Jump to content

పరికిపండ్ల నరహరి

వికీపీడియా నుండి
పరికిపండ్ల నరహరి
జననం (1975-03-01) 1975 మార్చి 1 (వయసు 49)
విద్యమెకానికల్‌ ఇంజనీరింగ్‌ & ఎంఏ, ఎకనామిక్స్
విద్యాసంస్థఉస్మానియా యూనివర్సిటీ (వాసవి ఇంజినీరింగ్ కళాశాల) & భోజ్ యూనివర్సిటీ, మధ్య ప్రదేశ్
వృత్తి
  • మున్సిపల్‌ పరిపాలనా శాఖ కమిషనర్‌‌, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జీవిత భాగస్వామిఎస్.బి. గీత నరహరి
పిల్లలుఇద్దరు
తల్లిదండ్రులుపరికిపండ్ల సత్యనారాయణ, సరోజ

పరికిపండ్ల నరహరి 2001 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి, రచయిత, పాటల రచయిత. అయన ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్‌ పరిపాలనా శాఖ కమిషనర్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశంలోని నగరాల్లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఇండోర్ 2016లో జాతీయస్థాయిలో 25 స్థానంలో నిలిచింది. ఈసమయంలో ఇండోర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న నరహరి తన వినూత్న ఆలోచనలతో ఎన్నో సవాళ్లను, అడ్డంకులను ఎదురుకొని 2017లో ఇండోర్‌ దేశంలో మొదటి ర్యాంకు సాధించింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పి. నరహరి స్వగ్రామం వరంగల్ జిల్లా, హసన్‌పర్తి మండలం, చింతగట్టు. ఆయన కుటుంబం 1966లో అక్కడి నుండి పెద్దపల్లి జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా), బసంత్‌నగర్‌కు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆయన బసంత్‌నగర్‌లో 1975 మార్చి 1న పరికిపండ్ల సత్యనారాయణ, సరోజ దంపతుల మూడో సంతానంగా జన్మించాడు. ఆయన తండ్రి బసంత్‌నగర్‌లో టైలర్‌గా (దర్జీ) పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను (ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె) కష్టపడి చదివించాడు. నరహరి ప్రాథమిక విద్యాభాస్యం బసంత్‌నగర్‌లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, నిమ్మకూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చి వాసవి కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

పి. నరహరి 1998లో అడ్వాన్స్ రీసర్చ్ విభాగంలో సైంటిస్ట్‌గా పనిచేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి 1999లో సివిల్స్ పరీక్షలు మొదటిసారి రాశాడు. మొదటి ప్రయత్నంలో నిరాశ ఎదురైనా ఉద్యోగం చేస్తూనే ఆయన సివిల్స్‌కు ప్రిపేరై 2001లో రెండో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 78 ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్‌ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. ఆయన ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002 మేలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ పొందాడు.

నిర్వహించిన విధులు

[మార్చు]
  • అసిస్టెంట్ కలెక్టర్‌ - చింద్వారా (2002)
  • అసిస్టెంట్ కలెక్టర్ & సిటీ మేజిస్ట్రేట్ - గ్వాలియర్ (2003)
  • సబ్ డివిజినల్ ఆఫీసర్ (రెవెన్యూ) - ఇండోర్ (2004)
  • ఇండోర్ మునిసిపల్ కమీషనర్ (2005)
  • మహిళా & శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి (2006)
  • చింద్వారా జిల్లా పరిషత్ సి.ఈ.ఓ (2007)
  • సియోని జిల్లా కలెక్టర్ ( 2007 ఆగస్టు 9)
  • సింగరౌలి జిల్లా కలెక్టర్ (2009)
  • గ్వాలియర్ జిల్లా కలెక్టర్ (2011)
  • ఇండోర్ జిల్లా కలెక్టర్ (2015)
  • ఆర్ధిక శాఖ కార్యదర్శి, సమాచార పౌరసంబంధాల కమిషనర్‌, ఐసీడీఎస్ కమిషనర్‌
  • మఖంలాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ - (8 జనవరి - 2019 ఫిబ్రవరి 25, 19 ఏప్రిల్ - 2020 మే 21)

పాటల రచయితగా

[మార్చు]

హిందీ పాటలు

[మార్చు]
2020 జై హింద్ రిషి కింగ్ పి. నరహరి జానపద రిషి కింగ్ & జతింధర్ సింగ్
జీనా జీనా - హౌ టు లివ్ విత్ కోవిద్19 రిషి కింగ్ పి. నరహరి దేవ్ నేగి & రిషి కింగ్
జై హో - కరోనా వారియర్స్ రిషి కింగ్ పి. నరహరి షాన్
ప్లాస్టిక్ రిషి కింగ్ పి. నరహరి రీ మ్యూజికల్ శంకర్ మహదేవన్ & రిషి కింగ్
ఖేళో మధ్య ప్రదేశ్ రిషి కింగ్ పి. నరహరి దేవ్ నేగి
హెల్మెట్ రిషి కింగ్ పి. నరహరి రిషి కింగ్
2019 చౌక రిషి కింగ్ పి. నరహరి రీ మ్యూజికల్ శంకర్ మహదేవన్
యు అర్ స్పెషల్ రిషి కింగ్ పి. నరహరి శివాంగ్ మాథుర్ & దీపాంశు నగర్
ఎంపీ స్వచ్చత గీతం రిషి కింగ్ పి. నరహరి షాన్, పాయల్ దేవ్ రిషి కింగ్, జావేద్ అలీ & దేవ్ నేగి
స్వచ్చత కి రాజధాని రిషి కింగ్ పి. నరహరి షాన్
చీర్ హారన్ రిషి కింగ్ పి. నరహరి, రిషి కింగ్ పాయల్ దేవ్ & రిషి కింగ్
2018 హాట్ట్రిక్ రిషి కింగ్ పి. నరహరి, రిషి కింగ్ హ్రిబొమ్ షాన్, జుబిన్ నౌటియాల్, పాయల్ దేవ్ &రిషి కింగ్
మేరా మధ్య ప్రదేశ్ రిషి కింగ్ పి. నరహరి, రిషి కింగ్ శంకర్ మహదేవన్ & దేవ్ నేగి
ఆవో చాలే స్కూల్ రిషి కింగ్ పి. నరహరి షాన్, జ్యోతిక తాంగ్రి & సుజానే డి'మెళ్లో
2017 హాయ్ హల్ల రిషి కింగ్ పి. నరహరి షాన్ & పాయల్ దేవ్
2016 హో హల్ల రిషి కింగ్ పి. నరహరి షాన్

తెలుగు పాటలు

[మార్చు]
సంవత్సరం పేరు సంగీత దర్శకుడు రచయిత పాట విడుదల చేసినవారు గాయకుడు
2019 మేమేగా నేతన్నలం రిషి కింగ్ పి. నరహరి [3] రీ మ్యూజికల్ పాయల్ దేవ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 May 2017). "ఇండోర్‌ 'స్వచ్ఛత' వెనుక తెలంగాణ బిడ్డ!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  2. Andhra Jyothy (26 August 2020). "ఇండోర్‌ను అగ్రస్థానంలో నిలిపింది మన తెలుగువాడే!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  3. TeluguOne News (6 March 2022). "చేనేతపై పాట రాసిన ఐఏఎస్ అధికారి" (in english). Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)