నవాజుద్దీన్ సిద్ధికి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవాజుద్దీన్ సిద్ధికి
జననం (1974-05-19) 1974 మే 19 (వయసు 49)
బుధాన, ముజాఫ్ఫార్ నగర్ , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతదేశం
విద్యాసంస్థనేషనల్ స్కూల్ అఫ్ డ్రామా , గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆలియా సిద్ధికి [1]
పిల్లలుయాని, షోరా[2]

నవాజుద్దీన్ సిద్ధికి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా పూర్వ విద్యార్థి.[3]

జననం & విద్యాభాస్యం[మార్చు]

నవాజుద్దీన్ సిద్ధికి 1974, మే 19న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని, ముజాఫ్ఫార్ నగర్, బుధానలో జన్మించాడు.[4] ఆయన తల్లి తండ్రులకు ఎనిమిది మంది సంతానంలో సిద్ధికి పెద్దవాడు. ఆయన బాల్యమంతా ఉత్తరాఖండ్లో గడిచింది.

సిద్దికీ హరిద్వార్ లోని గురుకుల్ కాంగ్రి విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పూర్తి చేశాడు. కొన్నాళ్లు వడోదరలో కెమిస్ట్ గా పనిచేసి, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ ఒక నాటకం చూశాక ఆయనకు నేతపై ఆసక్తి కలిగింది. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ అఫ్ డ్రామాలో అడ్మిషన్ పొందాడు. ఆయన అక్కడ తన మిత్రుల నాటక సంస్థల్లో దాదాపు 10 నాటకాల్లో నటించాడు.

సినీ ప్రస్థానం[మార్చు]

సిద్ధికి 1999లో నేషనల్ స్కూల్ అఫ్ డ్రామాలో కోర్స్ పూర్తయ్యాక టివి సీరియల్స్ అవకాశాల కోసం ముంబైకు వెళ్ళాడు. ఆయన 1999లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'సర్ఫారోష్' చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు.[5]

గాయకుడిగా[మార్చు]

నవాజుద్దీన్ సిద్ధికి తొలిసారి 'బోలె చుడియాన్' చిత్రంలో పాట పాడి గాయకుడిగా మారాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Spencer, Samuel (16 August 2019). "Nawazuddin Siddiqui wife: Who is Sacred Games Gaitonde star married to?". Daily Express. Retrieved 16 August 2019.
  2. Hindustan Times (30 March 2021). "Nawazuddin Siddiqui's wife Aaliya celebrates Holi with his brother Shamas, year after accusing him of hitting her". Archived from the original on 23 April 2021. Retrieved 28 April 2021.
  3. The Indian Express (27 May 2012). "My family counts only the Khans as actors". Archived from the original on 28 April 2021. Retrieved 28 April 2021.
  4. The Times of India (22 October 2017). "Bollywood: In Bollywood, the heroine is still a prop and the hero must dance and shoot people: Nawazuddin Siddiqui - Times of India". Archived from the original on 28 April 2021. Retrieved 28 April 2021.
  5. Republic World (26 April 2020). "Nawazuddin Siddiqui's transformation pics that talk a lot about his glorious journey". Archived from the original on 23 July 2020. Retrieved 28 April 2021.
  6. Gulf News (16 April 2021). "Bollywood actor Nawazuddin Siddiqui makes his singing debut". Archived from the original on 28 April 2021. Retrieved 28 April 2021.