పంజాబ్ తిరుగుబాటు
భారత రాష్ట్రమైన పంజాబ్లో తిరుగుబాట్లు 1970ల్లో ఖలిస్తాన్ సమర్థకులు సహా కొందరు సిక్కులు తీవ్రవాదంలో చేరడంతో ప్రారంభమయ్యాయి. ఈ తిరుగుబాటుకు మూలాలు చాలా సంక్లిష్టమైనవి, ఐతే ప్రధాన కారణాలుగా సిక్కు మతానికి, పంజాబీ భాష సరైన గుర్తింపు రాకపోవడం, 1947లో ఏర్పడిననాటి నుంచీ భారత కాంగ్రెస్ ప్రభుత్వం సిక్కలతో సరిగా వ్యవహరించకపోవడం వంటివి ఉన్నాయి. పంజాబ్ లోని అన్ని పాఠశాలల్లో పంజాబీ విద్యార్థులకు హిందీ బోధిస్తూండడంతో తల్లితండ్రులు, భాషా సమాజపు నాయకుల్లో ఈ వైపుగా ఆందోళన ప్రారంభమైంది.[1]
పంజాబ్ కు పంజాబీని అధికారిక భాషగా పున:స్థాపించడం, భాషా సమస్యపై దృష్టిసారించడం వంటి అంశాలపై పంజాబీ సుబా పౌర ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వం పంజాబీ సుబా ఉద్యమాన్ని ఏప్రిల్ 14, 1955లో నిషేధించింది.[2] ఈ సమయంలో సిక్కులు అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేసేవారూ, సాధారణ యాత్రికులు కూడా లాఠీ దెబ్బలు, ఇటుక దెబ్బలు, అరెస్టులు చవిచూశారు. ఆలయాలపై ప్రభుత్వ యంత్రాంగం దాడులు చేసేది.[3] 1965లో భారత-పాకిస్తాన్ యుద్ధం ముగిశాక తుదకు 1966లో పంజాబ్ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలుగా విడిపోయాక, ప్రస్తుత పంజాబ్ రాష్ట్రంలో పంజాబీని అధికారిక భాషగా గుర్తించారు.[4]
ఐతే ఇది అన్ని సమస్యలకూ పరిష్కారం కాలేదు, సిక్కు సమాజంలోని ముఖ్యులు భారతీయ రాష్ట్రంగా తమకున్న సమస్యలు, కోరికలు తీర్చమని కోరారు. 1973లో సిక్కులు ఆనంద్ పూర్ సాహెబ్ తీర్మానం తీసుకువచ్చారు.[5] రాజకీయ, మతపరమైన పలు అంశాలను ఈ తీర్మానంలో పొందుపరిచారు. సిక్కు మతాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రస్థాయి పాలసీలు రూపొందించుకునేందుకు, ప్రతిసారీ కేంద్రం వరకూ రావలసిన అవసరం తప్పేట్టూ గుర్తించే సులువైన డిమాండ్ నుంచి పలు తీవ్రమైన అంశాలు కూడా అందులో ఉన్నాయి. ఆనంద్ పూర్ తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది, క్రమంగా జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అకాలీ దళ్ లో చేరి 1982లో శాంతియుతమైన పాదయాత్రగా ఆనంద్ పూర్ తీర్మానం అమలు కోసం ధరమ్ యుద్ద్ మోర్చాను ప్రారంభించారు. నదీ జలాల్లో సింహభాగం పంజాబ్ కు కేటాయించడం, ఛండీగఢ్ ను పంజాబ్ కు మాత్రమే రాజధానిగా చేయడం వంటి డిమాండ్లు నెరవేరతాయన్న ఆలోచనతో వేలాదిమంది దీనివైపుకు ఆకర్షితులయ్యారు.[6] అప్పటికే తీవ్రవాద ధోరణులు పొడసూపుతుండడంతో, ఈ ఆందోళనను అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆనాటికే సిక్కు ఉగ్రవాదుల చేతిలో హిందువులు, ప్రభుత్వాధికారులు మరణించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాల్పుల్లో దాదాపు వందమంది ఆందోళనకారులు మరణించారు.[7] మరోవైపు ఉగ్రవాద ధోరణులు పెరుగుతూండడంతో ప్రభుత్వం వేలాదిమంది సిక్కులను అరెస్టు చేసింది.[8] భింద్రన్ వాలే పూర్తి సాయుధ ఉగ్రవాద పద్ధతులు ప్రారంభించి పలువురు అమాయకులను, అధికారులను హత్యలు చేయడం, రైళ్ళపై హత్యాకాండలు సల్పడం ప్రారంభించారు.
