పిజ్జా (2012 సినిమా)
Appearance
పిజ్జా | |
---|---|
దస్త్రం:Pizza 2012 poster.jpg | |
దర్శకత్వం | కార్తీక్ సుబ్బరాజ్ |
స్క్రీన్ ప్లే | కార్తీక్ సుబ్బరాజ్ |
కథ | కార్తీక్ సుబ్బరాజ్ |
నిర్మాత | సి. వి. కుమార్ |
తారాగణం | విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్ |
ఛాయాగ్రహణం | గోపీ అమరనాథ్ |
కూర్పు | లియో జాన్ పాల్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | తిరుకుమారన్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | సంగమ్ సినిమాస్ |
విడుదల తేదీ | 19 అక్టోబరు 2012 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹1.5 crore[1] |
బాక్సాఫీసు | est.₹8 crore (US$1.0 million)[1] |
పిజ్జా 2012లో విడుదల అయిన తెలుగు సినిమా. తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సివి కుమార్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్, ఆడుకలం నరేన్ నటించారు. ఈ సినిమా తమిళ "పిజ్జా" కి అనువాదం[2].
నటవర్గం
[మార్చు]- విజయ్ సేతుపతి[3]
- రమ్య నంబీశన్
- ఆడుకలం నరేన్
- కరుణాకరన్
- బాబీ సింహా
- పూజా రామచంద్రన్
- వీర సంతానం
- గజరాజ్
- నలన్ కుమారసామి
- కవిన్
కథ
[మార్చు]మైఖేల్ పిజ్జా హట్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తాడు. మైఖేల్ తన స్నేహితురాలు అయిన అనుతో ఉంటాడు. ఒక రోజు అను గర్భవతిని అని చెప్తుంది. మైఖేల్ పుట్టబోయే బిడ్డ కోసం డబ్బులు పొదుపు చేయాలనీ అనుకుంటాడు. ఒక రోజు పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినపుడు ఒక మహిళ హత్య చేయబడుతుంది. ఆ నేరం మైఖేల్ మీద పడుతుంది. ఆ హత్య నేరం నుండి ఎలా తప్పించుకుంటాడు, పుట్టబోయే బిడ్డ కోసం డబ్బులు ఎలా సంపాదిస్తాడు అనేది మిగతా కథ.[4]
పాటలు
[మార్చు]- నా చెలి నువ్వే కదా
- ఎదో వెతుకులాట
స్పందనలు
[మార్చు]- ఓ చిన్న పాయింట్‌ను తీసుకుని చక్కగా కథ అల్లుకుంటూ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వెళ్ళిపోయాడు. అతనికి బాగా ఉపకరించిన అంశాలు గోపీ అమర్నాథ్ కెమెరా, సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం. వీరిద్దరూ కుడిఎడమలుగా నిలబడి కార్తీక్ అనుకున్న కథకు బలం చేకూర్చారు. దాంతో పాటు విజయ్ సేతుపతి, రమ్య నంబీశన్ ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. సహజంగా ఇలాంటి సినిమాల్లో అరవ వాసన కనిపిస్తుంది. కానీ అదృష్టం బాగుండీ దీనికి అది పెద్దగా సోకలేదు.[5] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ ఫిల్మ్ జర్నలిస్ట్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Direct hits". The New Indian Express. Archived from the original on 29 జూన్ 2013. Retrieved 24 May 2013.
- ↑ "Tamil film 'Pizza'". News18. 2012-10-12. Retrieved 2022-07-08.
- ↑ "Vijay Sethupathi-Pizza". Behindwoods. 2019-03-19. Retrieved 2022-07-08.[permanent dead link]
- ↑ "Movie Review : Pizza". web.archive.org. 2013-03-22. Archived from the original on 2013-03-22. Retrieved 2022-07-08.
- ↑ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "కొత్త రుచిని చవిచూపించే 'పిజ్జా'". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.