Jump to content

పానుగంటి లక్ష్మీ నరసింహారావు

వికీపీడియా నుండి
(పానుగంటి లక్ష్మీనరసింహరావు నుండి దారిమార్పు చెందింది)
పానుగంటి లక్ష్మీ నరసింహారావు
పానుగంటి లక్ష్మీ నరసింహారావు
జననంపానుగంటి లక్ష్మీ నరసింహారావు
ఫిబ్రవరి 11, 1865
సీతానగరం, రాజమండ్రి తాలూకా
మరణంజనవరి 1, 1940
ప్రసిద్ధిసాహితీవేత్త
మతంహిందూ మతము
తండ్రివేంకటరమణయ్య
తల్లిరత్నమాంబ
సాక్షి పుస్తకం ముఖచిత్రం మీద పానుగంటి వారి చిత్రం.

పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి ana niwaso

ద్యులు.

శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్‌స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చింది. 'రాధాకృష్ణ' వీరి నాటకములలో నాయక రత్నము దానియందు వీరి కవిత పండినది.[1]

సంస్థానాల దివాను

[మార్చు]

వీరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారిజిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.

పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.

సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు.

వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.

చరమదశ

[మార్చు]

ఉద్యోగాల వలన, రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును[2]

1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు.

సాక్షి వ్యాసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]

లక్ష్మీనరసింహారావు పానుగంటి

సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి

ఎంచేతనంటే వాటిలో పేనులాంటి

భావానికాయన ఏనుగంటి

రూపాన్నియ్యడం నేనుగంటి. (శ్రీరంగం శ్రీనివాసరావు.)

కొన్ని రచనలు

[మార్చు]

వికీ మూలాలలొ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (1940). "Wikisource link to పానుగంటి లక్ష్మీనరసింహరావు". Wikisource link to ఆంధ్ర రచయితలు. వికీసోర్స్. 
  2. శత వసంత సాహితీ మంజీరాలు లో పింగళి వెంకటరావు ఉపన్యాస వ్యాసం - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, నిజయవాడ (2002)
  3. పానుగంటి, లక్ష్మీనరసింహారావు. చూడామణి. Retrieved 9 December 2014.
  4. పానుగంటి లక్ష్మీనరసింహారావు (1929). పద్మిని. కాకినాడ: కాకినాడ ముద్రాక్షరశాల. Retrieved 10 September 2020.
  5. కూచి, నరసింహం; లక్ష్మీనరసింహారావు, పానుగంటి (1930). [[ఆనందవాచకపుస్తకము]]. {{cite book}}: URL–wikilink conflict (help)