్రోఫీ నాల్గవ రౌండ్‌లో బరోడా తరపున ఆడుతున్న ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో హుడా తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు.[9]

2016 ఐపీఎల్ వేలంలో హుడాను సన్‌రైజర్స్ హైదరాబాద్ 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. 2017 వేలానికి ముందు ఉంచబడ్డాడు, కానీ ఐపిఎల్ 10వ ఎడిషన్ తర్వాత జట్టు అతన్ని విడుదల చేసింది. 2018 జనవరిలో 2018 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది.[10] 2020 ఐసిఎల్ వేలానికి ముందు అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది.[11] 2020 ఐపిఎల్ వేలంలో, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు కింగ్స్ XI పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది.[12]

2022 ఐపిఎల్ వేలంలో, హుడాను లక్నో సూపర్ జెయింట్స్ ₹5.75 కోట్లకు కొనుగోలు చేసింది.[13]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2017 నవంబరులో శ్రీలంకతో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం భారత జట్టులో హుడా ఎంపికయ్యాడు.[14]

2018 ఫిబ్రవరిలో 2018 నిదాహాస్ ట్రోఫీ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో హుడా ఎంపికయ్యాడు, కానీ అతను ఆడలేదు.[15] 2018 డిసెంబరులో 2018 ఏసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు.[16]

2022 జనవరిలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌కు భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టులో హుడా ఎంపికయ్యాడు.[17] అదే సిరీస్‌లోని తొలి వన్డేలో వెస్టిండీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.[18] మరుసటి నెలలో, వెస్టిండీస్‌తో జరిగిన వారి సిరీస్‌కు కూడా భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో చేర్చబడ్డాడు.[19] 2022 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం భారతదేశం టీ20 జట్టులో ఎంపికయ్యాడు.[20] 2022 ఫిబ్రవరి 24న భారతదేశం తరపున శ్రీలంకపై తన టీ20 అరంగేట్రం చేశాడు.[21]

2022 జూన్ లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు భారత జట్టులో ఎంపికయ్యాడు.[22] సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో హుడా తన తొలి టీ20 సెంచరీని సాధించాడు.[23] సంజూ శాంసన్‌తో కలిసి 176 పరుగుల భాగస్వామ్యం పురుషుల టీ20లో రెండవ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం, భారతదేశం తరపున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.[24]

2022 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు కూడా ఎంపికయ్యాడు.[25]

మూలాలు[మార్చు]

 1. Deepak Hooda | India Cricket | Cricket Players and Officials. ESPN Cricinfo. Retrieved on 2023-08-15.
 2. [1] on Cricketer Life
 3. "Deepak Hooda profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
 4. "Deepak Hooda profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
 5. "Accuracy pays off for Deepak Hooda". Indian Express. 16 February 2014. Retrieved 2023-08-15.
 6. "Deepak Hooda makes most of match practice". DNA India. Retrieved 2023-08-15.
 7. "Cricket scorecard - Kings XI Punjab vs Rajasthan Royals, 3rd Match, Indian Premier League 2015". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
 8. "Cricket scorecard - Delhi Capitals vs Rajasthan Royals, 6th Match, Indian Premier League 2015". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
 9. "Deepak Hooda's 293* flattens Punjab". ESPN Cricinfo. 28 October 2016. Retrieved 2023-08-15.
 10. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 11. "Where do the eight franchises stand before the 2020 auction?". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 12. "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 13. "PL Auction 2022 live updates". 12 February 2022. Retrieved 2023-08-15.
 14. "Washington Sundar, Thampi, Hooda in India's T20 squad". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
 15. "Rohit Sharma to lead India in Nidahas Trophy 2018". BCCI Press Release. 25 February 2018. Archived from the original on 25 February 2018. Retrieved 2023-08-15.
 16. "India Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 17. "Rohit and Kuldeep return for West Indies ODIs and T20Is". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 18. "1st ODI (D/N), Ahmedabad, Feb 6 2022, West Indies tour of India and scored 26 runs of 32 deliveries". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 19. "KL Rahul and Axar Patel ruled out of T20I Series". Board of Control for Cricket in India. Retrieved 2023-08-15.
 20. "Ravindra Jadeja, Sanju Samson back in India squad for Sri Lanka T20Is". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 21. "1st T20I (N), Lucknow, Feb 24 2022, Sri Lanka tour of India". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 22. "Hardik Pandya to captain India in Ireland T20Is; Rahul Tripathi gets maiden call-up". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
 23. "Ireland vs India: Deepak Hooda smashes 55-ball century to put India in command in 2nd T20I". India Today. Retrieved 2023-08-15.
 24. "Deepak Hooda, Sanju Samson register highest T20I partnership for India". Indian Express (in ఇంగ్లీష్). 28 June 2022. Retrieved 2023-08-15.{{cite web}}: CS1 maint: url-status (link)
 25. "T20 World Cup, IND vs SA: Deepak Hooda Replaces Axar Patel as Rohit Sharma Elects to Bat Against South Africa". News18 (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.

బయటి లింకులు[మార్చు]