భింద్రన్ వాలే సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని తన నియంత్రణలోకి తీసుకుని, సిక్కు మతగురువులు మధ్యయుగాల నాటి పోరాట యోధులకు దీవెనలు అందించిన అకాలీతఖ్త్ పై ఆసీనుడై వాస్తవికంగానూ, సంకేతాత్మకంగానూ భారత ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో సవాలు చేశారు. అక్కడి నుంచి ఇచ్చిన ఆదేశాలతో పలువురు ఉగ్రవాదులు పంజాబ్ లోని జనజీవితాన్ని అల్లకల్లోలపరిచారు. జూన్ 6, 1984లో భింద్రన్ వాలే, అతని అనుచరులు ఆపరేషన్ బ్లూస్టార్ లో మరణించారు. ఇందుకోసం ట్యాంకర్లతో స్వర్ణదేవాలయంపై దాడిచేయాల్సి రావడంతో సిక్కు సమాజం ఆగ్రహించింది. ప్రతిగా ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ హత్య చేశారు. ఈ రెండు సంఘటనల అనంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లు కొన్నాళ్ళు సాగి, 1990 దశకం తొలినాళ్ళ వరకూ పంజాబ్ లో సిక్కులు చేపట్టిన హింస సాగింది.[9]
కాలరేఖ
[మార్చు]తేదీ | సంఘటన | మూలం |
---|---|---|
నవంబర్ 1, 1966 | సిక్కు సంఖ్యాధిక్య పంజాబ్ రాష్ట్ర ఏర్పాటు (భారత ప్రభుత్వం పంజాబ్ ను మూడు రాష్ట్రాలుగా (పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్) విభజించింది. | [10] |
మార్చి 1972 | పంజాబ్ ఎన్నికల్లో అకాలీలు పరాజయం పాలై కాంగ్రెస్ గెలిచింది. | |
అక్టోబర్ 17, 1973 | అకాలీలు స్వయంనిర్ణయాధికారాన్ని, ఇతర డిమాండ్లనీ చేశారు. | [11] |
ఏప్రిల్ 25, 1980 | సంత్ నిరంకారీ శాఖకు చెందిన బాబా గురుచరణ్ సింగ్ ను సిక్కు తీవ్రవాదులు కాల్చిచంపారు. | [12] |
జూన్ 2, 1980 | పంజాబ్ లో అకాలీలు ఎన్నికల్లో ఓడిపోయారు. | [13] |
ఆగస్టు 16, 1981 | స్వర్ణ దేవాలయంలో విదేశీ ప్రతినిధులను సిక్కులు కలుసుకుని ప్రత్యేక దేశం కోసం సంప్రదింపులు జరిపారు. | [14] |
సెప్టెంబర్ 9, 1981 | హింద్ సమాచార్ గ్రూప్ వార్తాపత్రికల సంపాదకుడు జగత్ నారాయణ్ హత్య. | [15] |
సెప్టెంబర్ 29, 1981 | పాకిస్తాన్ కు వెళ్తున్న భారత విమానాన్ని దారిమళ్ళించబోయి సిక్కు వేర్పాటువాదులు హతం. | [16] |
ఫిబ్రవరి 11, 1982 | జగ్జిత్ సింగ్ చౌహాన్ కు అమెరికా వీసా. | [17] |
ఏప్రిల్ 11, 1982 | అమెరికాకు చెందిన ఖలిస్తాన్ వేర్పాటువాది జి.ఎస్. ధిల్లాన్ కు భారత వీసా నిరాకరణ. | [18] |
జూలై 1982 | ముఖ్యమంత్రి దర్బారా సింగ్ హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. | [19] |
ఆగస్టు 4, 1982 | అకాలీలు స్వయం ప్రతిపత్తి, మరింత భూభాగం కోసం డిమాండ్ చేశారు. | [20] |
అక్టోబరు 11, 1982 | భారత పార్లమెంట్ లో సిక్కుల ఆందోళనలు. | [19] |
నవంబరు 1982 | ఆసియన్ గేమ్స్ నిర్వహణను జరగనివ్వనని లాంగోవాల్ బెదిరింపు. | [21] |
అక్టోబరు 1983 | ఆరుగురు హిందూ ప్రయాణికుల హత్య. | [22] |
