Jump to content

అప్పనపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°31′44.4″N 81°55′20.0″E / 16.529000°N 81.922222°E / 16.529000; 81.922222
వికీపీడియా నుండి
అప్పనపల్లి
పటం
అప్పనపల్లి is located in ఆంధ్రప్రదేశ్
అప్పనపల్లి
అప్పనపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°31′44.4″N 81°55′20.0″E / 16.529000°N 81.922222°E / 16.529000; 81.922222
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంమామిడికుదురు
విస్తీర్ణం6.62 కి.మీ2 (2.56 చ. మై)
జనాభా
 (2011)
5,265
 • జనసాంద్రత800/కి.మీ2 (2,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,644
 • స్త్రీలు2,621
 • లింగ నిష్పత్తి991
 • నివాసాలు1,470
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533247
2011 జనగణన కోడ్587812

అప్పనపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామం.[2]

ఇది మండల కేంద్రమైన మామిడికుదురు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5, 103.[3] ఇందులో పురుషుల సంఖ్య 2, 539, మహిళల సంఖ్య 2, 564, గ్రామంలో నివాసగృహాలు 1, 338 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1470 ఇళ్లతో, 5265 జనాభాతో 662 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2644, ఆడవారి సంఖ్య 2621. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1518 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 45. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587812.[4].ఈ గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల (నూకల) అప్పన అనే ఋషి ద్వారా వచ్చింది. ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి.

వెంకటేశ్వరస్వామి దేవస్థాన చరిత్ర

[మార్చు]

కాకినాడకు 70 కిలోమీటర్లు, రాజమహేంద్రవరంకి 85 కిలోమీటర్లు, అమలాపురానికి 35 కీ.మీ. దూరంలో ఉంది.

అప్పనపల్లి బాలాజీ దేవాలయం.
దేవాలయ అంతర్భాగం.
అప్పనపల్లి వద్ద గోదావరి దృశ్యం.
దస్త్రం:Appanapalli.1.jpg
అప్పనపల్లి గ్రామ కూడలిలో శివాలయం

ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల శీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్ఠించి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.

ఇక్కడ దేవాలయములో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చినవి. విచిత్రముగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు.

దేవస్థాన విశేషాలు

అక్కడ జరిగే పూజాదులు, సేవలు, సాంసృతిక సేవా కార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్వార్థము వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానము తీరుగా వచ్చిన వారందరకూ ఉచిత భోజనము, లోపములేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతముగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికముగా ఉండుటవలన ప్రభుత్వ దేవాదాయశాఖ వారు దేవస్థానమును వారి ఆధీనములోకి తీసుకొన్నారు. అప్పటి నుండి వారు పాత కార్యవర్గమును రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమములను నిలిపివేయుటతో భక్తుల రాకపోకలు గణనీయముగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల ఒరవడి తగ్గుట ఆదాయము మందగించుటతో ఈ మధ్యనే తిరిగి యధాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించుట మొదలెట్టినారు.

పాత దేవాలయం

ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ప్రధాన దేవాలయం నుండి పూర్వదేవాలయం వరకూ తిరునాళ్ళు లేదా తీర్ధం ఉంటుంది.
  • అప్పనపల్లెలో బహుసుందరంగా కొత్తగా కట్టిన శివాలయం ఉంది. దేవాలయం మొత్తం తెల్లగా ఉండుట దీని ప్రత్యేకత.
  • అప్పనపల్లె గోదావరి పాయ అయిన వైనతేయనదిలో అప్పనపల్లె లంక చిన్నద్వీపం ఉంది. పచ్చగా నిండుగా పెరిగిన వృక్షాలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ పశువుల గ్రాసం సమృద్దిగా దొరకుటచే గ్రామస్థులు పశువులను ఇక్కడే ఉంచి ప్రతిరోజూ వెళ్ళి వస్తుంటారు. యాత్రికులకు కూడా స్నానఘట్టం నుండి తక్కువ రుసుంతో లంకకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేందుకు దేవస్థానంవారు పడవలను ఉంచుతారు.
  • ఈ గ్రామం పవిత్రమైన వైనతేయ నది ఒడ్డున ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇక్కడి స్వామిని అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తారు. ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఉరికి మూడు ప్రక్కల గోదావరి నది నాలుగవ ప్రక్క బంగాళాఖాతం ఉన్నాయి. పచ్చటి వరిచేలు, విస్తారంగా కొబ్బరి తోటలు, పనస చెట్లు, కూరగాయల మడులతో ఉన్న ఈ ప్రాంతం కోనసీమలో భాగం.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • శ్రీ మొల్లేటి రామస్వామి - అప్పనపల్లి దేవాలయ నిర్మాణ కర్త.
  • శ్రీ వాయువేగుల వెంకట రామయ్య - ఇక్కడ తప్పస్సు చేసినట్టుగా చెప్పే వాయువేగుల అప్పన ముని వారసులు.
  • శ్రీ అల్లూరి సీతారామరాజు
  • శ్రీ గంటి సుబ్బా రావు
  • శ్రీ మైలవరపు పురుషోత్తమ శర్మ
  • శ్రీ అల్లూరి మైనర్ రాజు

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి మామిడికుదురులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మామిడికుదురులోను, ఇంజనీరింగ్ కళాశాల బతిలపాలెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ ముక్తేశ్వరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పి.గన్నవరంలోను, అనియత విద్యా కేంద్రం మామిడికుదురులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

అప్పనపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

అప్పనపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అప్పనపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 105 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 9 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 548 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 462 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 86 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

అప్పనపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 86 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అప్పనపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

కొబ్బరి, వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

వంటనూనెలు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-11.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-11.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".