Jump to content

పూసపాటి అశోక్ గజపతి రాజు

వికీపీడియా నుండి
(పూసపాటి అశోక గజపతి రాజు నుండి దారిమార్పు చెందింది)
పూసపాటి అశోక్ గజపతి రాజు
పూసపాటి అశోక్ గజపతి రాజు

2014లో పూసపాటి అశోక్ గజపతి రాజు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 జూలై 26
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై

29వ కేంద్ర పౌర విమానయాన మంత్రి
పదవీ కాలం
2014 మే 26 – 2018 మార్చి 9
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అజిత్ సిం‍గ్
తరువాత సురేష్ ప్రభు

పదవీ కాలం
2014 మే 16 – 2019 మే 23
ముందు బొత్స ఝాన్సీ లక్ష్మి
తరువాత బెల్లాన చంద్రశేఖర్
నియోజకవర్గం విజయనగరం శాసనసభ నియోజకవర్గం

రెవెన్యూ, రిలీఫ్, పునరావాస మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
1999 అక్టోబరు 11 – 2004 మే 14
గవర్నరు * కృష్ణకాంత్
తరువాత కొణతాల రామకృష్ణ

ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
1995 సెప్టెంబరు 1 – 1999 అక్టోబరు 10
గవర్నరు * కృష్ణకాంత్

వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
1994 డిసెంబరు 12 – 1995 ఆగస్టు 31
గవర్నరు కృష్ణకాంత్

ఎక్సైజ్ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
1985 మార్చి 9 – 1989 డిసెంబరు 2

వాణిజ్య పన్నుల మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
1983 – 1985

పదవీ కాలం
2009 మే 19 – 2014 మార్చి 28
ముందు కోలగట్ల వీరభద్రస్వామి
తరువాత మీసాల గీత
నియోజకవర్గం విజయనగరం శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
1978 మార్చి 5 – 2003 నవంబరు 14
ముందు అప్పన్నదొర అప్పసాని
తరువాత కోలగట్ల వీరభద్రస్వామి
Constituency విజయనగరం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1951-06-26) 1951 జూన్ 26 (వయసు: 74)
మద్రాస్, మద్రాస్ రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత చెన్నై, తమిళనాడు)
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
జీవిత భాగస్వామి సునీలా గజపతిరాజు
సంతానం అదితి గజపతిరాజు, విద్యా గజపతిరాజు (కుమార్తెలు)
నివాసం విజయనగరం
పూర్వ విద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

పూసపాటి అశోక్ గజపతి రాజు (జననం: 1951 జూన్ 16) రాజకీయ నేత. అతను విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. అతను ప్రస్తుతం 2025 జూలై 26 నుండి గోవా గవర్నర్‌గా పనిచేయుచున్నారు.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే. వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" (1924 మే 1-1995 నవంబరు 14)భారత పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు.[3]

అశోక్​ గజపతిరాజు సతీమణి సునీలా గజపతిరాజు విజయనగరం మున్సిపల్‌ ఛైర్మన్‌గా పని చేసింది. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు 2024 శాసనసభ ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

అశోక్ గజపతిరాజు తొలిసారిగా జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత ఎన్టీఆర్‌ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశాడు.

అశోక్ గజపతిరాజు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[4] 2014 నుంచి 2018 వరకు పౌరవిమానయాన శాఖ మంత్రిగా పని చేసి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించాడు.

గవర్నర్‌గా

[మార్చు]

అశోక్‌ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2025 జులై 14న ఉత్తర్వులు జారీ చేసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "నీతి, నిజాయితీలకు నిలువుటద్దం - దాతృత్వానికి ప్రతిరూపం అశోక్‌ గజపతి రాజు". ETV Bharat News. 14 July 2025. Archived from the original on 15 July 2025. Retrieved 15 July 2025.
  2. "రాజ్‌భవన్‌లోకి రాజు". Andhrajyothy. 15 July 2025. Archived from the original on 15 July 2025. Retrieved 15 July 2025.
  3. "అశోక గజపతి రాజు జాలగూడు సమాచారం". Archived from the original on 2014-01-13. Retrieved 2014-05-26.
  4. "విజయనగరం నియోజకవర్గం ఫలితాలు". Archived from the original on 2014-05-19. Retrieved 2014-05-26.
  5. "గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు". Eenadu. 15 July 2025. Archived from the original on 15 July 2025. Retrieved 15 July 2025.