నగరం (మామిడికుదురు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నగరం
—  రెవిన్యూ గ్రామం  —
నగరం is located in ఆంధ్ర ప్రదేశ్
నగరం
అక్షాంశరేఖాంశాలు: 16°30′13″N 81°55′48″E / 16.5035°N 81.9301°E / 16.5035; 81.9301
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం మామిడికుదురు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,250
 - పురుషుల సంఖ్య 3,116
 - స్త్రీల సంఖ్య 3,134
 - గృహాల సంఖ్య 1,681
పిన్ కోడ్ 533 247
ఎస్.టి.డి కోడ్

నగరం అనేది తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము.[1].. పిన్ కోడ్: 533 247. ఈ గ్రామంలో హిందువులు,ముస్లీంలు, క్రైస్తవులు కలసి మెలసి ఉంటారు. ఈ గ్రామంలో ముస్లీంల శాతం ఎక్కువ. ఇక్కడ మొహర్రం, హర్బయిన్ (దేవునిపై ఉన్న అపారమైన భక్తితో మాతం చేస్తారు), క్రిష్టమస్,సంక్రాంతి,దీపావళి, దొడ్డి గంగాళమ్మ జాతర బాగా చేస్తారు. ఈ గ్రామం గ్రామ దేవత దొడ్డి గంగాళమ్మ తల్లి. ఇక్కడ జరిగే జాతర అంగరంగవైభవంగా ఉంటుంది.

పాఠశాలలు[మార్చు]

ఈగ్రామంలో ఉన్న జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల చాలా అధునీకరించబడింది. ఈ పాఠశాల చూడటానికి ప్రైవేటు పాఠశాల వలే ఉంటుంది.

గ్రామం విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో కాస్తాలు, నాన్ రొట్టి షేర్వా, గరాజీలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ గ్రామానికి ఇరు వైపులా ఉన్న రెండు దర్గాల వలన ఈ ఊరు సురక్షితంగా ఉందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ నీతిపూడి గణేష్ బాబు చాలా పాటుపడ్డారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,250 - పురుషుల సంఖ్య 3,116 - స్త్రీల సంఖ్య 3,134 - గృహాల సంఖ్య 1,681

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,913.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,978, మహిళల సంఖ్య 2,935, గ్రామంలో నివాస గృహాలు 1,415 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14