Jump to content

పల్లె రవి కుమార్ గౌడ్

వికీపీడియా నుండి
పల్లె రవి కుమార్‌ గౌడ్‌
పల్లె రవి కుమార్ గౌడ్


చైర్మన్
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ
పదవీ కాలం
2023 ఏప్రిల్ 04 – 07 డిసెంబర్ 2023[1]

వ్యక్తిగత వివరాలు

జననం 1972 ఏప్రిల్ 02
బోడంగిపర్తి, చండూరు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తల్లిదండ్రులు పల్లె లింగయ్య
జీవిత భాగస్వామి పల్లె కళ్యాణి గౌడ్
సంతానం మహిత అక్షర
నివాసం హైదరాబాద్
బోడంగిపర్తి
పూర్వ విద్యార్థి బీఎస్సీ, ఎంసీజే(జర్నలిజం)
వృత్తి జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు

పల్లె రవికుమార్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2023 ఏప్రిల్ 04న తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పల్లె రవి కుమార్ తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలం, బోడంగిపర్తి గ్రామంలో 1972 ఏప్రిల్ 02న జన్మించాడు. ఆయన పాఠశాల విద్యాభాస్యం అంత చండూర్ లో పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఎస్సీ, ఎంసీజే(జర్నలిజం) పూర్తి చేశాడు. పల్లె రవి కమ్యూనిస్ట్‌ కుటుంబ నేపథ్యం కావడంతో విద్యార్థి దశలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లొరైడ్‌ సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.[3][4]

వృత్తి జీవితం

[మార్చు]

పల్లె రవి కుమార్ బిఎస్‌సి, ఎంసిజె పూర్తి చేసి 1996లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో జర్నలిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, 2000 నుండి 2006 వరకు వార్త దినపత్రిక స్టేట్ బ్యురో రిపోర్టర్‌గా,  2006 నుండి 2011 వరకు ఆంధ్రజ్యోతి సీనియర్ కరెస్పాండంట్ గా వివిధ దినపత్రికల్లో పని చేశాడు. ఆయన 2006లో చండూరు వేదికగా వేలాది మందితో భారీ బహిరంగసభను తలపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బలంగా వినిపించే ప్రయత్నం చేశాడు.

పల్లె రవికుమార్ గౌడ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోని జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకురావడంలో క్రియాశీలక పోషించి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ పీపుల్స్ ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పల్లె రవి కుమార్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వివిధ కారణాల వల్ల 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. ఆయన 2022లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి, టికెట్ దక్కకపోవడంతో 2022 అక్టోబర్ 15న ఆయన తన భార్య చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణితో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపులో కీలకంగా పని చేశాడు.[5][6]

పల్లె రవికుమార్‌ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ 2023 ఏప్రిల్ 04న రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.[7][8][9] ఆయన 2023 మే 10న హైదరాబాద్ మాసబ్‌ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో మంత్రులు జగదీశ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, వి. శ్రీనివాస్‌ గౌడ్‌ సమక్షంలో టీటీసీఎఫ్‌సీ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టాడు.[10]

టీటీసీఎఫ్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతూ

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (5 May 2023). "గీతకార్మిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా పల్లె రవి". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
  3. Namasthe Telangana (5 May 2023). "జిల్లాకు మరో కార్పొరేషన్‌ పదవి". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
  4. Sakshi (5 May 2023). "ఉమ్మడి జిల్లాకు మరో కార్పొరేషన్‌ పదవి". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
  5. Namasthe Telangana (15 October 2022). "మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్‌‌.. టీఆర్‌ఎస్‌లో చేరిన పల్లె రవికుమార్‌ గౌడ్‌". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
  6. 10TV Telugu (15 October 2022). "మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. కారెక్కిన కీలక నేత". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Deccan Chronicle (5 May 2023). "Palle Ravi Kumar appointed as chairman of TSTTCFCL". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
  8. Mana Telangana (4 May 2023). "గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌గా పల్లె రవి కుమార్". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
  9. Hindustantimes Telugu (11 May 2023). "కార్పొరేషన్ ఛైర్మన్ గా పల్లె రవి కుమార్ నియామకం". Archived from the original on 11 May 2023. Retrieved 11 May 2023.
  10. Namasthe Telangana (11 May 2023). "పల్లె రవి ప్రమాణ స్వీకారం". Archived from the original on 11 May 2023. Retrieved 11 May 2023.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.