పాలీసిస్టిక్ అండాశయ వ్యాధి (పీసీఓడీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌)గా పిలిచే ఈ సమస్య 12-45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో వచ్చే హార్మోన్ల రుగ్మత.[1]ప్రతి 10 మందిలో 5 మంది మహిళలు బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ పీసీఓడీపై గ్రామీణ జనాభా సరైన అవగాహన లేదు.కేవలం పట్టణాల్లో ఉండే వారిలో కొందరికి మాత్రమే దీని గురించి కొంచెం అవగాహన ఉంది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60-70 శాతం మంది స్త్రీలు దీని బారిన పడి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు.[2][3]పీసీఓడీకి సరైన చికిత్స లేదు.

పాలిసిస్టిక్‌ నీటి అండాశయం

కారణం

[మార్చు]
పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌

ప్రతి స్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదల అవుతుంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది.ఇందుకు అవసరమయ్యే హార్మోన్‌ ఈస్ట్రోజన్‌.కానీ కొందరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మేల్‌ హార్మోన్లుగా పిలిచే ఆండ్రోజన్స్‌ అధికంగా విడుదలై పీసీఓడీకి దారితీస్తుంది. పీసీఓడీతో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. కొందరిలో హర్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి.ఈ సమస్యతో స్త్రీలకు గర్భం ధరించడం కష్టమవుతుంది.[4]అయితే చక్కటి జీవనశైలి, ఆహారపుటలవాట్లను పాటిస్తే పీసీఓఎస్‌ను అదుపులో తెచ్చుకోవచ్చు.[5][6]

లక్షణాలు

[మార్చు]

రోగనిర్ధారణ పరీక్షలు

[మార్చు]

పీసీఓడీ సమస్యను అల్ట్రాసౌండ్‌ పెల్విక్‌ ఆర్గాన్‌ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. హార్మోన్ల పరీక్ష, ప్రొలాటిన్‌ మొదలగు పరీక్షలు చేయించాలి. రక్తంలోని కొలెస్టాల్ శాతం, చక్కెర శాతం పరీక్షలు థైరాయిడ్‌ పరీక్షలు చేయించాలి.[11]

పీసీఓడీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[మార్చు]
వ్యాయామం చేస్తున్న మహిళ
 • బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
 • ఆహారంలో కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండేవి తీసుకోరాదు.
 • తీపి పదార్థాలు, వెన్న, నెయ్యికి దూరంగా ఉండాలి. బేకరి ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ తినకూడదు.
 • మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి.
 • రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
 • పళ్లూ, ఆకుకూరలూ ఎక్కువ తీసుకోవాలి.
 • చక్కెరలు అధికంగా ఉండే పదార్థాల ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి.
 • ప్రాసెస్డ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, ఫ్రైడ్‌ ఫుడ్‌లో తక్కువగా తీసుకోవాలి
 • పాలు, పాల పదార్థాలు పీసీఓఎస్‌ ఉన్న మహిళలు మాత్రం వీటిని మితంగానే తీసుకోవాలని.[12][13]

సంక్లిష్టతలు

[మార్చు]

పీసీఓడీతో బాధపడుతున్న మహిళలు ఇతర రకాల ఆరోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గుణంకాలు

[మార్చు]

2012 ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 117 మిలియన్ల మహిళలు పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ బారిన పడ్డారు. భారతదేశంలో 10 శాతం మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడ్డారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఐదుగురు మహిళలలో ఒకరికి ఈ సమస్య ఉంది.

మూలాలు

[మార్చు]
 1. Muscogiuri G, Altieri B, de Angelis C, Palomba S, Pivonello R, Colao A, Orio F (September 2017). "Shedding new light on female fertility: The role of vitamin D". Reviews in Endocrine & Metabolic Disorders. 18 (3): 273–283. doi:10.1007/s11154-017-9407-2. PMID 28102491. S2CID 33422072.
 2. Lentscher JA, Slocum B, Torrealday S (March 2021). "Polycystic Ovarian Syndrome and Fertility". Clinical Obstetrics and Gynecology. 64 (1): 65–75. doi:10.1097/GRF.0000000000000595. PMID 33337743. S2CID 229323594.
 3. Wolf WM, Wattick RA, Kinkade ON, Olfert MD (November 2018). "Geographical Prevalence of Polycystic Ovary Syndrome as Determined by Region and Race/Ethnicity". International Journal of Environmental Research and Public Health. 15 (11): 2589. doi:10.3390/ijerph15112589. PMC 6266413. PMID 30463276. indigenous Australian women could have a prevalence as high as 26%
 4. "పీసీఓడీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీకీ దీనికీ లింకేంటి?". BBC News తెలుగు. 2020-10-05. Retrieved 2021-10-30.
 5. Legro, Richard S. (2013). "Diagnosis and Treatment of Polycystic Ovary Syndrome". The Journal of Clinical Endocrinology and Metabolism. 98 (12): 4565–4592.
 6. "మాతృత్వానికే ప్రమాదకారి పీసీఓడీ!". Sakshi. 2021-03-22. Retrieved 2021-10-30.
 7. "What are the symptoms of PCOS?". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development.{{cite web}}: CS1 maint: url-status (link)
 8. Giallauria, Francesco; Palomba, Stefano; Vigorito, Carlo; Tafuri, Maria Giovanna; Colao, Annamaria; Lombardi, Gaetano; Orio, Francesco (2009). "పీసీఓడి ఉన్నవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు". Seminars in Reproductive Medicine (in ఇంగ్లీష్). 27 (04): 306–315. Archived from the original on 2018-06-07. Retrieved 2021-12-26.
 9. Mortada, Rami; Williams, Tracy (2015). "పీసీఓడీ లక్షణాలు". FP essentials. 435: 30–42.
 10. Teede, H; Deeks, A; Moran, L (2010-06-30). "Polycystic ovary syndrome". BMC Medicine. 8: 41.
 11. "Imaging in Polycystic Ovary Disease: Overview, Radiography, Magnetic Resonance Imaging". 2021-06-14. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 12. "పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - food guide for pcos women in telugu". www.eenadu.net. Retrieved 2021-10-30.
 13. Telugu, TV9 (2021-08-06). "PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే." TV9 Telugu. Retrieved 2021-10-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)