నియాండర్తల్ విలుప్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Neanderthal extinction
నియాండర్తళ్ళ వ్యాప్తి, శిలాజ స్థలాలు.
నియాండర్తళ్ళ స్థానాన్ని తొలినాళ్ళ అధునిక మానవులు ఆక్రమించుకోవడం

40,000 సంవత్సరాల క్రితం, శరీర నిర్మాణపరంగా ఆధునికులైన మానవులు ఐరోపా ఖండానికి చేరుకున్న తరువాత, నియాండర్తల్‌లు అంతరించడం మొదలైంది. 2014 లో నేచర్‌లో ప్రచురితమైన పరిశోధనల ఆధారంగా రూపొందించిన ఈ తేదీ, గతం లోని అంచనాల కంటే చాలా ముందే ఉంది. మెరుగైన రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతుల ద్వారా స్పెయిన్ నుండి రష్యా వరకు ఉన్న 40 స్థలాలను విశ్లేషించాక దీన్ని నిర్ధారించారు. ఈ సర్వేలో ఆసియాలోని స్థలాలు లేవు. అక్కడ నియాండర్తల్లు మరింత కాలం జీవించి ఉండవచ్చు. [1] 37,000 సంవత్సరాల క్రితం ఐబీరియన్ ద్వీపకల్పంలో నియాండర్తల్ ఉనికిని కొనసాగిందనడానికి ఆధారాలు 2017 లో ప్రచురితమయ్యాయి. [2]

నియాండర్తల్‌లు అంతరించి పోవడానికి రకరకాల కారణాలను ఊహించారు. ఆధునిక మానవులు హింసతో నియాండర్తళ్ళ స్థానాన్ని ఆక్రమించడం, [3] పరాన్నజీవులు, వ్యాధికారకాలు, పోటీలో వెనకబడి లుప్తమై పోవడం, పోటీలో పక్కకు పోవడం, ఆధునిక మానవులతో సంకరం ద్వారా అంతరించిపోవడం, [4] ప్రకృతి వైపరీత్యాలు, శీతోష్ణస్థితుల్లో మార్పులకు తట్టుకోలేకపోవడం మొదలైన కారణాలను ఊహించారు. ఈ పరికల్పనలలో ఏ ఒక్కటో మాత్రమే నియాండర్తళ్ళు అంతరించి పోవడానికి కారణం అయి ఉండదు. ప్రపంచంలో విస్తృతంగా వ్యాపించి ఉన్న జనాభా పూర్తిగా అంతరించి పోవాలంటే ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండాలి.

అంతరించిపోయే ముందు సహ ఉనికి[మార్చు]

నియాండర్తల్ పనిముట్లు
ఆధునిక మానవుల పనిముట్లు

స్పెయిన్ నుండి రష్యా వరకు నలభై నియాండర్తల్ సైట్ల నుండి రేడియోకార్బన్ తేదీల విశ్లేషణలో, నియాండర్తళ్ళు ఐరోపాలో 41,000 - 39,000 సంవత్సరాల క్రితాల మధ్య అదృశ్యమయ్యారని కనుగొన్నట్లు, 2014 లో నేచర్లో ప్రచురించిన వ్యాసంలో పరిశోధకులు ప్రకటించారు. దీనికి 95% సంభావ్యత ఉంది. ఆధునిక మానవులు, నియాండర్తళ్ళు ఐరోపాలో 2,600 నుండి 5,400 సంవత్సరాల పాటు సహ ఉనికిలో ఉన్నారని అదే అధ్యయనం కనుగొంది. [1] ఆధునిక మానవులు 45,000 - 43,000 సంవత్సరాల క్రితాల మధ్య ఐరోపాకు చేరుకున్నారు. 2015 లో ప్రచురితమైన మెరుగైన రేడియోకార్బన్ డేటింగు ప్రకారం నియాండర్తళ్ళు 40,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయారు. ఇది, నియాండర్తల్‌లు 24,000 సంవత్సరాల క్రితం వరకూ జీవించి ఉండవచ్చని చెప్పిన పాత కార్బన్ డేటింగ్‌ను పూర్వపక్షం చేసింది. [5] జిల్హో తది. (2017) ఈ తేదీని సుమారు 3,000 సంవత్సరాలు ముందుకు, అంటే 37,000 సంవత్సరాల క్రితానికి, జరపాలని వాదించారు. [2] నియాండర్తల్, ఆధునిక మానవ అవశేషాల మధ్య అంతర్-స్తరీకరణ జరిగి ఉంటుందని సూచించారు గానీ, [6] అది వివాదాస్పదంగా ఉంది. [7] ధ్రువీయ ఉరల్ పర్వతాల్లో నియాండర్తళ్ళకు చెంది ఉంటాయని ప్రతిపాదించిన రాతి పనిముట్లను కనుగొన్నారు. ఇవి 31,000 - 34,000 సంవత్సరాల క్రితం నాటివని డేటింగులో తేలింది. [1]

