నవదీప్ సైనీ
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | నవదీప్ అమర్‌జీత్ సైనీ |
పుట్టిన తేదీ | కర్నాల్, హర్యానా | 1992 నవంబరు 23
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.)[1][2] |
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ |
పాత్ర | బౌలరు |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
తొలి టెస్టు (క్యాప్ 299) | 2021 జనవరి 7 - ఆస్ట్రేలియా తో |
చివరి టెస్టు | 2021 జనవరి 15 - ఆస్ట్రేలియా తో |
తొలి వన్‌డే (క్యాప్ 229) | 2019 డిసెంబరు 22 - వెస్టిండీస్ తో |
చివరి వన్‌డే | 2021 జూలై 23 - శ్రీలంక తో |
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 96 |
తొలి T20I (క్యాప్ 80) | 2019 ఆగస్టు 3 - వెస్టిండీస్ తో |
చివరి T20I | 2021 జూలై 28 - శ్రీలంక తో |
T20Iల్లో చొక్కా సంఖ్య. | 96 |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2013–2018 | ఢిల్లీ |
2018–2021 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ |
2022 | రాజస్థాన్ రాయల్స్ |
2022 | కెంట్ |
మూలం: Cricinfo, 2 April 2022 |
నవదీప్ అమర్‌జీత్ సైనీ (జననం 1992 నవంబరు 23) భారతీయ క్రికెట్ ఆటగాడు, హర్యానాలోని కర్నాల్‌లో జన్మించాడు. 2013 నుంచి ఢిల్లీ తరఫున ఆడాడు. అతను 2019 ఆగస్టులో భారత క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు [3]
నవదీప్ సైనీ 1992 నవంబరు 23న హర్యానాలోని కర్నాల్‌లో జన్మించాడు. అతని తండ్రి హర్యానా ప్రభుత్వంలో డ్రైవరుగా ఉద్యోగం చేస్తున్నాడు. [4] అతని తాత కరమ్ సింగ్, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త. సుభాస్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో పాల్గొన్నాడు.[5] [6]
దేశీయ కెరీర్
[మార్చు]సైనీ 2015-16 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2016 జనవరి 2 న తన తొలి ట్వంటీ20 ఆడాడు.[7]
2017 ఫిబ్రవరిలో , 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అతన్ని 10 లక్షలకు కొనుగోలు చేసింది. [8] 2018 జనవరిలో 2018 IPL వేలంలో 3 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. [9]
అతను 2017–18 రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో 34 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [10] అతను 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌లలో పదహారు ఔట్‌లతో ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలరయ్యాడు. [11] 2018 అక్టోబరులో అతను, 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో ఎంపికయ్యాడు. [12] తరువాతి నెలలో, అతను 2018–19 రంజీ ట్రోఫీలో దృష్టిలో పెట్టుకోవాల్సిన ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకడిగా పేరు పొందాడు. [13]
2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని కొనుగోలు చేసింది. [14] 2022 జూలైలో అతను, ఇంగ్లాండ్‌లో మూడు కౌంటీ ఛాంపియన్‌షిప్, ఐదు వన్డే కప్ మ్యాచ్‌లు ఆడేందుకు కెంట్‌తో స్వల్పకాలిక ఒప్పందంపై సంతకం చేశాడు. [15] అతను వార్విక్‌షైర్‌తో తన తొలి మ్యాచ్ ఆడి, మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా మొత్తం మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. [16] [17]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2018 జూన్‌లో అతను మహ్మద్ షమీకి బదులుగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ కోసం భారత టెస్టు జట్టులో చేరాడు గానీ ఆడే అవకాశం దొరకలేదు. [18] 2019 ఏప్రిల్లో , 2019 క్రికెట్ ప్రపంచ కప్‌కు స్టాండ్‌బై బౌలర్‌గా ఎంపికయ్యాడు. [19]
2019 జూలైలో అతను, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం భారతదేశం యొక్క వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్లలో ఎంపికయ్యాడు.[20] 2019 ఆగస్టు 3 న వెస్టిండీస్‌పై తన తొలి టి20I ఆడాడు.[21] తన నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. ఇందులో నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్ లను వరుస బంతుల్లో ఔట్ చేసాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసి ఆ ఓవరును వికెట్-మెయిడెన్ చేశాడు. అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. [22] 2019 డిసెంబరులో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ కోసం అతన్ని భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టులోకి తీసుకున్నారు. [23] 2019 డిసెంబరు 22 న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున వన్‌డేల్లో ప్రవేశం చేసాడు [24] 2020 ఫిబ్రవరిలో అతను న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం భారత టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [25] 2020 అక్టోబరులో అతను మళ్లీ భారత టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. ఈసారి ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం. [26] అయితే, వెన్ను నొప్పి కారణంగా సైనీ మొత్తం టూరంతా ఆడలేకపోయాడు.[27] 2021 జనవరి 7 న ఆస్ట్రేలియాతో తన తొలి టెస్టు ఆడి, తొలి వికెట్‌గా తోటి తొలి మ్యాచ్ ఆటగాడైన విల్ పుకోవ్‌స్కీని ఔట్ చేసాడు. [28]
మూలాలు
[మార్చు]- ↑ Navdeep Saini's profile on Cricbuzz
- ↑ Navdeep Saini's profile on Sportskeeda
- ↑ "Navdeep Saini". ESPN Cricinfo. Retrieved 7 November 2015.
