నరసింగోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నరసింగోలు
రెవిన్యూ గ్రామం
నరసింగోలు is located in Andhra Pradesh
నరసింగోలు
నరసింగోలు
నిర్దేశాంకాలు: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019Coordinates: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంజరుగుమల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,344 హె. (3,321 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523271 Edit this at Wikidata

నరసింగోలు, ప్రకాశం జిల్లా, జరుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 271., యస్.టీ.డీ.నం.08598.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం ఒంగోలు నుండి 20 కి.మీ దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

జి.మేకపాడు 1.8 కి.మీ, చిర్రికూరపాడు 3.1 కి.మీ, జిల్లెళ్ళమూడి 3.8 కి.మీ, విక్కిరాలపేట 4 కి.మీ, పందలపాడు 4.4 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

సమీప పట్టణాలు[మార్చు]

పొన్నలూరు 10.6 కి.మీ, జరుగుమిల్లి 11.1 కి.మీ, కందుకూరు 11.1 కి.మీ, కొండపి 12 కి.మీ.

ప్రభుత్వ పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి మల్లవరపు కనకవల్లి, 2015, నవంబరు-17,18 తేదీలలో హైదరాబాదులోని జింఖానా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందేలలో ప్రథమస్థానం సాధించి, జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ స్పోర్ట్స్ మీట్ కు ఎంపికైనారు. ఈమె 2016, జనవరి-1 నుండి 7 వరకు, పూణేలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. గతంలో ఈమె జాతీయస్థాయిలో 2, రాష్ట్రస్థాయిలో 4 పతకాలు సాధించారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శనీశ్వరాలయం[మార్చు]

ఈ గ్రామంలోని ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం, మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. ఒంగోలు నుండి 25 కి.మీ. దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో శనీశ్వరుడు లింగరూపంలో కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. శనిదేవుడు ఈశ్వరునిలో మమేకమైన అత్యంత అరుదైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు. శని, శివుడు, ఇరుదేవతలు జంటగా కొలువుదీరిన ఆలయమిది. అగస్త్యమహర్షిచే ప్రతిష్ఠితమైన ఈ ధామం, అత్యంత పురాతనమైనదిగా పేరు గాంచింది. వివిధ ఉపాలయాలతో అలరారుతున్న ఆలయమిది. [2]&[3]

ఈ ఆలయంలో 2017, ఆగస్టు-19వతేదీ శనివారంనాడు, శనిత్రయోదశి సందర్భంగా, ప్రత్యేకపూజలు నిర్వహించారు. శనీశ్వరునికి తైలాభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వరస్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. పిమ్మట భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ యోగానందనరసింహస్వామి వారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాల సందర్భంగా 2014, జూన్-14, శనివారం నాదు, అఖండదీపారాధన చేయుదురు. 15వ తేదీ ఆదివారం నాడు, మహాశాంతిహోమం నిర్వహించెదరు. 16వ తేదీ సోమవారం నాడు, విగ్రహ ప్రతిష్ఠ, అన్నదానం కార్యక్రమం నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ జంధ్యాల చంద్రభాస్కరశాస్త్రి[మార్చు]

గ్రామంలోని రామలింగేశ్వర, శనీశ్వరస్వామివారి ఆలయాల ప్రధాన అర్చకులు శ్రీ జంధ్యాల చంద్రభాస్కరశాస్త్రికి గౌరవ డాక్టరేట్ ప్రదానానికి ఎంపిక చేసారు. ఇటీవల సికిందరాబాదులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ్యోతిష విశ్వవిద్యాపీఠ్, ఓంకారేశ్వర విశ్వవిద్యాలయం ఛైర్మన్ శ్రీ భూపేష్ గార్గ్ చేతులమీదుగా వీరికి ఈ డాక్టరేట్ ప్రదానం చేసారు. [6]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,941 - పురుషుల సంఖ్య 994 - స్త్రీల సంఖ్య 947 - గృహాల సంఖ్య 433

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,015.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,048, మహిళల సంఖ్య 967, గ్రామంలో నివాస గృహాలు 444 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,344 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-5; 13వపేజీ. [3] ఈనాడు మెయిన్; 2013, నవంబరు-29; తీర్ధయాత్ర పేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-14; 16వపేజీ [5] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-28; 16వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-16; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, ఆగస్టు-20; 15వపేజీ.

మూస:జరుగుమిల్లి మండలంలోని గ్రామాలు