Jump to content

రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్

వికీపీడియా నుండి
(పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) నుండి దారిమార్పు చెందింది)
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW)
విభాగం అవలోకనం
స్థాపనం 21 సెప్టెంబరు 1968; 56 సంవత్సరాల క్రితం (1968-09-21)
ప్రధాన కార్యాలయం సిజిఓ కాంప్లెక్స్, న్యూఢిల్లీ, భారతదేశం
నినాదం धर्मो रक्षति रक्षितःपरमो धरम (Sanskrit)

(law protects, when it is protected)

Parent విభాగం క్యాబినెట్ సెక్రటేరియట్
Child agencies ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ (ETS)
రేడియో రీసెర్చ్ సెంటర్
స్పెషల్ గ్రూప్
వెబ్‌సైటు
http://www.allgov.com/india/departments/ministry-of-youth-affairs-and-sports/research-and-analysis-wing?agencyid=7606

రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW or Research and Analysis Wing) భారత గూఢచార సంస్థ. 1962 లో జరిగిన భారత-చైనా యుద్ధం, 1965న జరిగిన భారత-పాకిస్థాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది.[1][2][2][3][4] 1968 సెప్టెంబరులో రాను ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వేరుచేసి ఒక సంస్థగా ఏర్పాటుచేసారు. ఇంటెలిజన్స్ బ్యూరో అప్పటికి భారతదేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమాలు చూసేది. రా ముఖ్యకార్యాలయం ఢిల్లీలోని, లోధిరోడ్ లో ఉంది.

ఇంటలిజెన్స్ బ్యూరోని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంజీవి పిళ్ళై డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకొన్న తరువాత అనుభవజ్ఞులైన గూఢచారుల కొరత బాగా కనబడింది. 1962 భారత - చైనా,1965 భారత - పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనబడింది.

1966 తరువాత ప్రత్యేక విదేశీ నిఘా సంస్థ ప్రారంభానికి గట్టి చర్యలు తీసుకొన్నారు. 1968 లో ఇందిరా గాంధీ హయాంలో ఇటువంటి సంస్థ అవసరం బాగా వచ్చింది. ఆర్.ఎన్. కావ్ అప్పటికి ఇంటలిజెన్స్ బ్యూరో డిప్యూటి డైరెక్టర్. అతను ఇటువంటి సంస్థకు గల వివరాలతో గల బ్లూప్రింట్ ను ప్రధానికి ఇచ్చాడు. అప్పుడు 'రా' ఏర్పడి, అతనే 'రా' కు చీఫ్ గా నియమించబడ్డాడు.

ముఖ్య ఉద్ధేశ్యాలు

[మార్చు]
  • పొరుగు దేశాల రాజకీయ, రక్షణ అభివృద్ధిని - భారత దేశ రక్షణ, విదేశీ వ్యవహారలను ప్రభావితం చేయగల వాటిపై నిఘా ఉంచుతుంది.
  • పాకిస్తాన్‌కు రక్షణ దిగుమతులు ఎక్కువగా వెళ్ళకుండా చూడటం. (ముఖ్యంగా యూరప్, అమెరికా, చైనాల నుండి)
  • ప్రపంచ ప్రజల భావాన్ని భారత్ కి అనుకూలంగా మార్చటం.
  • కౌంటర్ ఇంటెలిజెన్స్: శతృ దేశాల నిఘా వర్గాలపై కూడా రా నిఘా పెడుతుంది. ఇది రా పనులలో రెండో అతిపెద్ద పని.

రా గూఢచారులు బహుళజాతి సంస్థల్లో, వార్తా సంస్థల్లో పనిచేస్తూ తమ పని చేసుకొంటూ ఉంటారు. రా ఇతర దేశపు నిఘా సంస్థలతో కూడా సత్సంబంధాలు ఉంచుకొంటుంది. రష్యా ఎఫ్.ఎస్.బి, ఖాడ్, ద అఫ్ఘన్ ఏజెన్సి, మొస్సాద్ (ఇజ్రాయిల్), సి.ఐ.ఏ., ఎం.ఐ.6, వంటి సంస్థలతో సంబంధాలు ఉంచుకుంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ అణుకార్యక్రమాలగూర్చి ఈ సంబంధాలు ఉంచుతుంది. రా మూడో దేశం ద్వారా కూడా సమాచారం సంపాదిస్తుంటుంది, ఆ దేశాల ద్వారా తన కార్యక్రమాలను సాగిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ కింగ్‌డమ్, హాంగ్‌కాంగ్, మయన్మార్, సింగపూర్ వాటిలో కొన్ని.

కార్యకలాపాలు

[మార్చు]

రాకు ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను అప్పజెప్పారు. జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ - రా, ఇంటలిజెన్స్ బ్యూరో, రక్షణ ఇంటలిజెన్స్ సంస్థల మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. కానీ జాతీయ రక్షణ సంస్థ ఏర్పాటు తరువాత జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ దానిలో విలీనం అయ్యింది. రా ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ. అది ఏజెన్సీ కాదు ఒక "వింగ్". కేంద్ర కేబినెట్ లో ఒక భాగం. రా పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. సమాచార హక్కు శాసనం నుంచి దానికి మినహాయింపు ఉంది. అయితే, దాని కార్యకలాపాలను అంతర్గతంగా ఆడిట్ చేస్తారని సూచన ఉంది.[5]

ప్రస్తుతంరా గూఢచారులు ప్రతీ పెద్ద ఎంబసి, హైకమిషన్ లోనూ ఉన్నారు. ఇప్పటికి రాకు సుమారు 10000 మంది గూఢచారులు కేవలం పాకిస్తాన్ లోనే ఉన్నారు. రాకు ఆర్క్-వైమానిక (ARC-Aviation Reasearch Centre) నిఘా వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థలో అత్యాధునిక విమానాలను హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.

