Jump to content

పొగాకు యాదగిరి

వికీపీడియా నుండి
పొగాకు యాదగిరి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2007 - 2013

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1984 - 1985

వ్యక్తిగత వివరాలు

జననం 1948
మంచిర్యాల, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2013 మార్చి 24
హైదరాబాద్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం పొగాకు జయరాం
నివాసం హైదరాబాద్

పొగాకు యాదగిరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పొగాకు యాదగిరి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో న్యాయవాదిగా పనిచేసి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయనను 1984లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేగా కోటా నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయడంతో టిటిడి పాలకమండలి సభ్యుడిగా, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, రాష్ట్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.

పొగాకు యాదగిరి 2007లో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే కోటా నుండి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

మరణం

[మార్చు]

పొగాకు యాదగిరి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ 2013 మార్చి 24న హైదరాబాద్‌, బోయిన్‌పల్లిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో మరణించాడు.[2] ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "MLCs ELECTED FROM ASSEMBLY CONSTITUENCY" (PDF). 2007. Archived from the original (PDF) on 18 May 2022. Retrieved 18 May 2022.
  2. The New Indian Express (24 March 2013). "TDP MLC Yadagiri dies". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  3. "టిడిపి ఎమ్మెల్సీ కన్నుమూత: బాబు, కిరణ్ సంతాపం". 24 March 2013. Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.