విలుప్తికి సంభావ్యమైన కారణాలు[మార్చు]

హింస[మార్చు]

హోమో సేపియన్లతో హింసాత్మక సంఘర్షణ వల్ల నియాండర్తళ్ళు అంతరించి ఉండవచ్చు అనే సంభావ్యతను కొంతమంది రచయితలు చర్చించారు..తొలినాటి, వేట-సేకరణ సమాజాల్లో హింస సాధారణంగా, ప్రకృతి వైపరీత్యాల తరువాత వనరుల కోసం పోటీ ఏర్పడినపుడు తలెత్తేది. అందువల్ల హింసతో పాటు, ఆదిమ కాలపు యుద్ధం కూడా ఈ రెండు మానవ జాతుల మధ్య జరిగి ఉండవచ్చని చెప్పవచ్చు. [8] తొలి ఆధునిక మానవులు నియాండర్తల్స్‌ స్థానాన్ని హింసాత్మకంగా ఆక్రమించుకున్నారనే పరికల్పనను 1912 లో ఫ్రెంచ్ పాలియోంటాలజిస్ట్ మార్సెలిన్ బౌల్ (నియాండర్తల్‌పై విశ్లేషణను ప్రచురించిన మొదటి వ్యక్తి) ప్రతిపాదించాడు. [9]

పరాన్నజీవులు, వ్యాధికారకాలు[మార్చు]

హోమో సేపియన్స్ తీసుకొచ్చిన వ్యాధికారక లేదా పరాన్నజీవుల నియాండర్తల్ జనాభాలో వ్యాప్తి చెందడం మరొక కారణం కావచ్చ్చు.[10] [11] నియాండర్తళ్ళు తమ శరీరాలకు కొత్తయైన వ్యాధులకు రోగనిరోధక శక్తి పరిమితంగానే ఉండి ఉంటుంది. కాబట్టి హోమో సేపియన్లు యూరప్‌లోకి తీసుకువెళ్ళిన వ్యాధులకు హోమో సేపియన్లు కొంత నిరోధకతను కలిగి ఉండగా, నియాండర్తళ్ళకు ఆ మాత్రపు నిరోధకత లేకపోవడం వారికి ప్రాణాంతకమై ఉండవచ్చు. ఈ రెండు సారూప్య జాతులు బహుశా ఒకరికొకరు సమీపంలోనే నివసించినందున, వీరి మధ్య వ్యాధికారకాలు వ్యాపించడం చాలా సులభం. మరోవైపు, అదే యంత్రాంగం రివర్స్‌లో పనిచేసి నియాండర్తల్ వ్యాధికారక పరాన్నజీవులకు హోమో సేపియన్లు గురి కావాల్సి ఉంటుంది. అయితే ఆఫ్రికా నుండి యురేషియా భూభాగంలోకి, నూతన వ్యాధికారక క్రిముల చలనం ఒకే దిశలో ఉండేదని అనుకోవటానికి మంచి కారణం ఉంది. నూతన వ్యాధికారక (నేటి హెచ్‌ఐవి 1 వంటివి) క్రిములకు అత్యంత సాధారణ మూలం మనకు దగ్గరి బంధువులైన ఇతర ప్రైమేట్‌లు. వీటిలో అధిక భాగం ఆఫ్రికాలోనే ఉన్నాయి. బార్బరీ మకాక్ వంటి ఒకే జాతి ఐరోపాలో ఉంది. దక్షిణాసియా లోనూ కొన్ని జాతులే ఉన్నాయి. దీనివలన, ఆఫ్రికా లోని మానవులు ఈ నూతన వ్యాధికారక జీవులకు ఎక్కువగా గురయ్యేవారు. దాంతో వారిలో రోగనిరోధకత అభివృద్ధి అయ్యేది. వీరు ఆఫ్రికా నుండి యూరేషియాకు వలస వెళ్ళినపుడు ఈ క్రిములను తీసుకెళ్ళేవారు. వీరిని ఎదుర్కొన్నప్పుడల్లా రోగనిరోధకత లేని స్థానిక ప్రజలు బలయ్యేవారు. దీంతో, యురేషియా వంటి విస్తారమైన భూభాగంలో హోమినిన్లు విస్తరించి ఉన్నప్పటికీ, ఆఫ్రికా మానవులను తయారు చేసే మూస లాగా ఉండేది. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయ విప్లవం మొదలయ్యే వరకూ ఈ "ఆఫ్రికన్ ప్రయోజనం" కొనసాగింది. వ్యవసాయ విప్లవం కారణంగా నూతన వ్యాధి కారక క్రిముల వనరుగా పెంపుడు జంతువులు మారాయి. దీంతో "ఆఫ్రికన్ ప్రయోజనం" కాస్తా "యురేషియా ప్రయోజనం" గా మారింది. చరిత్ర తొలినాళ్ళలో స్థానిక అమెరికన్ జనాభాపై యురేషియా నుండి మానవుల వెంట వెళ్ళిన వ్యాధికారక జీవులు చూపించిన వినాశకరమైన ప్రభావం 40,000 సంవత్సరాల క్రితం యురేషియాలో హోమినిన్ల యొక్క పూర్వ జనాభాపై ఆధునిక మానవులు చూపించిన ప్రభావం గురించి కొంత అవగాహన కలిగిస్తుంది.

