నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ( ఎన్ఐఈఎల్ఐటీ )( National Institute of Electronics and Information Technology (NIELIT) అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఒక స్వయంప్రతిపత్తి సొసైటీ. దీనిని  ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐఇసిటి) రంగంలో మానవ వనరుల అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది.  ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  రంగంలో ఫార్మల్[1], నాన్ ఫార్మల్[2] ఎడ్యుకేషన్ తో పాటు పరిశ్రమ ఆధారిత నాణ్యమైన విద్య, అత్యాధునిక రంగాల్లో శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో సంస్థ ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది.  దేశంలోనే అగ్రగామి సంస్థగా కంప్యూటర్ప్ర విద్యలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు  కృషి చేస్తుంది.  నాన్ ఫార్మల్  రంగంలో  ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  కోర్సులను నిర్వహించడానికి  సంస్థలకు గుర్తింపు ఇచ్చే నేషనల్ ఎగ్జామినేషన్ బాడీలో ఒకటిగా ఉన్నది.[3]

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
దస్త్రం:NIELIT Logo.jpg
సంస్థ అవలోకనం
స్థాపనం 9 నవంబరు 1994
(29 సంవత్సరాల క్రితం)
 (1994-11-09)
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, డైరెక్టర్ జనరల్
Parent Agency ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

లక్ష్యం

[మార్చు]

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ( ఎన్ఐఈఎల్ఐటీ) స్థాపనలో ఈ లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది.[4]

 • ప్రపంచ స్థాయి విద్య, శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐఇసిటి, అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను సృష్టించడం , నైపుణ్యం కలిగిన నిపుణులను అభివృద్ధి చేయడం.
 • ప్రపంచములో నూతన మార్పులతో వసున్న ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగానికి  అనుగుణంగా సృజనాత్మక పాఠ్యాంశాల క్రియాశీల రూపకల్పన, అభివృద్ధి, కంటెంట్ సేకరణ ద్వారా అభ్యాసకులకు , శిక్షకులకు సహాయ పడటం.
 • విద్యార్థుల సామర్థ్యాన్ని నిష్పాక్షికంగా అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పరీక్ష, ధృవీకరణ  నాణ్యతా వ్యవస్థను స్థాపించడం.
 • సాంకేతిక విద్య (ఐటి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ) నాన్ ఫార్మల్ సెక్టార్ లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
 • పూర్వము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( డిఐటి () సంయుక్తంగా అభివృద్ధి చేసిన కంప్యూటర్ కోర్సుల కోసం డిఒఇఎసిసి పథకాన్ని అమలు చేయడం.
 • ఐఇసిటి ప్రాంతాలలో ప్రమాణాలను నెలకొల్పడం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మార్కెట్లను అభివృద్ధి చేయడం;
 • ఐ.ఇ.సి.టి రంగంలో అధిక ప్రాముఖ్యత దృష్ట్యా జ్ఞానం, నైపుణ్యాల పెంపునకు  నిరంతర విద్యను అందించడం
 • పరిశ్రమ ఆధారిత రూపకల్పన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి మార్కెట్  సంస్కృతిని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం;
 • ఏదైనా స్థిరాస్తులను కొనడం, లీజుకు ఇవ్వడం, అద్దెకు ఇవ్వడం, మార్పిడి చేయడం లేదా ఇతరత్రా అవసరం, సొసైటీ స్థాపించబడిన అన్ని లేదా ఏదైనా లక్ష్యాల కోసం బాండ్లు, డబ్బు, సెక్యూరిటీలు, అన్ని రకాల చరాస్తులు లేదా స్థిరాస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం, పారవేయడం, మార్పిడి చేయడం, పెట్టుబడి పెట్టడానికి నిస్పక్షతపాతంగా  వ్యవహరించడం, పనిచేయడం.  
 • సొసైటీ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేదా మరేదైనా వనరుల నుంచి గ్రాంట్లు/ రుణాలతో సహా డబ్బు వసూలు చేయడం, స్వీకరించడం, లక్ష్యాలను సాధించడం కొరకు యాదృచ్ఛికంగా/అనుబంధంగా ఉండే అటువంటి అన్ని కార్యకలాపాలను చేయడం.

కోర్సులు

[మార్చు]

ఎన్ఐఈఎల్ఐటీ కోర్సులు నిర్వహించే కేంద్రాల పేర్లు.[5] [6]

 • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఔరంగాబాద్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్
 • ఎంబెడెడ్ సిస్టమ్స్ కాలికట్ లో (మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ( ఎం .టెక్ )
 • ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ కాలికట్, ఔరంగాబాద్, గోరఖ్ పూర్ M.Tech
 • (మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ( ఎం .టెక్ ) ( వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లో)
 • బాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సిస్టమ్ ఇంజనీరింగ్ లో
 • మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్స్ ఐటీ శ్రీనగర్ అగర్తలా
 • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్ ( ఎం.సి.ఏ ) ఐజ్వాల్, శ్రీనగర్, కాలికట్, ఇంఫాల్
 • బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ( బి.సి.ఏ ) అగర్తలా, ఐజ్వాల్, గౌహతి, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, శ్రీనగర్
 • డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ (డీఈపీఎం) ,ఔరంగాబాద్
 • మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎమ్మెస్సీ-కంప్యూటర్) ఎస్సీ గువాహటి
 • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ( బి.ఎస్.సి ) ఐటీ శ్రీనగర్
 • డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అగర్తలా
 • డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అగర్తలా

శాఖలు

[మార్చు]
విద్యార్థులకు గౌరవ పట్టా అందిస్తున్న మంత్రి

ప్రస్తుతం ఎన్ఐఈఎల్ఐటీకి అగర్తలా, ఐజ్వాల్, అజ్మీర్, అలవల్పూర్ (సాక్షరతా కేంద్రం), ఔరంగాబాద్, భువనేశ్వర్, కాలికట్, చండీగఢ్, చెన్నై, చుచుయిమ్లాంగ్, చురాచంద్పూర్, డామన్, ఢిల్లీ, దిబ్రూగఢ్, దిమాపూర్, గ్యాంగ్టక్, గోరఖ్ పూర్ , గౌహతి, హరిద్వార్, ఇంఫాల్, ఇటానగర్, జమ్మూ, జోర్హాట్, కార్గిల్, కోహిమా, కోల్కతా, కోక్రాఝర్, కొక్రాఝర్, కొక్రహాట్, పఠ్పూర్, పఠి, పఠ్, లంగ్లాంగ్, లక్నో,   సిమ్లా, సిల్చార్, శ్రీనగర్, తేజ్పూర్, తురా, ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్నాయి. సుమారు 700+ సంస్థల ఉనికితో భారతదేశం అంతటా తమ శాఖలతో ఉన్నది[4].

మూలాలు

[మార్చు]
 1. ThroughEducation (2019-12-15). "What Is Formal Education?". Through Education (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-01-31. Retrieved 2023-01-31.
 2. ThroughEducation (2019-12-15). "What Is Formal Education?". Through Education (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-01-31. Retrieved 2023-01-31.
 3. "National Institute of Electronics and Information Technology (NIELIT)". chea.org. 31 January 2023. Retrieved 31 January 2023.
 4. 4.0 4.1 Admin_HQ (2020-02-24). "Objectives". www.nielit.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
 5. "Courses offered by National Institute of Electronics and Information Technology, New Delhi - reg". dpe.gov.in. 31 January 2023. Retrieved 31 January 2023.
 6. HQ_Content_Creator (2021-11-12). "Formal Courses". www.nielit.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2023-01-31.