Jump to content

వేదా

వికీపీడియా నుండి

వేదా (ఎస్.ఎస్.వేదాచలం) భారతీయ సినీ సంగీత దర్శకుడు[1]. ఇతడు 1950వ దశకంలో సింహళ భాషా చిత్రాలకు సంగీత దర్శకుడుగా పనిచేశాడు. అప్పట్లో సింహళ భాషా చిత్రాలు మద్రాసులో నిర్మించబడేవి. తరువాత ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. 1952 నుండి పాతిక సంవత్సరాలకు పైగా ఇతడు క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతడు 1960వ దశకంలో సుమారు 25 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు ఎక్కువగా మోడరన్ థియేటర్స్ అనే చిత్రనిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలకు సంగీత దర్శకుడిగా ఉన్నాడు.

వృత్తి

[మార్చు]

ఇతడు మొదట టి.జి.లింగప్ప, సి.ఎన్.పాండురంగన్ మొదలైన సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 1956లో మర్మవీరన్ అనే సినిమాకు మొదటి సారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ చిత్రంలో రావు బాలసరస్వతీ దేవి పాడిన పాట బాగా హిట్ అయ్యింది. ఇతని సంగీత దర్శకత్వంలో టి. యం. సౌందరరాజన్, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎ.ఎం.రాజా, తిరుచ్చి లోకనాథ, కె.జె.ఏసుదాసు, టి.ఎ.మోతి, ఎస్.సి.కృష్ణన్, జె.పి.చంద్రబాబు, సిర్కాళి గోవిందరాజన్, వి.ఎన్.సుందరం, ఎ.ఎల్.రాఘవన్, ఎస్.వి.పొన్నుస్వామి, మొహినుద్దీన్ బేగ్, ఎడ్డీ జయమ్మ, కె.జమునారాణి, రాధ జయలక్ష్మి, పి.లీల, జిక్కి, కె. రాణి, ఎ.జి.రత్నమాల, బి.వసంత, ఎం.ఎస్.రాజేశ్వరి, రుక్మిణీదేవి, మనోరమ మొదలైన గాయకులు పాడారు. కణ్ణదాసన్, సుందర్ కన్నన్, ఎ.ఎల్.నారాయణన్, తంజై ఎన్.రామయ్య దాస్, విల్లిపుత్తన్, ఎ.మరుదకాశి, వల్లి, కరుణైదాసన్, నల్లతంబి, అలంగుడి సోము, పంజు అరుణాచలం మొదలైన గీతరచయితలు వ్రాసిన పాటలకు ఇతడు సంగీతం కూర్చాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ఇతడు సంగీతం సమకూర్చిన తెలుగు సినిమాలు కొన్ని:

  1. ఆమె ఎవరు? (1966)
  2. మొనగాళ్ళకు మొనగాడు (1966)
  3. అవే కళ్ళు (1967)
  4. ఎవరు మొనగాడు (1968)
  5. రాజ్యకాంక్ష (1969)
  6. నేనూ మనిషినే (1971)

మూలాలు

[మార్చు]
  1. గై, రాండర్ (3 జూలై 2016). "Yaar Nee? (1966) TAMIL". ది హిందూ. Archived from the original on 18 డిసెంబరు 2017. Retrieved 18 డిసెంబరు 2017.
  • Film News Anandan (23 October 2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [History of Landmark Tamil Films] (in Tamil). Chennai: Sivakami Publishers.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • G. Neelamegam. Thiraikalanjiyam — Part 1 (in Tamil). Manivasagar Publishers, Chennai 108 (Ph:044 25361039). First edition December 2014.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • G. Neelamegam. Thiraikalanjiyam — Part 2 (in Tamil). Manivasagar Publishers, Chennai 108 (Ph:044 25361039). First edition November 2016.{{cite book}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=వేదా&oldid=2867429" నుండి వెలికితీశారు