నేనూ మనిషినే
Jump to navigation
Jump to search
నేనూ మనిషినే (1971 తెలుగు సినిమా) | |
![]() నేనూ మనిషినే సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | జి.వి.ఆర్.శేషగిరిరావు |
తారాగణం | కృష్ణ, కాంచన |
సంగీతం | వేదా |
ఛాయాగ్రహణం | మణి |
నిర్మాణ సంస్థ | మోడరన్ థియేటర్స్ |
భాష | తెలుగు |
నేనూ మనిషినే మోడరన్ థియేటర్స్ నిర్మాణంలో కృష్ణ, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించిన 1971 నాటి తెలుగు చలన చిత్రం. 1969లో విడుదలైన దో భాయి అన్న హిందీ సినిమాని నేనూ మనిషినేగా తెలుగులో పునర్నిర్మించారు. విమర్శకులు దీన్ని నోయిర్ పద్ధతికి చెందిన సినిమాగా గుర్తిస్తున్నారు.
నిర్మాణం[మార్చు]
అభివృద్ధి[మార్చు]
1969లో అశోక్ కుమార్, జీతేంద్ర ప్రధాన పాత్రలుగా వచ్చిన "దో భాయి" అన్న హిందీ సినిమాని "నేనూ మనిషినే"గా తెలుగులో పునర్నిర్మించారు. ఇదే సినిమాను తమిళంలో "జస్టిస్ విశ్వనాథం"గా, కన్నడంలో "ప్రేమద కనికె"గా రీమేక్ చేశారు.[1]
నటీనటులు[మార్చు]
- ఘట్టమనేని కృష్ణ
- కాంచన - శారద
- గుమ్మడి వెంకటేశ్వరరావు - కృష్ణ అన్నయ్య
- కె.వి.చలం
- బేబీ శ్రీదేవి - లత, గుమ్మడి కూతురు
- కైకాల సత్యనారాయణ
- కె.వి.చలం
- సురేఖ
- జయకృష్ణ
- శకుంతల
- పొట్టి ప్రసాద్
- రామచంద్రరావు
- అర్జా జనార్ధనరావు
పాటలు[మార్చు]
- ఏది ఇలలోన అసలైన
- చిన్నారి వరహాల చిట్టిపొట్టి పాప
- చూసెనులే నా కనులే చూడని వింత
- పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చతెనుగు అందం రచన:సినారె
థీమ్స్ & జాన్రా[మార్చు]
విమర్శకుడు ఎం.సికందర్ నేనూ మనిషినే సినిమా కథాపరంగా నోయర్ జాన్రాకు చెందుతుందని వర్గీకరించారు. గుమ్మడి పాత్ర, శైలి, జడ్జిగా ఉండి హత్య చేయడం వంటి అంశాలు దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఎం, సికిందర్. "డార్క్ మూవీస్ లో ఏముండాలి?-6". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Archived from the original on 29 మే 2017. Retrieved 29 మే 2017.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help)