ఫిబ్రవరి 27, 1983 | సిక్కులు దేశీయ విమానాల్లో ప్రయాణించేప్పుడు తాము సంప్రదాయికంగా ధరించే కత్తి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అనుమతించింది. | [23] |
మే 3, 1983 | భింద్రన్ వాలే స్వర్ణ దేవాలయంలో నివసించడం ప్రారంభించి, అక్కడి నుంచి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. | [24] |
అక్టోబరు 14, 1983 | సిక్కు ఉగ్రవాదులు చండీగఢ్ లో ఒక హిందూ పండగలో బాంబుదాడి చేశారు. | [25] |
అక్టోబరు 1983 | వందలాది మంది హిందువులు రైళ్ళు, బస్సుల ప్రయాణాల్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. | [26] |
ఫిబ్రవరి 9, 1984 | వివాహ వేడికుల్లో సిక్కు ఉగ్రవాదుల బాంబుదాడి. | [27] |
ఫిబ్రవరి 19, 1984 | సిక్కు-హిందూ ఘర్షణలు ఉత్తర భారతదేశంలో విస్తరించాయి. | [28] |
ఫిబ్రవరి 24, 1984 | పోలీసుల చేతిలో మరో 6 సిక్కుల మృతి. | [29] |
ఫిబ్రవరి 29, 1984 | ఈసరికి 19 నెలలకు పైగా సాగుతున్న ఉగ్రవాద ఉద్యమానికి స్వర్ణ దేవాలయం కేంద్రబిందువు అయింది. | [30] |
ఏప్రిల్ 3, 1984 | పంజాబ్ లో ఉగ్రవాదులు భయాన్ని, అనిశ్చితత్వాన్ని విస్తరించారు. | [31] |
ఏప్రిల్ 8, 1984 | తాను పరిస్థితులను నియంత్రించలేనని లాంగోవాల్ హెచ్చరించారు. | [32] |
ఏప్రిల్ 15, 1984 | ఉగ్రవాదులు డీఐజీ ఆత్వాల్ ను ఆలయంలో కాల్చిచంపారు. | [33] |
ఏప్రిల్ 17, 1984 | వర్గ పోరాటాల్లో మరణాలు | [34] |
మే 27, 1984 | ఫిరోజ్ పూర్ రాజకీయనాయకుడి హత్య. | [35] |
జూన్ 2, 1984 | పంజాబ్ లో మొత్తం పత్రికలు, ప్రసార సాధనాలు నిలిపివేత, రైళ్ళు, రోడ్లు, విమానయాన సేవలు నిలుపుదల. విదేశీయులు, ఎన్నారైలు రాష్ట్రంలోకి పర్యటించడానికి నిరాకరణ, విద్యుత్తు సరఫరా నిలుపుదల. | [36][37][38] |
జూన్ 3, 1984 | పంజాబ్ భద్రతపై సైన్య నియంత్రణ. | [39] |
జూన్ 5, 1984 | తీవ్ర పోరాటం, పంజాబ్ కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. | [40] |
జూన్ 6, 1984 | అమృత్ సర్ లో స్వర్ణదేవాలయ ఘర్షణ, ఇతర సంఘటనలలో పంజాబ్ వ్యాప్తంగా వందలాది సిక్కుల మృతి. | [41][42] |
జూన్ 7, 1984 | హర్మీందర్ సాహెబ్ లేదా స్వర్ణ దేవాలయాన్ని ఆర్మీ అధీనంలోకి తీసుకుంది. | [43] |
జూన్ 7, 1984 | జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే, ముఖ్య అనుచరులు మృతి. | [44] |
జూన్ 8, 1984 | నిరసనకారులపై కాల్పులు శ్రీనగర్, లూధియానా, అమృత్ సర్ ల్లో 27 మంది సిక్కుల మృతి. | [45] |
జూన్ 9, 1984 | స్వర్ణ దేవాలయంలో ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. | [46] |
జూన్ 10, 1984 | ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు సాగాయని వార్తలు వచ్చాయి. | [47] |
జూన్ 11, 1984 | జలవివాదాలపై చర్చల్లో ఒప్పందం. | [48] |
అక్టోబరు 31, 1984 | తన సిక్కు అంగరక్షకుల చేతిలోనే ఇందిరాగాంధీ హత్య. | [49] |