డైరెక్టర్లు

[మార్చు]
క్రమ సంఖ్య. డైరెక్టరు నుండి వరకు పని కాలంలో ముఖ్య ఆంశాలు
01 ఆర్. ఎన్. కావ్ 1968 1977 RAW, ARC అరంభ డైరెక్టరు • బంగ్లాదేశ్ విమోచనా యుద్ధం • ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ
02 ఎన్.సంతూక్ 1977 1983 RRC, ETS ఆరంభ డైరెక్టరు
03 గిరీష్ చంద్ర సక్సేనా 1983 1986 అ.సం.రా., సోవియట్ యూనియన్, చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల గూఢచారి విభాగాలతో ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారాలు • 'కనిష్క' విమానం బాంబింగ్ ఉదంతం
04 ఎ.కె.వర్మ 1986 1989
05 జి.ఎస్. బాజ్‌పాయి 1989 1991 విద్రోహ వ్యతిరేక కార్యక్రమాలు
06 ఎన్. నరసింహన్ 1991 1993 ఆపురేషన్ చాళుక్య
07 జె.ఎస్. బేడి 1993 1994 1993 ముంబై పేలుళ్ళుచైనా, పాకిస్తాన్ వ్యవహారాలపైనా, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపైనా నిపుణుడు.
08 ఎ.ఎస్. స్యాలి 1994 1996 ఆర్థిక నేరాలపై పెరిగిన నిఘా • సంస్థలో క్రొత్త ఉద్యోగులను చేర్చుకోవడం, శిక్షణనివ్వడం పై ప్రత్యేక శ్రద్ధ.
09 రంజన్ రాయ్ 1996 1997 ఫార్ఖొర్ అయిర్ బేస్ చర్చలు
10 అరవింద్ దేవె 1997 1999 కార్గిల్ యుద్ధంఆపురేషన్ శక్తి
11 విక్రమ్ సూద్ 1999 2003 IC 814 హైజాకర్లతో చర్చలు • National Technical Facilities Organisation స్థాపన
12 సి.డి.సహాయ్ 2003 2005 ఆపరేషన్ లీచ్ • ARC పునర్వవస్థీకరణ • ఢిల్లీ లోఢీ రోడ్‌లో RAW కేంద్ర కార్యాలయం ఏర్పాటు.
13 పి.కె.హెచ్.తారకన్ 2005 2007 Nuclear Command Authority (India) ఆరంభం
14 అశోక్ చతుర్వేది 2007 2012 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ళు పరిశోధన
15 ఎస్ కె త్రిపాఠి 2012 (ప్రస్తుత డైరెక్టరు)

స్పెషల్ బ్యూరోలు

[మార్చు]

రాకు దేశవ్యాప్తంగా పది స్పెషల్ బ్యూరోలు ఉన్నాయి. ఈ స్పెషల్ బ్యూరోలు భారతదేశ సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో ఒక దానిని లక్ష్యం చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. సాధారణంగా ఆ దేశపు సరిహద్దుకు దగ్గరలోని నగరంలో ఆయా స్పెషల్ బ్యూరోల ప్రధాన కేంద్రం ఉంటుంది.[6]

జోన్ ప్రధాన కేంద్రం జోన్ ఉన్నతాధికారి ర్యాంకు రా నిర్మాణంలో వారి హోదా
ఉత్తర జోన్ జమ్మూ అడిషనల్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ
తూర్పు జోన్ కోల్‌కాతా కమిషనర్ జాయింట్ సెక్రటరీ
వాయువ్య జోన్ ముంబై కమిషనర్ జాయింట్ సెక్రటరీ
ఈశాన్య జోన్ షిల్లాంగ్ కమిషనర్ జాయింట్ సెక్రటరీ
దక్షిణ జోన్ చెన్నై అదనపు కమిషనర్ డైరెక్టర్
సెంట్రల్ జోన్ లక్నో అదనపు కమిషనర్ డైరెక్టర్
పశ్చిమ జోన్ జోధ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ సెక్రటరీ

ప్రముఖ రా గూఢచారులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "B-Net:Reference Publications:India, Intelligence and Security:Encyclopedia of Espionage, Intelligence, and Security (2004)". Findarticles.com. 2 June 2009. Archived from the original on 6 March 2010. Retrieved 11 October 2009.
  2. 2.0 2.1 "Federation of American Scientists". Fas.org. Archived from the original on 3 December 2009. Retrieved 11 October 2009.
  3. John Pike. "Global Security". Global Security. Archived from the original on 14 ఆగస్టు 2014. Retrieved 11 అక్టోబరు 2009.
  4. "RAW: India's External Intelligence Agency". Council on Foreign Relations. Archived from the original on 7 జూలై 2012. Retrieved 2 జూలై 2012.
  5. "RAW: 'రా' ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? వారి గూఢచర్యం ఎలా ఉంటుంది?". BBC News తెలుగు. 2023-09-24. Retrieved 2023-09-24.
  6. Recruitment Notice for Field Assistant (GD), R&AW Headquarters, 13 March 2020, forwarded to District Magistrate, Saiha, Mizoram by Deputy Commissioner, Special Bureau, Aizawl on 2 July 2020, see list of recipients on page 5 of the file, archived copy

వెలుపలి లంకెలు

[మార్చు]