పోటీలో వెనకబడి లుప్తమై పోవడం[మార్చు]

సేపియన్స్, నియాండర్తల్ పుర్రెలు

ఆధునిక మానవులకు, నియాండర్తళ్ళకూ ఉన్న పోటీలో మానవులు కొద్దిపాటి ముందంజలో ఉన్నా, వేల సంవత్సరాల కాలావధిలో ఈ ముందంజయే నియాండర్తళ్ళ క్షీణతకు కారణమై ఉండవచ్చు. [12]

నియాండర్తళ్ళ శిలాజాల స్థలాలు సాధారణంగా చిన్నవిగాను, దూరదూరంగానూ ఉంటాయి. దీన్ని బట్టి, వీరు తమ సమకాలీన హోమో సేపియన్ల కంటే తక్కువ సంఖ్యలోను, విడివిడిగా ఉన్న సమూహాలు గానూ నివసించారని తెలుస్తోంది. మౌస్టేరియన్ ఫ్లింట్ స్టోన్ పెచ్చులు, లెవల్లోయిస్ ములుకులూ వంటి పనిముట్లు చాలా అధునాతనంగా ఉన్నప్పటికీ, సాంకేతికంగా నియాండర్తళ్ళు వాటిని పెద్దగా మెరుగుపరచినదేమీ లేదు. హస్తకృతులు వాడుక కోసం ఉద్దేశించినవి. 40,000 - 35,000 సంవత్సరాల క్రితం ఐరోపాలోకి ఆధునిక మానవులు రాకముందు నియాండర్తళ్ళ ప్రవర్తనను సూచించే లక్షణాలేమీ దొరకలేదు. [13]

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు తక్కువ అభివృద్ధి చెందిన వ్యక్తులతో ఘర్షణ పడినప్పుడల్లా ఏం జరుగుతుందో అదే విధంగా ఆధునిక మానవులు నియాండర్తళ్ళను తప్పించి వారి స్థానాన్ని ఆక్రమించారని జారెడ్ డైమండ్ తన ది థర్డ్ చింపాంజీ పుస్తకంలో పేర్కొన్నాడు. పోటీలో వెనకబడి తొలగిపోయే సిద్ధాంతానికి అతడు సమర్ధకుడు. [14]

శ్రమ విభజన[మార్చు]

2006 లో, అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు మానవ శాస్త్రవేత్తలు నియాండర్తల్ మరణానికి సమర్థత వివరణను ప్రతిపాదించారు. [15] "అమ్మ ఏం చెయ్యాలి? యురేషియాలో నియాండర్తళ్ళలోను, ఆధునిక మానవులలోనూ శ్రమ విభజన" అనే శీర్షికతో రాసిన ఒక వ్యాసంలో, [16] స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన నియాండర్తళ్లలో మధ్య పాతరాతియుగం నాటి హోమో సేపియన్లలో కంటే తక్కువ అభివృద్ధి చెందిందని వారు పేర్కొన్నారు. బైసన్, జింక, గాజెల్, అడవి గుర్రాల వంటి పెద్ద జంతువులను వేటాడ్డంలో (అదే వారి ఏకైక వృత్తి) మగ, ఆడ నియాండర్తల్ ఇద్దరూ పాల్గొనేవారు. నియాండర్తళ్ళలో శ్రమ విభజన లేకపోవడం వలన హోమో సేపియన్లతో పోలిస్తే సహజ వనరులను వాడుకోవడంలో వారిలో సమర్ధత లోపించిందని ఈ పరికల్పనలో చెప్పారు.

శరీర నిర్మాణ సంబంధమైన తేడాలు, పరుగు సామర్థ్యం[మార్చు]

విస్కాన్సిన్ విశ్వవిద్యాలయానికి చెందిన కరేన్ ఎల్. స్టీడెల్ వంటి పరిశోధకులు నియాండర్తల్ శరీరనిర్మాణానికి (ఆధునిక మానవుల కన్నా పొట్టిగాను, లావుగానూ ఉండేవారు), పెరుగెత్తగల సామర్థ్యం, శక్తి అవసరాలకూ (30% ఎక్కువ) ఉన్న సంబంధాన్ని ఎత్తి చూపారు. [17]

