Jump to content

పాపవినాశనం (ఘంటసాల మండలం)

వికీపీడియా నుండి

పాపవినాశనం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పాపవినాశనం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి వేమూరి సాయి వెంకటరమణ
పిన్ కోడ్ 521 133
ఎస్.టి.డి కోడ్ 08671

సమీప గ్రామాలు

[మార్చు]

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యం

[మార్చు]

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లాపసిషత్ ప్రాథమికోన్నత పాఠశాల,చిట్టూరు, మల్లంపల్లి, కొడాలి

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో డొక్కు లక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రామాలయం

[మార్చు]

ఈ ఆలయంలో 2017,ఆగష్టు-19వతేదీ శనివారంనాడు, కొత్తగా శ్రీ సీతా, రామ. లక్ష్మణ, ఆంజనేయస్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయప్రాంగణంలోని హోమగుండం వద్ద విశేషపూజలు నిర్వహించారు. తొలుత పాండురంగా మహిళా భక్త సమాజంవారు విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో దశమ వార్షికోత్సవాల సందర్భంగా 2014, ఆగష్టు-1వ తేదీ శుక్రవారం నాడు, విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. శ్రీ కొల్లి సుబ్బారావు, బేబీ సరోజిని దంపతులు, ఈ ఆలయ నిర్మాణదాతలు.

సిద్ధ విద్యాపీఠం

[మార్చు]

కార్తీక వనసమారాధన సందర్భంగా ఈ ప్రాంగణంలో శివసిద్ధ యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 2015,నవంబరు-15వతేదీ ఆదివారం రాత్రి, ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కొల్లి బుచ్చికోటేశ్వరరావు (80)

[మార్చు]

ఈ గ్రామ మాజీ సర్పంచి అయిన వీరు కృష్ణాజిల్లాలోనే తొలిసారిగా, క్వినోవా ధాన్యాన్ని పండించుచున్నారు. ప్రొటీన్ల శాతం మనిషికి తక్కువగా, బ్లూటేన్ (గ్లూకోజ్) రహితమైనందువలన, ఈ ధాన్యం మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్యప్రదాయినిగా ఖ్యాతిచెందినది. ఈ ధాన్యం వాణిజ్యపంటగా గూడా పేరొంది, బంగారుపంటల జాబితాలో చేరుతున్నది. ఈ పంట వలన రైతుకు ఒక ఎకరానికి ఐదు లక్షల రూపాయలకు పైగా సంవత్సరానికి ఆదాయం చేకూరుచుండటం విశేషం.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన మునిపల్లి రామకృష్ణ, పంజాబు రాష్ట్రంలో బి.ఎస్.ఎఫ్.కానిస్టేబుల్ గా సేవలందించుచున్నారు. వీరు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకుగాను, పోలీస్ గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైనారు.

ఈ గ్రామములో 2017,మార్చి-24న కళాకారుల సమావేశం నిర్వహించారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]