Jump to content

కె. రాణి

వికీపీడియా నుండి
కె. రాణి
కె. రాణి
జననంకె.ఉషారాణి.
04,సెప్టెంబర్1942
తుముకూరు, కర్ణాటక రాష్ట్రం
మరణంజూలై 14, 2018
హైదరాబాదు, తెలంగాణ
వృత్తిగాయని
ప్రసిద్ధిసోలో సింగర్
భార్య / భర్తగాలివీటి సీతారామరెడ్డి
తండ్రికిషన్
తల్లిలలిత

కె. రాణి(04,సెప్టెంబరు1942) తెలుగు సినిమారంగంలో తొలికాలం నాటి గాయని. ఈమె ఆకాలంలోని సుమారు అందరు గాయకులతో గొంతు కలిపి ఎన్నో మధురమైన పాటలు గానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్‌’ చిత్రంలోని ‘‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’’ పాటతో ఆమె ప్రసిద్ధిగాంచారు. తెలుగులో సుమారు 500పైగా పాటలు ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమెనే ఆలపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హల, ఉజ్బెక్‌ భాషల్లో పాటలు పాడారు. ‘రూపవతి’ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన రాణి.. ‘బాటసారి’, ‘జయసింహ’, ‘ధర్మదేవత’, ‘లవకుశ’ వంటి చిత్రాల్లో తన పాటలు ఆలపించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె అసలు పేరు కె.ఉషారాణి. ఈమె 04,సెప్టెంబర్1942లో కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి రైల్వేలో ఉద్యోగి. వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి కడపలో స్థిరపడ్డారు. ఈమెకు 1966లో గాలివీటి సీతారామరెడ్డితో వివాహం జరిగింది. ఈమె మామగారు బహద్దూర్ సుబ్బారెడ్డి జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. సీతారామరెడ్డికి హైదరాబాదులోని చార్మినార్ సమీపంలో సదరన్ మూవిటోన్ అనే స్టూడియో వుండేది. ఈ స్టూడియోలోనే ‘సతీ అరుంధతి’, ‘నిజం చెబితే నమ్మరు’ వంటి సినిమాలు నిర్మించారు. లవకుశ నిర్మాత శంకరరెడ్డి ‘రహస్యం’ సినిమాను సదరన్ మూవిటోన్ స్టూడియోలోనే నిర్మించడం విశేషం. వీరికి ఇద్దరు అమ్మాయిలు. "మెల్లిసై రాణి" అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో భాషల్లో కలిపి రాణి ఐదు వందలకు పైగా పాటలు పాడారు.[2]

మరణం

[మార్చు]

2018, జూలై 14న హైదరాబాదులోని తన కుమార్తె ఇంటిలో మరణించింది.[3]

సినిమా పాటలు

[మార్చు]

1951 లో రాణి తొలిసారి ‘రూపవతి’ అనే సినిమాలో “వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయ్, సయ్యనవోయ్ మనసార దరిచేరవోయ్” అనే కోరస్ పాటని సి. ఆర్. సుబ్బురామన్ సంగీత దర్శకత్వంలో పాడింది.