నియాండర్తళ్ళ కాళ్ళ ఆకృతి, ముఖ్యంగా బలమైన మోకాలు, పొడవాటి మడమలు, పొట్టి ముంగాళ్ళు వగైరాల కారణంగా వారి నడకకు వినియోగించే శక్తి తక్కువగా ఉండేదని ప్రేగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మార్టిన్ హోరా, వ్లాదిమిర్ స్లాడెక్‌లు తమ ఇటీవలి పరిశోధనల్లో తేల్చారు. నియాండర్తల్ మగవారి నడక ఖర్చు శరీర నిర్మాణపరంగా ఆధునిక మగవారి కంటే 8–12% అధికంగా ఉండేదని, నియాండర్తల్ ఆడవారి నడక ఖర్చు శరీర నిర్మాణపరంగా ఆధునిక ఆడవారితో సమానంగా ఉండేదనీ తేల్చారు. [18]

ఆధునిక మానవ కటి వలయాలతో పోల్చితే నియాండర్తల్ కటి వలయాలు షాక్‌లను తీసుకోవడంలోను, ఒక అడుగు నుండి తరువాతి అడుగుకు కదలడం లోనూ చాలా కష్టతరంగా ఉండేదని శిలాజ రికార్డుల ద్వారా తెలుస్తోందని ఇజ్రాయెల్‌లోని టెల్-అవీవ్ విశ్వవిద్యాలయానికి చెందిన యోయెల్ ర్యాక్ వంటి ఇతర పరిశోధకులు చెప్పారు. దీంతో పరుగు, నడక సామర్థ్యాల్లో నియాండర్తల్ కంటే ఆధునిక మానవులకు ప్రయోజనం వచ్చింది. అయితే, పురాతన మానవులందరికీ విస్తృత కటి వలయాలు ఉన్నాయని ర్యాక్ పేర్కొన్నాడు. పూర్వీకులలో శరీరనిర్మాణ శాస్త్రం ఇలాగే ఉండేదని, ఆధునిక మానవులు ప్లీస్టోసీన్ చివరిలో సన్నపాటి కటి వలయాల వైపు పరిణామం చెందారనీ ఇది సూచిస్తుంది. [19]

వెచ్చని వాతావరణ జంతువులను వేటాడటంలో ఆధునిక మానవులకున్న లాభాలు[మార్చు]

కుక్కల పెంపకం ఆధునిక మానవులకు వేటాడేటప్పుడు ఒక ప్రయోజనాన్ని చేకూర్చిందని అమెరికా లోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పాట్ షిప్మాన్ వాదించాడు. [20] పెంపుడు కుక్కల అత్యంత పురాతన అవశేషాలు బెల్జియంలో (31,700 సంవత్సరాల క్రితం), సైబీరియాలోనూ (33,000 సంవత్సరాల క్రితం) కనుగొన్నారు. [21] [22] స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ అంతటా ఆధునిక మానవులు, నియాండర్తళ్ళ తొలి స్థలాల్లోని జంతువుల శిలాజాల సర్వేలో వారి ఆహారం గురించి ఒక అవగాహన కలిగింది. [23] కుందేలు చాలా తరచుగా కనబడింది. పెద్ద క్షీరదాలు - వీటిని ప్రధానంగా నియాండర్తళ్ళు తినేవారు - క్రమేణా అరుదై పోతూ వచ్చాయి. 2013 లో, రజ్బోయినిచ్యా గుహలో (అల్టాయ్ పర్వతాలు) లభించిన పాతరాతియుగపు కుక్క అవశేషమైన "అల్టాయ్ డాగ్" పై జరిపిన డిఎన్ఎ పరీక్షలో అది 33,000 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. [24]

పరస్పర సంకరం[మార్చు]

హ్యూమన్-నియాండర్టల్ mtDNA
నియాండర్తల్ DNA వెలికితీత

జాతి సంకరం నియాండర్తల్ జనాభా తగ్గుదలకు కొంతవరకే కారణ మవుతుంది. జాతి యావత్తూ వేరే జాతిలో లీనమై పోవడం అనే ఆలోచన వాస్తవికంగా లేదు. ఇది ఇటీవలి ఆఫ్రికన్ మూలం సిద్ధాంతానికి కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే యూరోపియన్ల జన్యువులో కొంత భాగమైనా నియాండర్తళ్ళ - వీరి పూర్వీకులు కనీసం 3,50,000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాను విడిచిపెట్టారు - అంశకు చెందినదై ఉండాల్సి ఉంటుంది.

వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎరిక్ ట్రింకాస్ సంకర పరికల్పనను గట్టిగా సమర్ధించాడు. [25] పోర్చుగల్‌లోని లాగర్ వెల్హో వద్ద దొరికిన అస్థిపంజరం "లాగర్ వెల్హో బిడ్డ" తో సహా వివిధ శిలాజాలు సంకర జాతి వ్యక్తులవే అని ట్రింకాస్ పేర్కొన్నాడు. ట్రింకాస్ సహ రచయితగా ఉన్న 2006 నాటి ప్రచురణలో, 1952 లో రొమేనియాలోని పీస్టెరా ముయిరిలోర్ గుహలో లభించిన శిలాజాలు కూడా సంకరజాతివిగా పేర్కొన్నారు. [26]

ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి బయటపడ్డ తరువాత వారికీ, పురాతన మానవులకూ మధ్య సంకరం జరిగిందని జన్యు అధ్యయనాలు సూచిస్తున్నాయి. యూరోపియన్లు, ఆసియన్ల (ఉదా ఫ్రెంచ్, చైనీస్, పాపువా ప్రోబ్యాండ్‌లు) DNA లో 1-4% వరకూ ఆధునికం కావు. ఉప-సహారా ఆఫ్రికన్లతో (ఉదా. యోరుబా, శాన్ ప్రోబ్యాండ్స్) కాకుండా, పురాతన నియాండర్తల్ DNA తో ఇది కలుస్తోంది [27]

పోర్చుగల్‌లోని అబ్రిగో దో లాగర్ వెల్హోలో కనుగొన్న ఆధునిక మానవ శిలాజాల్లో నియాండర్తల్ అంశ ఉన్నట్లు ప్రచురణలు వెలువడ్డాయి. [28] అయితే, ఇది వివాదాస్పదమైంది. [29]

జాతి సంకరం జరక్కపోతే, తూర్పు యూరోపియన్ క్రో-మాన్యాన్‌కు చెందిన కొన్ని "ఆధునిక" పుర్రెలకు ఉన్న కొన్ని లక్షణాలను వివరించడం చాలా కష్టం అని నియాండర్తల్ అనే రచనలో జోర్డాన్ రాసాడు. రొమేనియాలో లభించిన 37,000-42,000 సంవత్సరాల క్రితం నాటి ఐరోపా మానవుల అవశేషాలపై చేసిన అధ్యయనంలో [30] ఆఫ్రికా పూర్వీకుల్లో లేని శరీర నిర్మాణ లక్షణాలు నియాండర్తళ్ళలో ఉండేవి వీటిలో గమనించారు. పుర్రె వెనుక భాగంలో పెద్ద ఉబ్బు, మోచేయి కీలు చుట్టూ ఉండే ఉబ్బు, భుజం కీలు వద్ద సన్నపాటి సాకెట్టు వీటిలో ఉన్నాయి.

నియాండర్తల్ జీనోమ్ ప్రాజెక్టు 2010, 2014 లలో పత్రాలను ప్రచురించింది. ఆధునిక మానవుల డిఎన్ఎలో నియాండర్తళ్ళ అంశ ఉందని ఈ పత్రాల్లో రాసారు. 50,000 - 60,000 సంవత్సరాల క్రితం ఈ సంకరం జరిగి ఉండవచ్చని రాసారు. [31] [32] [33] ప్రస్తుత ఆఫ్రికాయేతరుల "ఆఫ్రికా నుండి బయటికి వలసల" కంటే చాలా ముందే, 100,000 సంవత్సరాల క్రితం నాటికే, నియాండర్తల్ లు ఆధునిక మానవుల పూర్వీకులతో సంభోగం చేయడం ప్రారంభించినట్లు ఇటీవలి అధ్యయనాల్లో తెలుస్తోంది. ఆధునిక మానవులు, నియాండర్తల్‌ల మధ్య సంతానోత్పత్తిలో మూడు విభిన్న ఎపిసోడ్‌లు ఉన్నాయని 2016 లో చేసిన పరిశోధన సూచించింది: మొదటి ఘటనలో ఆధునిక ఆఫ్రికేతరుల పూర్వీకులు పాల్గొన్నారు, బహుశా ఆఫ్రికాను విడిచిపెట్టిన వెంటనే; రెండవది, పూర్వీకుల మెలనేసియన్ సమూహం విడిపోయిన తరువాత (తరువాత డెనిసోవాన్లతో సంతానోత్పత్తి చేసారు); మూడవది, తూర్పు ఆసియన్ల పూర్వీకులు పాల్గొన్నది. [34]

నియాండర్తల్ DNA పోలిక (SharedDNA)
నియాండర్తల్ DNA పోలిక (SharedDNA)

శీతోష్ణస్థితి మార్పు[మార్చు]