నవంబరు 1, 1984 | ఢిల్లీలో సిక్కులపై సామూహిక హత్యాకాండ ప్రారంభం. | [50] |
నవంబరు 3, 1984 | భారత సైన్యం, స్థానిక పోలీసులు సిక్కు వ్యతిరేక అల్లర్లను అదుపుచేశారు, మొత్తంగా ఢిల్లీలోనే 2,733మంది సిక్కులు మృతిచెందగా, మిగతా ఉత్తర భారతంలో మరో 2వేల మంది సిక్ఖుల హత్య జరిగింది. వార్తలు, నివేదికల ప్రకారం సిక్ఖు మహిళలపై అత్యాచారాలు, ఆస్తులపై లూటీలు, విధ్వంసం జరిగాయి. | [50] |
20 ఆగస్టు 1985 | సంత్ హరిచంద్ సింగ్ లాంగోవాల్ హత్య | [51] |
సెప్టెంబరు 29, 1985 | 60% వోటింగ్ నమోదైంది, అకాలీ దళ్ 115 సీట్ల అసెంబ్లీలో 73 గెలుచుకుంది, బర్నాలా ముఖ్యమంత్రి అయ్యారు | [52] |
జనవరి 26, 1986 | సిక్ఖుల ప్రపంచ స్థాయి సమావేశం జరిగింది. అకాలీ తఖ్త్ పునర్నిర్మాణం చేయాలని నిర్ణయమైంది, ఐదుగురు సభ్యులున్న పంతిక్ కమిటీ ఎన్నికైంది, ఖలిస్తాన్ రాజ్యాంగ ముసాయిదా రాశారు. | [53] |
ఏప్రిల్ 29, 1986 | అకాలీ తఖ్త్ వద్ద సమావేశానికి దాదాపుగా 80వేల మంది సిక్ఖులు హాజరయ్యారు, సర్బత్ ఖల్సా చేసిన తీర్మానం ద్వారా ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ ఏర్పాటైంది. | [54] |
డిసెంబరు 1, 1986 | ఉగ్రవాదులు 24మంది హిందూ ప్రయాణికులను హత్యచేశారు. | [55] |
మే 19, 1987 | తార్న్ తరాన్ గ్రామ సంఘ వారు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి దీపక్ ధవాన్ ను దారుణంగా హత్యచేశారు. | |
మే 12, 1988 | భారత సైన్యం ఆపరేషన్ బ్లాక్ థండర్ 2లో భాగంగా హర్మీందర్ సాహిబ్ పై దాడిచేసి, ఉగ్రవాదులను చంపి స్వాధీనపరుచుకున్నారు. | [56] |
జనవరి 10, 1990 | బాతాలా పోలీస్ శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ గోబింద్ రామ్ ను బాంబు దాడిలో చంపారు. ఇది గోరా చూరా గ్రామంలో సిక్ఖు మహిళలపై పోలీసులు చేసిన అత్యాచారాలకు ప్రతీకారంగా జరిగింది. | [57][58] |
జూన్ 16, 1991 | 80 మందిని రెండు రైళ్ళు ఆపి ఉగ్రవాదులు చంపారు | [59] |
ఫిబ్రవరి 25, 1992 | పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం | [60] |
సెప్టెంబరు 3, 1995 | బాంబు దాడిలో ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య | [61] |
1997 | రాష్ట్ర ఎన్నికల్లో ఎస్ఎడి, బిజేపీ విజయం | [62] |
జూన్ 2001 | చౌహాన్ భారతదేశానికి ఆగమనం | [63] |
ఫిబ్రవరి 26, 2002 | అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. | [64] |
ఏప్రిల్ 4, 2007 | సిక్ఖు ఉగ్రవాద నేత జగ్జీత్ సింగ్ చౌహాన్ తన 80వ ఏట అనారోగ్య కారణాలతో మరణం | [63] |
మూలాలు
[మార్చు]- ↑ Ray, Jayanta (2007). Aspects of India's International Relations, 1700 to 2000: South Asia and the World. India: Pearson Education India. p. 507. ISBN 9788131708347.
