నిండు సంసారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిండు సంసారం
(1968 తెలుగు సినిమా)
TeluguFilm NinduSamsaram.JPG
దర్శకత్వం సి.ఎస్. రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
నాగయ్య,
ఎస్.వరలక్ష్మి,
పద్మనాభం,
డబ్బింగ్ జానకి
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ నవశక్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నిండు సంసారం సినిమా చిత్రీకరణలో నటి డబ్బింగ్ జానకి చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరవాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.

తారాగణం[మార్చు]

 • ఎన్.టి.రామారావు - భాస్కర్
 • చిత్తూరు నాగయ్య - బ్రహ్మయ్య
 • హేమలత - సరస్వతమ్మ
 • ప్రభాకరరెడ్డి - రంగనాథం
 • ఎస్.వరలక్ష్మి - తులసమ్మ
 • అనిత - శాంత
 • జగ్గారావు - సుబ్బారాయుడు
 • డబ్బింగ్ జానకి - సీత
 • రమణారెడ్డి - సోమయ్య
 • రేలంగి - ఉమాకాంతారావు
 • కృష్ణకుమారి - జ్యోతి
 • పద్మనాభం - ఎస్ మయ్యా
 • జయకృష్ణ - మోహన్
 • రమాప్రభ - సుబ్బులు
 • బాలకృష్ణ - అప్పన్న
 • జూనియర్ భానుమతి
 • బొడ్డపాటి
 • రామకోటి

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ, స్క్రీన్‌ప్లే: నవశక్తి యూనిట్
 • కళ: సూరన్న
 • కూర్పు: ఎస్‌పి వీరప్ప
 • నృత్యం: చిన్ని, సంపత్
 • మాటలు: పినిశెట్టి
 • ఛాయాగ్రహణం: కె సత్యనారాయణ
 • స్టంట్స్: సాంబశివరావు అండ్ పార్టీ
 • సంగీతం: మాస్టర్ వేణు
 • దర్శకత్వం: సిఎస్ రావు
 • నిర్మాత: పి గంగాధరరావు

కథ[మార్చు]

డిగ్రీ చదివిన నిరుద్యోగి భాస్కర్ (ఎన్టీ రామారావు). అతని తండ్రి బ్రహ్మయ్య (నాగయ్య) చూపులేనివాడు. అతని తల్లి సరస్వతమ్మ (హేమలత). అన్నా వదినలు రంగనాధం (ప్రభాకరరెడ్డి), తులసమ్మ (ఎస్ వరలక్ష్మి), వారి కుమారుడు శంకరం. భాస్కర్ చెల్లెలు శాంత (అనిత) కాలు అవిటిది. నిజం నిక్కచ్చిగా మాట్లాడే భాస్కర్ పలుచోట్ల ఉద్యోగాలు చేసి వాటిని వదులుకుంటాడు. అతని నిజాయితీ మెచ్చిన సుబ్బారాయుడు (జగ్గారావు), అతని చెల్లెలు సీత (డబ్బింగ్ జానకి) ఇంట్లో అతనికి ఓ డ్రైవర్ ఉద్యోగంతోపాటు ఆశ్రయం కల్పిస్తాడు. అన్న రంగనాథం మెతకతనం, వదిన తులసమ్మ గయ్యాళితనంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు, చెల్లెలిని భాస్కర్ తనతో తీసుకొచ్చి బ్రహ్మయ్య స్నేహితుడు సోమయ్య (రమణారెడ్డి) ఇంట్లో అద్దెకు దిగుతాడు. అనుకోకుండా పరిచయమైన ఆ ఊరి ధనవంతుడు, వ్యాపారి ఉమాకాంతరావు (రేలంగి) కుమార్తె జ్యోతి (కృష్ణకుమారి) భాస్కర్ మంచితనం గుర్తించి తన తండ్రి ఆఫీసులో లారీ డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. అన్న రంగనాథం అదే ఆఫీసులో మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తులసమ్మ తమ్ముడు, మోసగాడైన ఎస్ మయ్యా (పద్మనాభం) జ్యోతిని పెళ్లాడి, ఆస్తి కాజేయాలని పలు ప్రయత్నాలు చేస్తాడు. ఈక్రమంలో భాస్కర్‌పై దొంగతనం నేరంమోపి అతని ఉద్యోగం పోయేలా చేస్తాడు. ఉమాకాంతారావు అతని చెల్లెలు పెళ్లి ఆపటానికి బాకీకోసం సోమయ్య ఇంటిని స్వాధీనం చేసుకునే యత్నాలు చేయిస్తాడు. మయ్యా అంతకుముందే సీతను పెళ్లాడి వదిలేశాడని ఋజువవుతుంది. కారు రేసులో గెలిచి 10వేలు తెచ్చి సోమయ్య బాకీ తీర్చాలని భాస్కర్ ప్రయత్నిస్తాడు. అతన్ని చంపించటానికి తులశమ్మ రౌడీలను ప్రయోగిస్తుంది. నిజం తెలిసిన రంగనాథం భార్యను దండించి, భాస్కర్‌ను కాపాడే యత్నంలో గాయపడతాడు. చివరకు తులశమ్మలో పరివర్తన కలిగి జ్యోతి, భాస్కర్; శాంత, మోహన్ (జయకృష్ణ)కు వివాహాలు జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు[మార్చు]

 1. ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు గుండె బలం నీ ఆయుధం - ఘంటసాల - రచన: డా॥ సినారె
 2. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అణగిఉన్న ఆశలు ఈనాడు - సుశీల, ఘంటసాల - రచన: దాశరధి
 3. చిట్టి చిట్టి ఇటురావే చేయిపట్టుకోనీవే పైటగాలి తగలితేనే - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి
 4. దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా దారుణాలు చూడలేక రాయిలాగ మారినాడా - సుశీల
 5. నా కన్నులు నీకో కథ చెప్పాలి కన్ను తెరు కన్ను తెరు నా కన్నెవలపులో అమృతముందీ చవిచూడూ - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
 6. మై డియర్ తులసమ్మక్కా లక్కీ ఛాన్స్ కొట్టేశా మజాగా రేపోమాపో జ్యోతికి తాళి - పిఠాపురం
 7. యవ్వనమే కద అందం ఆ అందమే మధురానందం - సుశీల బృందం
 8. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది - సుశీల

మూలాలు[మార్చు]

 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 1. సివిఆర్ మాణిక్యేశ్వరి (1 December 2018). "ఫ్లాష్ బ్యాక్ @ 50 నిండు సంసారం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 7 December 2018.