స్నోబౌండ్, మంచు తుఫానులో నియాండర్తల్స్. చార్లెస్ ఆర్. నైట్ పెయింటింగ్, 1911

పశ్చిమ ఐరోపాలో నియాండర్తళ్ళు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. పశ్చిమ ఐరోపాలో తీవ్రమైన శీతం ఏర్పడేందుకు కారణమైన శీతోష్ణస్థితి మార్పులు జరిగిన సమయంలో ఇది జరిగింది. "పశ్చిమ ఐరోపాలో నియాండర్తల్‌లు దాదాపు అంతరించిపోయారు. కాని ఆధునిక మానవులతో సంబంధాలు పెట్టుకోవడాని కంటే చాలా ముందే తిరిగి కోలుకున్నారు. ఈ సంగతి మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది" అని స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో అసోసియేట్ ప్రొఫెసర్ లవ్ డాలన్ అన్నాడు. అలా అయితే, శీతోష్ణస్థితి లోని మార్పులకు నియాండర్తల్‌లు చాలా ప్రభావితమై ఉండవచ్చునని ఇది సూచిస్తుంది. [35]

ప్రకృతి విపత్తు[మార్చు]

ఇటలీ లోని నేపుల్స్‌కు సమీపంలో 39,280 ± 110 సంవత్సరాల క్రితం ఒక అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి, 200 ఘన కిలోమీటర్ల శిలాద్రవం (మాగ్మా) ప్రవహించి, నియాండర్తల్‌ల విలుప్తికి దోహదపడిందని కొందరు పరిశోధకులు వాదించారు. [36] ఈ వాదనను గోలోవనోవా తదితరులు అభివృద్ధి చేశారు. [37] [38] ఐరోపాలో 2,50,000 సంవత్సరాలలో, నియాండర్తల్ అనేక ఇంటర్‌ గ్లేసియల్ కాలాలను ఎదుర్కొన్నప్పటికీ, [39] వారు తమ వేట పద్ధతులను శీతోష్ణస్థితి పరిస్థితుల కనుగుణంగా మార్చుకోక పోవటం వారు అంతరించిపోవడానికి కారణమైంది.[40] మెజ్మైస్కాయ గుహ వద్ద అవక్షేప పొరల అధ్యయనాల్లో మొక్కల పుప్పొడి బాగా తగ్గిందని తేలింది. మొక్కలు తగ్గిపోవడంతో, ఆ మొక్కలను తినే క్షీరదాలు తగ్గాయి, ఆ క్షీరదాలను వేటాడి తినే నియాండర్తళ్ళకు ఆహార సరఫరా తగ్గింది. [41] [42]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Higham, Tom; et al. (21 August 2014). "The timing and spatiotemporal patterning of Neanderthal disappearance". Nature. 512 (7514): 306–309. Bibcode:2014Natur.512..306H. doi:10.1038/nature13621. PMID 25143113.
  2. 2.0 2.1 João Zilhão et al., "Precise dating of the Middle-to-Upper Paleolithic transition in Murcia (Spain) supports late Neandertal persistence in Iberia", Heliyon 3(11), 16 November 2017, doi:10.1016/j.heliyon.2017.e00435.
  3. Hortolà P, Martínez-Navarro B (2013). "The Quaternary megafaunal extinction and the fate of Neanderthals: An integrative working hypothesis". Quaternary International. 295: 69–72. Bibcode:2013QuInt.295...69H. doi:10.1016/j.quaint.2012.02.037.
  4. Interbreeding took place in western Asia between about 65,000 and 47,000 years ago, see Kuhlwilm, M.; Gronau, I.; Hubisz, M.J.; de Filippo, C.; Prado-Martinez, J.; Kircher, M.; et al. (2016). "Ancient gene flow from early modern humans into Eastern Neanderthals". Nature. 530 (7591): 429–433. Bibcode:2016Natur.530..429K. doi:10.1038/nature16544. PMC 4933530. PMID 26886800.
  5. Rincon, Paul (13 September 2006). "Neanderthals' 'last rock refuge'". BBC News. Retrieved 11 October 2009. Finlayson C, Pacheco FG, Rodríguez-Vidal J, et al. (October 2006). "Late survival of Neanderthals at the southernmost extreme of Europe". Nature. 443 (7113): 850–853. Bibcode:2006Natur.443..850F. doi:10.1038/nature05195. PMID 16971951.
  6. Gravina B, Mellars P, Ramsey CB (November 2005). "Radiocarbon dating of interstratified Neanderthal and early modern human occupations at the Chatelperronian type-site". Nature. 438 (7064): 51–56. Bibcode:2005Natur.438...51G. doi:10.1038/nature04006. PMID 16136079.
  7. Zilhão, João; Francesco d’Errico; Jean-Guillaume Bordes; Arnaud Lenoble; Jean-Pierre Texier; Jean-Philippe Rigaud (2006). "Analysis of Aurignacian interstratification at the Châtelperronian-type site and implications for the behavioral modernity of Neandertals". PNAS. 103 (33): 12643–12648. Bibcode:2006PNAS..10312643Z. doi:10.1073/pnas.0605128103. PMC 1567932. PMID 16894152.
  8. Ko, Kwang Hyun (2016). "Hominin interbreeding and the evolution of human variation". Journal of Biological Research-Thessaloniki. 23: 17. doi:10.1186/s40709-016-0054-7. PMC 4947341. PMID 27429943.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  9. Boule, M 1920, Les hommes fossiles, Masson, Paris.