- ↑ Sarhadi, Ajit (1970). Punjabi Suba. U. C. Kapur. p. 246.
- ↑ Sarhadi, Ajit (1970). Punjabi Suba (The Story of The Struggle). Delhi: U. C. Kapur & Sons. p. 248.
- ↑ Singh, Atamjit. "The Language Divide in Punjab". South Asian Graduate Research Journal, Volume 4, No. 1, Spring 1997. Apna. Retrieved 4 April 2013.
- ↑ Singh, Khushwant. "The Anandpur Sahib Resolution and Other Akali Demands". oxfordscholarship.com/. Oxford University Press. Retrieved 5 April 2013.
- ↑ Akshayakumar Ramanlal Desai (1 January 1991). Expanding Governmental Lawlessness and Organized Struggles. Popular Prakashan. pp. 64–66. ISBN 978-81-7154-529-2.
- ↑ Akshayakumar Ramanlal Desai (1 January 1991). Expanding Governmental Lawlessness and Organized Struggles. Popular Prakashan. pp. 64–66. ISBN 978-81-7154-529-2.
- ↑ Harnik Deol (2000). Religion and nationalism in India: the case of the Punjab. Routledge. pp. 102–106. ISBN 978-0-415-20108-7.
- ↑ Documentation, Information and Research Branch, Immigration and Refugee Board, DIRB-IRB. India: Information from four specialists on the Punjab, Response to Information Request #IND26376.EX, 17 February 1997 (Ottawa, Canada).
- ↑ Partition of Punjab Goes Into Effect, The New York Times, నవంబరు 2, 1966
- ↑ http://www.khalistan-affairs.org/media/pdf/Anandpur_Sahib_Resolution.pdf Archived 2012-10-14 at the Wayback Machine The Encyclopedia of Sikhism, Vol. 1, 1995, ed., Harbans Singh, page 133-141
- ↑ The New York Times, ఏప్రిల్ 26, 1980.
- ↑ Mrs. Gandhi's Party Wins Easily In 8 of 9 States Holding Elections, The New York Times, జూన్ 3, 1980 [1]
- ↑ IN INDIA, SIKHS RAISE A CRY FOR INDEPENDENT NATION, MICHAEL T. KAUFMAN, THE NEW YORK TIMES, ఆగస్టు 16, 1981
- ↑ GUNMEN SHOOT OFFICIAL IN A TROUBLED INDIAN STATE, THE NEW YORK TIMES, అక్టోబరు 18, 1981
- ↑ Sikh Separatists murdered on Indian Jetliner to Pakistan, MICHAEL T. KAUFMAN, New York Times Sep 30, 1981
- ↑ Two Visa Disputes Annoy and Intrigue India, MICHAEL T. KAUFMAN, The New York Times, ఫిబ్రవరి 11, 1982
- ↑ Sikh Separatist Is Barred From Visiting India, New York Times, Apr 11, 1982
- ↑ 19.0 19.1 ANGRY SIKHS STORM INDIA'S ASSEMBLY BUILDING, WILLIAM K. STEVENS,THE NEW YORK TIMES, అక్టోబరు 12, 1982 [2]
- ↑ The Sikh Diaspora: The Search for Statehood By Darshan Singh Tatla
- ↑ Sikhs Raise the Ante at A Perilous Cost to India, WILLIAM K. STEVENS, New York Times, నవంబరు 7, 1982
- ↑ INDIAN GOVERNMENT TAKES OVER A STATE SWEPT BY RELIGIOUS STRIFE, WILLIAM K. STEVENS, అక్టోబరు 7, 1983