- ↑ Jain, Sahil (11 June 2018). "Navdeep Saini: India's latest pace sensation". Sportskeeda (in ఇంగ్లీష్). Retrieved 22 July 2019.
- ↑ Venugopal, Arun (19 December 2017). "The making of Navdeep Saini". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 22 July 2019.
- ↑ "Whenever I speak about Gautam Gambhir, I get emotional, says Navdeep Saini". The Indian Express (in Indian English). 11 June 2018. Retrieved 22 July 2019.
- ↑ "Syed Mushtaq Ali Trophy, Group C: Delhi v Railways at Vadodara, Jan 2, 2016". ESPN Cricinfo. Retrieved 10 January 2016.
- ↑ "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 20 February 2017.
- ↑ "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
- ↑ "Ranji Trophy, 2017/18: Delhi batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 April 2018.
- ↑ "Vijay Hazare Trophy, 2018/19 - Delhi: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 20 October 2018.
- ↑ "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. Retrieved 19 October 2018.
- ↑ "Eight players to watch out for in Ranji Trophy 2018-19". ESPN Cricinfo. Retrieved 3 November 2018.
- ↑ "IPL Auction 2022: From Navdeep Saini to Yuzvendra Chahal, full list of players bought by RR - Firstcricket News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ "Navdeep Saini joins Kent for overseas stint". Kent Cricket. 15 July 2022. Retrieved 22 July 2022.
- ↑ Chhabria, Vinay. ""Sometimes, it is cloudy and then the sun is out"- Navdeep Saini comments on playing county cricket after winning Man of the Match award". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 23 July 2022.
- ↑ "Watch: Navdeep Saini takes five-fer on County debut, receives ovation from Kent players; Fan says 'build him a statue'". Hindustan Times (in ఇంగ్లీష్). 21 July 2022. Retrieved 23 July 2022.
- ↑ "Shami out of Afghanistan Test after failing fitness Test". ESPN Cricinfo. Retrieved 11 June 2018.
- ↑ "Navdeep Saini named standbys for World Cup". ESPN Cricinfo. Retrieved 24 April 2019.
- ↑ "MS Dhoni out of West Indies tour, Hardik Pandya rested". ESPN Cricinfo. Retrieved 21 July 2019.
- ↑ "1st T20I, India tour of United States of America and West Indies at Lauderhill, Aug 3 2019". ESPN Cricinfo. Retrieved 3 August 2019.
- ↑ "Debutant Saini stars as India edge low scoring thriller in Florida". International Cricket Council. Retrieved 3 August 2019.
- ↑ "Navdeep Saini Replaces Deepak Chahar In India Side For Third ODI Vs West Indies". News Nation. Retrieved 19 December 2019.
- ↑ "3rd ODI, West Indies tour of India at Cuttack, Dec 22 2019". ESPN Cricinfo. Retrieved 22 December 2019.
- ↑ "India in New Zealand - Prithvi Shaw returns to Test squad, Mayank Agarwal in for ODIs". ESPN Cricinfo. Retrieved 4 February 2020.
- ↑ "India squads for tour of Australia: Rohit Sharma not part of India squads to tour Down Under". Sport Star. Retrieved 26 October 2020.
- ↑ "Navdeep Saini Sustains Back Injury; Back-Up Named". Cricfit (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 7 December 2020.
- ↑ "3rd Test, Sydney, Jan 7 - Jan 11 2021, India tour of Australia". ESPN Cricinfo. Retrieved 7 January 2021.