  10. Underdown, Simon (10 April 2015). "Brookes research finds modern humans gave fatal diseases to Neanderthals". Oxford Brookes University news. Archived from the original on 27 ఫిబ్రవరి 2021. Retrieved 3 March 2016.
  11. Greenbaum, Gili; Getz, Wayne M.; Rosenberg, Noah A.; Feldman, Marcus W.; Hovers, Erella; Kolodny, Oren (2019-11-01). "Disease transmission and introgression can explain the long-lasting contact zone of modern humans and Neanderthals". Nature Communications (in ఇంగ్లీష్). 10 (1): 5003. doi:10.1038/s41467-019-12862-7. ISSN 2041-1723. PMC 6825168. PMID 31676766.
  12. Banks, William E.; d'Errico, Francesco; Peterson, A. Townsend; Kageyama, Masa; Sima, Adriana; Sánchez-Goñi, Maria-Fernanda (24 December 2008). Harpending, Henry (ed.). "Neanderthal Extinction by Competitive Exclusion". PLoS ONE. 3 (12): e3972. Bibcode:2008PLoSO...3.3972B. doi:10.1371/journal.pone.0003972. ISSN 1932-6203. PMC 2600607. PMID 19107186.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  13. Peresani, M; Dallatorre, S; Astuti, P; Dal Colle, M; Ziggiotti, S; Peretto, C (2014). "Symbolic or utilitarian? Juggling interpretations of Neanderthal behavior: new inferences from the study of engraved stone surfaces". J Anthropol Sci. 92 (92): 233–55. doi:10.4436/JASS.92007. PMID 25020018.
  14. Diamond, J. (1992). The Third Chimpanzee: The Evolution and Future of the Human Animal. New York: Harper Collins, p. 45.
  15. Nicholas Wade, "Neanderthal Women Joined Men in the Hunt", from The New York Times, 5 December 2006
  16. Kuhn, Steven L.; Stiner, Mary C. (2006). "What's a Mother to Do? The Division of Labor among Neandertals and Modern Humans in Eurasia". Current Anthropology. 47 (6): 953–981. doi:10.1086/507197.
  17. Steudel, Karen L. (2009). "Karen L. Steudel". Department of Zoology – University of Wisconsin. Archived from the original on 2017-04-20. Retrieved December 24, 2011.
  18. Hora, M; Sládek, V (2014). "Influence of lower limb configuration on walking cost in Late Pleistocene humans". Journal of Human Evolution. 67: 19–32. doi:10.1016/j.jhevol.2013.09.011. PMID 24485350.
  19. Lewin, Roger (27 April 1991). "Science: Neanderthals puzzle the anthropologists". New Scientist. Retrieved January 1, 2011.
  20. Shipman, P (2012). "Dog domestication may have helped humans thrive while Neandertals declined". American Scientist. 100 (3): 198. doi:10.1511/2012.96.198.
  21. Ovodov, ND; Crockford, SJ; Kuzmin, YV; Higham, TFG; Hodgins, GWL; et al. (2011). "A 33,000-Year-Old Incipient Dog from the Altai Mountains of Siberia: Evidence of the Earliest Domestication Disrupted by the Last Glacial Maximum". PLoS ONE. 6 (7): e22821. Bibcode:2011PLoSO...622821O. doi:10.1371/journal.pone.0022821. PMC 3145761. PMID 21829526.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  22. Germonpré, M.; Sablin, M.V.; Stevens, R.E.; Hedges, R.E.M.; Hofreiter, M.; Stiller, M.; Jaenicke-Desprese, V. (2009). "Fossil dogs and wolves from Palaeolithic sites in Belgium, the Ukraine and Russia: osteometry, ancient DNA and stable isotopes". Journal of Archaeological Science. 36 (2): 473–490. doi:10.1016/j.jas.2008.09.033.
  23. Fa, John E.; Stewart, John R.; Lloveras, Lluís; Vargas, J. Mario (2013). "Rabbits and hominin survival in Iberia". Journal of Human Evolution. 64 (4): 233–241. doi:10.1016/j.jhevol.2013.01.002. PMID 23422239.
  24. Druzhkova, AS; Thalmann, O; Trifonov, VA; Leonard, JA; Vorobieva, NV; et al. (2013). "Ancient DNA Analysis Affirms the Canid from Altai as a Primitive Dog". PLoS ONE. 8 (3): e57754. Bibcode:2013PLoSO...857754D. doi:10.1371/journal.pone.0057754. PMC 3590291. PMID 23483925.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  25. Jones, Dan (2007). "The Neanderthal within". New Scientist. 193 (2593): 28–32. doi:10.1016/s0262-4079(07)60550-8.