- ↑ Concessions Granted to Sikhs By Mrs. Gandhi's Government, New York Times, ఫిబ్రవరి 28, 1983
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F6071FF73E5C0C708CDDAC0894DB484D81&scp=8&sq=Bhindranwale&st=nyt SIKH HOLY LEADER TALKS OF VIOLENCE, WILLIAM K. STEVENSS, The New York Times, మే 3, 1983
- ↑ Mrs. Gandhi Says Terrorism Will Fail, WILLIAM K. STEVENS, The New York Times, అక్టోబరు 16, 1983
- ↑ 11 PEOPLE KILLED IN PUNJAB UNREST, WILLIAM K. STEVENS, The New York Times, ఫిబ్రవరి 23, 1984
- ↑ General Strike Disrupts Punjab By SANJOY HAZARIKA, The New York Times, ఫిబ్రవరి 9, 1984;
- ↑ Sikh-Hindu Clashes Spread in North India, New York Times, ఫిబ్రవరి 19, 1984
- ↑ Sikh-Hindu Violence Claims 6 More Lives, New York Times, ఫిబ్రవరి 25, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F10C17FE3F5D0C7A8EDDAB0894DC484D81&scp=14&sq=Bhindranwale&st=nyt Sikh Temple: Words of Worship, Talk of Warfare, New York Times, ఫిబ్రవరి 29, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F5071EFB345D0C708CDDAD0894DC484D81&scp=11&sq=Bhindranwale&st=nyt WITH PUNJAB THE PRIZE, SIKH MILITANTS SPREAD TERROR, New York Times, ఏప్రిల్ 3, 1984
- ↑ SIKH WARNS NEW DELHI ABOUT PUNJAB STRIFE, New York Times, ఏప్రిల్ 8, 1984
- ↑ http://query.nytimes.com/gst/fullpage.html?res=9D01E4DA1438F936A25757C0A962948260&scp=15&sq=Bhindranwale&st=nyt, New York Times, ఏప్రిల్ 15, 1984
- ↑ 3 Sikh Activists Killed In Factional Fighting, New York Times, ఏప్రిల్ 17, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F40616FE3F5F0C748EDDAC0894DC484D81&scp=22&sq=Bhindranwale&st=nyt 5 MORE DIE IN CONTINUING INDIAN UNREST, New York Times, ఏప్రిల్ 17, 1984
- ↑ Hamlyn, Michael (1984-06-06). "Journalists removed from Amritsar: Army prepares to enter Sikh shrine". The Times. p. 36.
- ↑ Tully, Mark (1985). Amritsar: Mrs Gandhi's Last Battle. Jonathan Cape.
- ↑ "Gun battle rages in Sikh holy shrine". The Times. 1984-06-05. p. 1.
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=FB0A11FB3E5F0C708CDDAF0894DC484D81&scp=9&sq=Bhindranwale&st=nyt INDIAN ARMY TAKES OVER SECURITY IN PUNJAB AS NEW VIOLENCE FLARES, New York Times, జూన్ 3, 1984
- ↑ HEAVY FIGHTING REPORTED AT SHRINE IN PUNJAB, New York Times, జూన్ 5, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F10C10FC395F0C758CDDAF0894DC484D81&scp=6&sq=Bhindranwale&st=nyt INDIANS REPORT DAYLONG BATTLE AT SIKH TEMPLE , New York Times, జూన్ 6, 1984
- ↑ "Correcting Previous Statement on Golden Temple". Congressional Record - Senate (US Government). జూన్ 17, 2004. Retrieved 5 ఏప్రిల్ 2013.
