పసుపు ఆకుమచ్చ తెగులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకుమచ్చ తెగులు పసుపు పంట చివరి దశలో అంటే నవంబర్ , డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనబడుతుంది.

కారణాలు[మార్చు]

1.గాలిలో ఎక్కువ తేమ , తక్కువ ఉష్ణోగ్రత ఉండటం. 2.పంటలో సూక్ష్మ వాతావరణం ఎక్కువ తేమగా ఉండటం. 3.పంట అవశేషాలు పొలంలో,పొలం చుట్టూ ఉండటం.

లక్షణాలు[మార్చు]

మొదట ఆకుల పై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి.క్రమేపి ఇవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. దుంపలు,కొమ్మలు ఎదుగుదల తగ్గి దిగుబడి,నాణ్యత తగ్గిపోతాయి.[1]

యాజమాన్య పద్ధతులు[మార్చు]

1.విత్తనశుద్ధి చేయాలి.

2.తెగులుతో మచ్చలు ఉన్న,ఎండిన ఆకులను తొలగించి రాల్చి వేయాలి.

సేంద్రియ నివారణ[మార్చు]

1.ఆవు మూత్రాన్ని మట్టి కుండలో తీసుకుని ఒకవారము పులియా నివ్వాలి.దీనిని పంటపై పిచికారి చేసి శిలీంధ్ర తెగుళ్ళను నివారించవచ్చు .


2.ఒక లీటరు ఆవు మూత్రాన్ని ఒక లీటరు మజ్జిగ,8లీటర్ల నీటితో కలిపిన మిశ్రమాన్ని పంట పైన పిచికారీ చేసి శిలీంద్ర తెగులని నివారించవచ్చు.[2]

మూలాలు[మార్చు]

  1. వివిధ పంటలకు వచ్చే చీడపీడలు వాటి యాజమాన్య పద్ధతులు.
  2. కరదీపిక.