  26. Soficaru A, Dobos A, Trinkaus E (November 2006). "Early modern humans from the Pestera Muierii, Baia de Fier, Romania". Proc. Natl. Acad. Sci. U.S.A. 103 (46): 17196–17201. Bibcode:2006PNAS..10317196S. doi:10.1073/pnas.0608443103. PMC 1859909. PMID 17085588.
  27. Green RE, Krause J, Briggs AW, et al. (May 2010). "A draft sequence of the Neandertal genome". Science. 328 (5979): 710–722. Bibcode:2010Sci...328..710G. doi:10.1126/science.1188021. PMC 5100745. PMID 20448178.
  28. Duarte C, Maurício J, Pettitt PB, Souto P, Trinkaus E, van der Plicht H, Zilhão J (June 1999). "The early Upper Paleolithic human skeleton from the Abrigo do Lagar Velho (Portugal) and modern-human emergence in Iberia". Proceedings of the National Academy of Sciences. 96 (13): 7604–7609. Bibcode:1999PNAS...96.7604D. doi:10.1073/pnas.96.13.7604. PMC 22133. PMID 10377462.
  29. Ruzicka J, Hansen EH, Ghose AK, Mottola HA (February 1979). "Enzymatic determination of urea in serum based on pH measurement with the flow injection method". Analytical Chemistry. 51 (2): 199–203. doi:10.1021/ac50038a011. PMID 33580.
  30. Fu, Qiaomei; Hajdinjak, Mateja; Moldovan, Oana Teodora; Constantin, Silviu; Mallick, Swapan; Skoglund, Pontus; Patterson, Nick; Rohland, Nadin; Lazaridis, Iosif (2015). "An early modern human from Romania with a recent Neanderthal ancestor". Nature. 524 (7564): 216–219. Bibcode:2015Natur.524..216F. doi:10.1038/nature14558. PMC 4537386. PMID 26098372.
  31. Sánchez-Quinto, F; Botigué, LR; Civit, S; Arenas, C; Avila-Arcos, MC; Bustamante, CD; Comas, D; Lalueza-Fox, C (October 17, 2012). "North African Populations Carry the Signature of Admixture with Neandertals". PLoS ONE. 7 (10): e47765. Bibcode:2012PLoSO...747765S. doi:10.1371/journal.pone.0047765. PMC 3474783. PMID 23082212.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  32. Fu, Q; Li, H; Moorjani, P; Jay, F; Slepchenko, S. M.; Bondarev, A. A.; Johnson, P. L.; Aximu-Petri, A; Prüfer, K (23 October 2014). "Genome sequence of a 45,000-year-old modern human from western Siberia". Nature. 514 (7523): 445–449. Bibcode:2014Natur.514..445F. doi:10.1038/nature13810. PMC 4753769. PMID 25341783.
  33. Brahic, Catherine. "Humanity's forgotten return to Africa revealed in DNA", The New Scientist (February 3, 2014).
  34. "The Combined Landscape of Denisovan and Neanderthal Ancestry in Present-Day Humans", Current Biology, Sankararaman et al., 26, 1241–1247, 2016
  35. "Neanderthals may have faced extinction long before modern humans emerged". Phys.org. 2014-02-24. Retrieved 2017-02-23.
  36. Fisher, Richard V.; Giovanni Orsi; Michael Ort; Grant Heiken (June 1993). "Mobility of a large-volume pyroclastic flow – emplacement of the Campanian ignimbrite, Italy". Journal of Volcanology and Geothermal Research. 56 (3): 205–220. Bibcode:1993JVGR...56..205F. doi:10.1016/0377-0273(93)90017-L. Retrieved 2008-09-20.
  37. Golovanova, Liubov Vitaliena; Doronichev, Vladimir Borisovich; Cleghorn, Naomi Elansia; Koulkova, Marianna Alekseevna; Sapelko, Tatiana Valentinovna; Shackley, M. Steven (2010). "Significance of Ecological Factors in the Middle to Upper Paleolithic Transition". Current Anthropology. 51 (5): 655. doi:10.1086/656185.
  38. Than, Ker (September 22, 2010). "Volcanoes Killed Off Neanderthals, Study Suggests". National Geographic. Retrieved 23 September 2010.
  39. Gilligan, I (2007). "Neanderthal extinction and modern human behaviour: the role of climate change and clothing". World Archaeology. 39 (4): 499–514. doi:10.1080/00438240701680492.
  40. Climate Change Killed Neandertals, Study Says, National Geographic News
  41. "Volcanoes wiped out Neanderthals, new study suggests (ScienceDaily)". University of Chicago Press Journals. 7 October 2010. Retrieved 7 October 2010.
  42. Neanderthal Apocalypse Archived 2017-11-20 at the Wayback Machine Documentary film, ZDF Enterprises, 2015. Retrieved 26 January 2016.