కె.రాణి పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
సి.ఆర్. సుబ్బరామన్కె.జి.శర్మ1951
1రూపవతివయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయిజిక్కి బృందంసి.ఆర్. సుబ్బరామన్కె.జి.శర్మ1951
3అత్తింటి కాపురంనాజీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవేసుసర్ల దక్షిణామూర్తి,
జి.రామనాథ అయ్యర్
తోలేటి1952
4ధర్మ దేవతఏ ఊరే చిన్నదానా తొలకరి మెరుపల్లె మెరసేవుకె. ప్రసాదరావుసి.ఆర్. సుబ్బరామన్సముద్రాల సీనియర్1952
5ధర్మ దేవతచిందువేయవోయి చిన్ని కృష్ణయ్య ఓ బాలబి.ఎన్.రావు,
జిక్కి
సి.ఆర్. సుబ్బరామన్సముద్రాల సీనియర్1952
6ధర్మ దేవతపాటకు పల్లవి కావాలోయి ఆటలు గజ్జలు కావాలోయిసి.ఆర్. సుబ్బరామన్కె.జి. శర్మ1952
7ధర్మ దేవతలంబాడి లంబాడి లంబాడి లంబ లంబ లంబసి.ఆర్. సుబ్బరామన్సముద్రాల సీనియర్1952
8పెళ్ళి చేసి చూడుఅమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే ఫస్టుక్లాసులోఉడుతా సరోజినిఘంటసాలపింగళి1952
9పెళ్ళి చేసి చూడుబ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా లోకమునేఎ.పి.కోమల,
ఉడుతా సరోజిని
ఘంటసాలఊటుకూరి1952
10సింగారిఆవో మహారాజ్..ఒక జాన్ కడుపే లేదంటే ఈ లోకాన లేదు గలాటాకె.హెచ్.రెడ్డిఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్,
టి.ఎ.కళ్యాణం
1952
11సింగారికొటారు మానిపైనే గూడు కట్టుకొక్కేరను కొట కొత్తళ౦కె.హెచ్.రెడ్డిఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్,
టి.ఎ.కళ్యాణం
1952
12దేవదాసుఅంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశానిరాశేనా మిగిలేదిసి.ఆర్. సుబ్బరామన్సముద్రాల సీనియర్1953
13దేవదాసుచెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనేఘంటసాలసి.ఆర్. సుబ్బరామన్సముద్రాల సీనియర్1953
14పుట్టిల్లుఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ ఆహా హా బ్యూటీపిఠాపురంమోహన్ దాస్,
చలపతి రావు
1953
15నిరుపేదలుసార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్టి.వి.రాజుఅనిసెట్టి1954
16మా గోపిమా వదిన మా వదిన నా పేరున ఒక జాబును వ్రాసిందిజిక్కి బృందంఎం.ఎస్.విశ్వనాథన్,
రామమూర్తి
అనిసెట్టి1954
17చిరంజీవులునాటిన అంటుకు ...ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కాకె.జమునారాణిఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
18బాల సన్యాసమ్మ కథఅత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజిపి.లీల,
మైధిలి
ఎస్.రాజేశ్వరరావుసముద్రాల జూనియర్1956
19బాల సన్యాసమ్మ కథకళకళలాడే సతికిపతికి కర్పూర హారతులుమైధిలి బృందంఎస్. రాజేశ్వరరావుసముద్రాల జూనియర్1956
20బాల సన్యాసమ్మ కథనిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడపిఠాపురంఎస్. రాజేశ్వరరావుసముద్రాల జూనియర్1956
21అల్లావుద్దీన్ అద్భుతదీపంసొగసరిదాననయ్య రంగేళి సింగారిఎస్.రాజేశ్వరరావు,
ఎస్.హనుమంతరావు
ఆరుద్ర1957
22తోడికోడళ్ళుఎంతెంత దూరం కోశెడు దూరం నీకు మాకు చాలా చాలా దూరంపి.సుశీల బృందంమాస్టర్ వేణుఆత్రేయ1957
23వద్దంటే పెళ్ళిరావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమారాజన్ - నాగేంద్రశ్రీరామ్‌చంద్1957
24స్వయంప్రభఒరె గున్నా ఏమో అనుకున్నాబల్ గడసరివన్నా ఓ సొగసరిరమేష్ నాయుడుఆరుద్ర1957
25కొండవీటి దొంగతమలపాకు సున్నము పడుచువాళ్లకందముపి.బి.శ్రీనివాస్ఎస్.ఎల్.మర్చెంట్,
ఎం.ఎస్.శ్రీరామ్
1958
26శోభవెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగాఎ.ఎం. రాజాఏ.ఎమ్.రాజాపి.వసంతకుమార రెడ్డి1958
27దైవబలంఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావుబృందంఅశ్వత్థామకొసరాజు1959
28మనోరమఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మాకొత్త పెళ్ళి కూతురులాపి.బి.శ్రీనివాస్రమేష్ నాయుడు1959
29సిపాయి కూతురుఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలోపిఠాపురంయం.ఎస్.రాజుకొనకళ్ల వెంకటరత్నం1959
30కన్నకూతురుఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాంఎ.పి.కోమల బృందంఎం.రంగారావునారపరాజు1960
31ఉషాపరిణయంఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకోపిఠాపురంఎస్.హనుమంతరావుసదాశివబ్రహ్మం1961
32ధాన్యమే ధనలక్ష్మిఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులుసరోజినిమారెళ్ళఅనిసెట్టి1961
33యోధాన యోధులుటిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టిఅశ్వద్ధామసుంకర1961
34ఏకైక వీరుడుఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చినఎల్.ఆర్. ఈశ్వరిఎస్.పి. కోదండపాణివీటూరి1962
35పతిగౌరవమే సతికానందంమురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీరాజుసాలూరి రాజేశ్వరరావుఅనిసెట్టి1962
36తల్లి బిడ్డఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించిబృందంబి.శంకరరావుఎ.వేణుగోపాల్1963
37సతీ అరుంధతిపోయిరావే తల్లి పోయి రావమ్మా ఆరని జ్యోతిబృందంఅశ్వద్ధామదాశరథి1968

మూలాలు

[మార్చు]
  1. "పాటల రాణి ఇక లేరు!".[permanent dead link]
  2. సారంగ, జ్ఞాపకాలు (15 July 2018). "అందమైన పాటలా ఆమె ప్రయాణం! –". magazine.saarangabooks.com. పురాణం విజయ దుర్గ. Retrieved 7 August 2020.
  3. సితార, పాటల పల్లకి. "పాటల తోటను వీడిన పాటల రాణి". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2 ఆగస్టు 2018. Retrieved 7 ఆగస్టు 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=కె._రాణి&oldid=4280030" నుండి వెలికితీశారు