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F70914FB395F0C748CDDAF0894DC484D81&scp=3&sq=Bhindranwale&st=nyt 308 PEOLPLE KILLED AS INDIAN TROOPS TAKE SIKH TEMPLE, New York Times, జూన్ 7, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F50A1FF8395F0C7B8CDDAF0894DC484D81&scp=2&sq=Bhindranwale&st=nyt, SIKH CHIEFS: FUNDAMENTALIST PRIEST, FIREBRAND STUDENT AND EX-GENERAL New York Times, జూన్ 8, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F10D11F9395F0C7B8CDDAF0894DC484D81&scp=4&sq=Bhindranwale&st=nyt SIKHS PROTESTING RAID ON SHRINE; 27 DIE IN RIOTS, New York Times, జూన్ 8, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F10D11F9395F0C7B8CDDAF0894DC484D81&scp=4&sq=Bhindranwale&st=nyt SIKHS IN TEMPLE HOLD OUT: MORE VIOLENCE IS REPORTED; 27 DIE IN RIOTS, New York Times, జూన్ 9, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F10911FE385F0C738DDDAF0894DC484D81&scp=8&sq=Bhindranwale&st=nyt INDIAN GOVERNMENT TAKES ON SIKHS IN A BLOODY ENCOUNTER, New York Times, జూన్ 10, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F00B14FB385F0C718DDDAF0894DC484D81&scp=4&sq=Bhindranwale&st=nyt, New York Times, జూన్ 12, 1984
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F1091FFF385D0C728CDDA80994DC484D81&scp=5&sq=Indira+gandhi+killed&st=nyt, GANDHI, SLAIN, IS SUCCEEDED BY SON; KILLING LAID TO 2 SIKH BODYGUARDS New York Times, నవంబరు 1, 1984
- ↑ 50.0 50.1 Gupta, Kanchan. "When Congress goons killed thousands of Sikhs". Niti Central. Niti Digital Pvt. Ltd. Archived from the original on 2013-04-30. Retrieved 5 ఏప్రిల్ 2013.
- ↑ Religion and Nationalism in India: The Case of the Punjab,By Harnik Deol, Routledge, 2000
- ↑ http://query.nytimes.com/gst/fullpage.html?res=9E02E5DF1239F93AA1575AC0A963948260&scp=8&sq=punjab+election&st=nyt TEMPLE Gandhi Hails A Loss in Punjab, New York Times, సెప్టెంబరు 29, 1985
- ↑ Tatla, Darsham (2009). The Sikh Diaspora: The Search For Statehood. London: Routledge. p. 277. ISBN 9781135367442.
- ↑ Mandair, Arvind-Pal (2013). Sikhism: A Guide for the Perplexed. A&C Black. p. 103. ISBN 9781441102317.
- ↑ http://select.nytimes.com/gst/abstract.html?res=F50711F83B550C728CDDAB0994DE484D81&scp=54&sq=punjab+election&st=nyt TEMPLE SIKH EXTREMISTS HIJACK PUNJAB BUS AND KILL 24 PEOPLE , New York Times, డిసెంబరు 1, 1986
- ↑ Singh, Sarabjit (2002). Operation Black Thunder: An Eyewitness Account of Terrorism in Punjab. SAGE Publications. ISBN 9780761995968.
- ↑ Mahmood, Cynthia (2011). Fighting for Faith and Nation: Dialogues with Sikh Militants. Philadelphia: University of Pennsylvania Press. p. 46. ISBN 9780812200171.
- ↑ Ghosh, S. K. (1995). Terrorism, World Under Siege. New Delhi: APH Publishing. p. 469. ISBN 9788170246657.
- ↑ http://query.nytimes.com/gst/fullpage.html?res=9D0CE7DE1539F935A25755C0A967958260&scp=3&sq=congress+win+punjab&st=nyt Extremists in India Kill 80 on 2 Trains As Voting Nears End, New York Times, జూన్ 16, 1991
- ↑ The Punjab Elections 1992: Breakthrough or Breakdown? Gurharpal Singh, Asian Survey, Vol. 32, No. 11 (నవంబరు., 1992), pp. 988-999 మూస:JSTOR
- ↑ http://query.nytimes.com/gst/fullpage.html?res=990CE7DE143FF930A3575AC0A963958260&scp=2&sq=beant+Singh+&st=nyt Assassination Reminds India That Sikh Revolt Is Still a Threat , సెప్టెంబరు 3, 1995
- ↑ http://www.punjabilok.com/full_coverage/punjab_election4.htm, Main results of major parties of 1997 elections
- ↑ 63.0 63.1 http://www.nytimes.com/2007/04/11/world/asia/11chauhan.html?_r=1&scp=1&sq=Bhindranwale&st=nyt&oref=slogin, New York Times, ఏప్రిల్ 11, 2007
- ↑ http://www.rediff.com/election/2002/ఫిబ్రవరి/24_pun_agen_rep_20.htm[permanent dead link] Congress gets a simple majority in Punjab, ఫిబ్రవరి 24, 2002